సంజీవని

పిల్లల పోషకాలు ఇవీ.. (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: ఎదిగే పిల్లలకు తగిన పోషక ఆహారం ఎలా ఇవ్వాలో వివరిస్తారా..?
-జె.ఎస్.నారాయణ, కర్నూలు
జ: పిల్లలకు సరైన ఎదుగుదల, తగినంత శరీర దారుఢ్యం అందించటం తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళకు వ్యాయామం కూడా సక్రమంగా అందేలా చూడటమూ తల్లిదండ్రుల బాధ్యతే! పిల్లల శరీర నిర్మాణం బలసంపన్నతతో ఉన్నదో లేదో కూడా తెల్సుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! బడికి తోసేసి బాధ్యత అయిపోయిందనుకోవటమే ప్రమాదకర ఆలోచన. ఒక ఇల్లు కట్టేప్పుడు ఇసుక, ఇటుక, సిమెంటు, ఇనుము వగైరా చాలినంత సరఫరా జరిగితే ఇల్లు దృఢంగా ఉంటుంది. అరకొరగా సరఫరా జరిగితే ఇల్లు బలహీనంగా వుంటుంది. శరీర నిర్మాణమూ అంతే! ఎదుగుతున్న వయసులోనే పోషకాలు బాగా అందాలి. పోషకాలు లేని ‘జంకు ఆహారాల’కు పిల్లలు అలవాటుపడితే శరీర నిర్మాణం బలహీనం అవుతుంది. బిఎంఐ (బోన్ మారో ఇండెక్స్) లాంటివి తేడాలు వస్తాయి. ఆహారానికి సంబంధించిన వ్యాధులు అరవైల్లో రావలసినవి ఇరవైల్లోనే వస్తాయి. ఇరవైయేళ్ళకే గ్యాస్‌ట్రబుల్ అనే వ్యక్తి మార్పు చేసుకోకపోతే పరిస్థితి అరవై యేళ్ళకి ఎలా వుంటుందో ఊహించి చూడండి.. ఇలాంటి వ్యక్తుల్లోనే వివిధ రకాల విటమిన్ల లోపాలు ఏర్పడుతుంటాయి.
ఊళ్ళో ఎక్కువమందికి వచ్చే వ్యాధులు ముందుగానే ఇలాంటి వ్యక్తులను ఆశిస్తాయి. శరీర దారుఢ్యం ఉన్నవాళ్ళు తప్పించుకోగలుగుతారు. బలహీనులు త్వరగా వ్యాధి పాల్పడతారు. జ్వరాల్లాంటి వ్యాధులు వచ్చి తగ్గాక జీర్ణశక్తిని కాపాడే ప్రయత్నం జరగాలి. జబ్బు తగ్గటంతోనే ఎక్కువమంది చికిత్సను వదిలేస్తారు. ‘అసలు చికిత్స’ అనేది వ్యాధి తగ్గాకే అవసరం.
జీర్ణాశయ వ్యస్థను బాగుచేయాలి. తేలికగా అరిగే బలకర పదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి. రక్త, మాంసాలు, ఎముకలు, ఎముకల్లో మూలుగ (మజ్జ్ధాతువు- బోన్‌మారో) ఇవి పుష్కలంగా ఉండే విధంగా ఆహారాన్ని ఇవ్వాలి.
పిల్లల్లో ప్రతి ఏడాది 10 సెం.మీ పొడుగు, కనీసం 3 కిలోల బరువు చొప్పున యుక్తవయసు వచ్చేవరకూ పెరుగుదల కనిపించాలి. ఇంతకు మరీ ఎక్కువ లేదా మరీ తక్కువగా ఉంటే అనారోగ్య సూచన కావచ్చు. వైద్య సలహా అవసరం కావచ్చు.
పనె్నండేళ్ళొచ్చేసరికి పిల్లల్లో హార్మోన్ల ప్రభావం కారణంగా ఎదుగుదల వేగవంతంగా కనిపిస్తుంది. లైంగికావయవాలు, మనోప్రవృత్తుల్లో అనూహ్యమైన మార్పులు గోచరిస్తాయి. ఆడపిల్లలకన్నా మగ పిల్లల్లో 2 సంవత్సరాలు ఆలస్యంగా ఈ మార్పులు మొదలౌతాయి. ఈ దశలో ఆడపిల్లలకు, మగ పిల్లలక్కూడా ఎముక పుష్టి అవసరం అవుతుంది. 18 ఏళ్ళు వచ్చేసరికి పూర్తి వయోజనుడి రూపు రేఖా లావణ్యాలు సంతరించుకుంటారు.
