సంజీవని

వృద్ధాప్యంలో మతిమరుపు... ఇదీ విరుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది వృద్ధాప్యంలో మతిమరుపుకు గురి అవుతుంటారు. ఇది సహజమే అయినప్పటికి జీవనశైలిని చక్కగా తీర్చిదిద్దుకున్నట్లయితే వృద్ధాప్యంలో కూడా మతిమరుపు సమస్యను అధిగమించవచ్చును. వృద్ధాప్యం లక్షణాలు అగుపడగానే మానసిక ఒత్తిడికి లోనై తాము దేనికి పనికిరాకుండా అయిపోతామని భావించకుండా ఆశావాద దృక్పథాన్ని ఏర్పరచుకుని ముందుకు పోతే వృద్ధాప్యం కూడా ఆనందంగా సాగిపోతుంది.
ఏదైనా విషయం గుర్తుంచుకున్నప్పుడు వెంటనే గుర్తుకు రాకపోవడాన్ని మతిమరుపుగా జ్ఞాపశక్తి లోపంగా భావిస్తాం. మనం పుట్టినప్పటినుంచి చనిపోయేంతవరకు జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లలో నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు తేవడమే జ్ఞాపకశక్తి.
కారణాలు
- సరియైన పోషక ఆహారం తీసుకోకపోవటం
- మెదడులో కణతలు ఏర్పడటంవల్ల మెదడుకు సోకే ఇన్స్‌ఫెక్షన్స్‌వల్ల
- థయామిన్ లోపంవల్ల
- మెదడుకు ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ సరిగా అందని పరిస్థితుల్లో
- తలకు బలమైన గాయాలు తాకడంవల్ల
- కొన్ని రకాల మత్తు పదార్థాలను అధికంగా వాడటంవల్ల (ఆల్కహాలు వంటివి)
- థైరాయిడ్ లోపం
- మానసిక ఒత్తిడి అధికంగా గురికావడం
లక్షణాలు
- సరియైన
సమయంలో చదివింది గుర్తుకు రాకపోవడం
- వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకురాకపోవటం
- కొందరు కొన్ని విషయాలు ఒకటి రెండు రోజులు తర్వాతనే మరచిపోవడం
- కొంతమంది గృహిణిలు బజారుకు వెళ్లిన తర్వాత ఇంటికి తాళం వేసామో, లేదో, గ్యాస్ ఆఫ్ చేశామో లేదో అని ఆందోళన పడటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తమకు జ్ఞాపశక్తి లోపించిందేమో అని ఆందోళన చెందడం సహజం. అలా కాకుండా చేసే పనిమీద దృష్టి సారించి ఏకాగ్రతతో చేయుట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం వలన మానసిక ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ‘జ్ఞాపకశక్తి’ మెరుగుపడుతుంది.
చికిత్స
హోమియోలో జ్ఞాపకశక్తి లోపాన్ని నివారించడానికి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ మందులను ఎన్నుకునే ముందు వ్యక్తిమానసిక, శారీరక అలవాట్లను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞాపకశక్తి లోపానికి గల కారణాలైన భయం, మానసిక ఒత్తిడి, నెగెటివ్ ఆలోచనలు ఉంటే వాటి నుండి బయటపడేందుకు కౌనె్సలింగ్ ఇప్పించాలి.
మందులు
ఎనకార్డియం
జ్ఞాపకశక్తి లోపానికి ఈ మందు బాగా పనిచేస్తుంది. పిల్లలు చదివింది పరీక్షలకు ముందు గుర్తుకు రాక బాధపడుతుంటారు. ఇటువంటి వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
బెరైటాకార్బ్: ముసలివారు మరియు ఎక్కువ బలహీనంగా ఉన్నవారు మతిమరుపుతో బాధపడుతుంటారు. వీరికి మానసిక వికాసం తక్కువ. అలాగే జ్ఞాపశక్తి లోపంతోపాటు పిల్లలలో ఎదుగుదల లోపించి మరుగుజ్జుగా ఉన్నట్లయితే ఈ మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
సల్ఫర్: వీరు పేర్లను మరిచిపోతారు. వీరికి మానసిక శక్తి తక్కువ, బద్ధకస్తులు. వీరు మతిమరుపుతోపాటు, చర్మవ్యాధి, మలబద్ధకంతో బాధపడుతుంటారు. వీరికి పరిశుభ్రతపై పట్టింపు ఉండదు, అపరిశుభ్రంగా ఉంటారు. వీరు చూడటానికి సన్నగా ఉంటారు. కుదురుగా ఒక చోట నిలబడలేరు, వంగి నడుస్తుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
ఎకోనైట్: వీరు తేదీలను మరిచిపోతారు. మానసిక ఒత్తిడివల్ల, టెన్షన్స్‌వల్ల జ్ఞాపకశక్తి తగ్గినట్లు అయితే ఆరంభ దశలో ఈ మందు బాగా పనిచేస్తుంది. అలాగే వీరు చల్లగాలిలో తిరుగాడంవలన ముక్కు బిగుసుకొనిపోయి, తుమ్ములు, గొంతునొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. వీరికి ఆందోళన, దాహం విపరీతంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండి జ్ఞాపకశక్తి లోపంతో బాధపడేవారి ఈ మందు ఆలోచించదగినది.
సిక్యుట విరో: వీరు మందమతులు. వీరి పేరును సైతం మరిచిపోతారు. చివరకు తమ ఇంటి నంబరును, ఫోన్ నెంబరును కూడా మరిచిపోతారు. ఇలాంటి వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా ఎతూజ, ఎసిటిక్ ఆసిడ్, స్ట్ఫాసాగ్రియా, కాల్కేరియాఫాస్, కాలిఫాస్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646