సంజీవని

స్లీప్ ఆప్నియాతో కష్టాలెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న, పెద్ద, ఆడ, మగ భేదం లేకుండా కొందరు గురక పెట్టడం వింటుంటాం.. చూస్తుంటాం.
అది ఆనందించాల్సిన విషయం కాదు. అలాగని ఎదుటివాళ్ళకు డిస్టర్బెన్స్ అని కూడా అనుకుని ఉండడానికి వీల్లేదు. ఇది ఓ అనారోగ్య సమస్యగా గుర్తించాలి. ఇలా గురక పెట్టే వాళ్ళ స్థితి క్రమంగా సీరియస్ కావచ్చు.
శ్వాసనాళంలో అడ్డంకులవల్ల ఈ గురక వస్తుంది. తీవ్రమైన జలుబువల్ల కావచ్చు, ఎలర్జీవల్ల కావచ్చు, టాన్సిల్స్ పెరగడంవల్ల కావచ్చు, ఛాతీ కండరాలు నీరసం కావడంవల్ల కావచ్చు. నిద్రలో ‘స్లీప్ ఆప్నియా’ రావచ్చు. నాలిక మడతపడి శ్వాసనాళానికి అడ్డం పడవచ్చు. రాత్రిళ్ళు నిద్ర సరిగా పట్టదు. ఆ ప్రభావం పగలూ వుంటుంది. పని సరిగా చేయలేరు.
గురక పెడుతున్నంత మాత్రాన ‘స్లీప్ ఆప్నియా’ ఉందనుకోనక్కర్లేదు. వైద్యుణ్ణి సంప్రదించాలి. అతను స్లీప్ క్లినిక్‌కి పంపవచ్చు. అక్కడ మన నిద్ర తీరు, గురక గురించి పరీక్షలు చేస్తారు.
కారణలేమిటో తెలుసుకుంటే దానినిబట్టి చికిత్స ఉంటుంది. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ కారణమైతే వాటిని శస్తచ్రికిత్సతో సరిచేయాలి. ముక్కులో పాలిప్స్ వున్నా శస్తచ్రికిత్సతో తొలగించవచ్చు. కొందరిలో రెండు ముక్కుల మధ్య గోడ వంకరగా వుంటుంది. ఆ వంకరని శస్తచ్రికిత్సతో సరిచేయించవచ్చు. ఒకవేళ సమస్య గొంతు చుట్టూ వున్న కండరాలు నీరసించడంవల్లనైతే సర్జన్ శస్తచ్రికిత్సతో కండరాల్ని టైట్ చేస్తారు. ఆల్కహాల్ సేవనం నిద్రమాత్రలు తీసుకోవడం చేయకూడదు. శరీర బరువు ఎక్కువగా వుంటే తగ్గాలి.
స్లీప్ ఆప్నియా తీవ్రంగా వుంటే మందులున్నాయి. అవసరమైతే శస్తచ్రికిత్స చేస్తారు. ట్రేకియోస్టమి అనే శస్తచ్రికిత్సలో గొంతుకి సన్నని రంధ్రం చేసి, సన్నని గొట్టాన్ని పగలు తీసివేస్తారు, రాత్రిళ్ళు పెడుతుంటారు.
గురకవల్ల గాలి ఊపిరితిత్తులలోకి తక్కువగా వెళ్తుంది. రక్తంలో ఆక్సిజన్ తగ్గి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువవుతుంటుంది. దాంతో ఈ రెండు వాయువుల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది. క్రమంగా ఊపిరితిత్తులు, గుండె దెబ్బతింటాయి.

-డా మోహన్‌రెడ్డి.. నోవా ఇఎన్‌టి క్లినిక్, పంజగుట్ట, హైదరాబాద్.. 9963555244