ఆడపిల్లల్లో నెలసరి సమస్యలు వారిని ఎక్కువ ఆందోళనకు గురిచేస్తాయి. నెలసరి ఒక ప్రకృతి ధర్మం. వరం కూడా! దాన్ని శాపంగా భావించుకునే పరిస్థితి రాకూడదు. శరీర ఆరోగ్యం సక్రమంగా లేనపుడు, బలహీనంగా ఉన్నపుడు నెలసరి సమస్యలు పెరుగుతాయి. వాటిని తట్టుకునే శక్తి కొరవడి ఆడపిల్లలు మనోధైర్యాన్ని కోల్పోతారు. శరీరంలో ఏర్పడే ఈ నిర్మాణాత్మక (ఎనబోలిక్) మార్పుల్ని తట్టుకోవడానికి తగిన పోషక విలువలు అందవలసిన సమయం అది.
నెలసరి ప్రారంభమయ్యే కౌమార్యంలోనూ, అలాగే పెరిగి ప్రౌఢగా ఎదిగాక నెలసరి ఆగిపోయే వయసులోనూ కాల్షియం ఎక్కువ అవసరం అవుతుంది. కనీసంలో కనీసం అర గ్రాము నుంచి ఒక గ్రాము వరకు కాల్షియం శరీరానికి అందవలసి వుంటుంది. కౌమార్యంలో ఎముక పుష్టికి ఎక్కువ పోషకాలను అందేలా చూడాలి. పాలు, పెరుగు, మజ్జిగ వాడకం పెరగాలి. పాలతోనూ పెరుగుతోనూ తయారైన వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
మానవ జీవితంలో రాగులు తప్పనిసరిగా తినాల్సిన వయోదశలు రెండు- మొదటిది కౌమార్యం లేదా యవ్వన ప్రాదుర్భావ సమయం. రెండవది మెనోపాజ్ నుండి వృద్ధాప్యం వరకూ! ఈ రెండు వయస్సుల్లో వున్నవారు రాగిపిండితో వంటకాలను ఇష్టంగానూ, కమ్మగానూ వండుకుని తినటం అలవాటు చేసుకోవాలి. మొలకెత్తిన రాగులను ఎండించి మరపట్టించుకుని ఆ పిండి (రాగిమాల్ట్)తో వంటకాలు చేసుకుంటే కొద్దిగా తిన్నా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
తెలుగువారి సంప్రదాయక ఆహారాన్ని గౌరవభావంతో తీసుకునేవారికి పోషక లోపాలు దరిరాకుండా ఉంటాయి. ఆకు కూరలు, కాయగూరలు, పప్పు ధాన్యాలు, నెయ్యి, వెన్న, జున్ను, గ్రుడ్లు, తేలికపాటి మాంసం, శాక మాంసాలు రెండింటితో కూడిన ఆహారం తినదగినవి. నిజానికి కూరగాయలు కూడా కలిసిన మాంసాహారం తెలుగువారి భోజన ప్రత్యేకత. దాన్ని పాటించాలి. వివిధ సీజన్లలో స్థానికంగా దొరికే పండ్లను తీసుకుంటూ ఉండాలి. నేరేడు పండుని సంవత్సరానికి ఒకసారైనా తినాలని మన పెద్దవాళ్ళు చెప్తారు. అది ఒక్క నేరేడు పండుకే కాదు అన్ని సీజనల్ పండ్లకూ వర్తిస్తుంది.
అతి పులుపు, అతి మషాలాలు, అతి ఊరుగాయలు, అతి శెనగపిండి, అతి నూనె ఇవి తెలుగు భోజనాన్ని దెబ్బతీసే అంశాలు. వీటిలో ‘అతి’ని తగ్గిస్తే పోషకాలు వొంటబడతాయి. ఇవి అతిగా తింటే జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది.
సిగరెట్లకూ, మద్యపానానికీ, జంకు ఫుడ్సుకీ అలవాటుపడే వయసు ఇది. తెలిసీ తెలియని వయసులో చుట్టూ వున్న ఆకర్షణలు వారిని అటువైపు నడిపిస్తాయి. 18 ఏళ్ళ లోపు వారికి మద్యం అమ్మబడదు అని బోర్డు పెట్టించిన ప్రభుత్వం 18 ఏళ్ళలోపు వారు మద్యం తాగరాదని ఎందుకు నిషేధం పెట్టరు? ‘‘కల్లు - సారా - బ్రాందీ తాగండోయ్ ప్రజలారా.. కళ్ళు మూయండోయ్’’ అంటోంది ప్రభుత్వం.
శారీరక, మానసిక వ్యాయామం కావాల్సిన వయసులో మన కార్పొరేట్ విద్యా వ్యవస్థ సైంధవుడిలా అడ్డుపడుతోంది. యవ్వన ప్రారంభ కాలంలో పిల్లలకు వ్యాయామం అందకుండాపోయి, ఒక విధమైన అనుత్సాహంలో యువత పెరుగుతోంది. ఆహార నిపుణుల సలహాలు లేకుండా విద్యావ్యవస్థ యువత భవిష్యత్తుని తన చేతుల్లోకి తీసుకుంది. ఇది జాతికి అపకారం. గొప్ప గొప్ప శాస్తవ్రేత్తలు మన యువతరంలోంచి రావాలంటే ఈ వ్యవస్థను సరిదిద్దాల్సి ఉంది.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు