సంజీవని

భారతీయుల్లో పెరుగుతున్న కొలెరెక్టల్ క్యాన్సర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమేశ్‌కుమార్ (53) అనే సీనియర్ ప్రభుత్వోద్యోగికి శుభోదయమే లేదు. దీనికి కారణం ఆయన మలంలో రక్తం పడటమే. తన మలంలో రక్తం రావడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇటీవల అతిసారం, మలబద్ధకం సమస్యలను ఎదుర్కొంటున్న రమేశ్‌కుమార్ తన శరీరంలో వస్తున్న మార్పులు, నిరంతర ఆరోగ్య సమస్యలపై అనుభవం కలిగి ఉన్నాడు. అనూహ్యంగా బరువు కోల్పోవడంతోపాటు కొన్ని రోజులుగా నిరంతరం బలహీనపడటంతో అలసటకు గురవుతున్న విషయాన్ని నిర్లక్ష్యం చేసిన రమేకుమార్ మలంలో రక్తం రావడంతో అప్రమత్తం అయ్యాడు. దీంతో కుటుంబ వైద్యుడితో సంప్రదించాడు. రమేశ్ చెప్పిన లక్షణాలను అనుగుణంగా వైద్య పరీక్ష నిర్వహించడంతో నిర్థారించిన ఫలితాలు ఆయన, కుటుంబ సభ్యుల గుండె పగిలేలా చేశాయి. అదే ఆయనకు కొలెరెక్టల్ క్యాన్సర్ వున్నదని వైద్యుడు నిర్థారించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న క్యాన్సర్లలో మూడవదీ ఈ కొలెరెక్టల్ క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఏటా 14 లక్షల కొత్త కొలరెక్టల్ క్యాన్సర్ కేసులు నమోదు అవుతుండగా 6.94 లక్షలమంది మృత్యువాత పడుతున్నారు. సుమారు ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి చెందుతున్నారు. 4.7 శాతంమంది పురుషుల్లో, 4.4 శాతం మహిళల్లో జీవిత మనుగడ సమస్య ఎదురవుతున్నది. ఈ సమస్య పెద్దప్రేగు వెంబడి అభివృద్ధి చెందడం గమనార్హం.
ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్‌కు చెందిన కొలెరెక్టల్ సర్జరీ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ కొలెరెక్టల్ సర్జన్ డాక్టర్ వి.కిశోర్ వి. ఆలపాటి కొన్ని విషయాలను తెలియజేశారు.
వయస్సుకు అనుగుణంగా కొలరెక్టల్ క్యాన్సర్ నివారణ మార్గాలున్నాయి. 50 ఏళ్ళ తర్వాత ముప్పు ఎక్కువ. ఇతర కుటుంబ సభ్యులకు కొలరెక్టల్ క్యాన్సర్ వచ్చినా దీనితో అనుబంధం ఉంటుంది. అయితే జీవనశైలిలో అనుసరిస్తున్న విధానమే కొలరెక్టల్ క్యాన్సర్‌కు కారణాలు అని తెలిపారు. మీ తిండి అలవాట్లు, బరువు, భౌతిక శ్రమ తదితర అంశాలు మీలో కొలరెక్టల్ క్యాన్సర్ పెరుగుదలకు కారణాలు కావచ్చు. స్ర్తి పురుషుల్లో ఎవరైనా ఊబకాయంతో బాధపడుతుంటే వారికి ఈ ముప్పు పొంచి ఉన్నట్లే. పురుషులకు అధికంగా సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రతివారం సుమారు నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తే కొలరెక్టల్ క్యాన్సర్ సోకే ముప్పు తగ్గుతుందన్నారు.
‘లాపరోస్కోపిక్ కొలెరెక్టల్ సర్జరీ ద్వారా సురక్షితంగా పెద్దప్రేగు, చిన్నప్రేగు, పురీషనాళంలో క్యాన్సర్ సోకిన భాగాలను తొలగించవచ్చు. కెమెరా సాయంతో కడుపులో నాలుగు చోట్ల కత్తిరించడం ద్వారా క్యాన్సర్ కణాలను తొలగించాల్సిన అవసరం వుంటుందన్నారు. లాపరోస్కోపిక్ సర్జరీవల్ల అతి తక్కువ కాలం ఆసుపత్రిలో ఉండడంతోపాటు పలు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్వల్పనొప్పి, త్వరితగతిన స్వస్థత చేకూరుతుంది.
కొలరెక్టల్ క్యాన్సర్ అనేది మీ ఆహారం, జీవన విధానాన్ని బట్టి ఆధారపడి వస్తుంది. కనుక రెడ్‌మీట్, ప్రాసెస్డ్ మీట్‌ను భోజనంలో తీసుకోవడం నిలిపివేయండి. అత్యధికంగా కూరగాయలు, పండ్లు, ఆహార ధాన్యాలు తీసుకోవడంవల్ల కొలెరెక్టల్ క్యాన్సర్ ముప్పు తగ్గుముఖం పడుతుంది. భౌతిక శ్రమను పెంపొందించుకోవడంతోపాటు, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇటువంటి జాగ్రత్తలతో కొలరెక్టల్ క్యాన్సర్‌తోపాటు వివిధరకాల క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చన్నారు.