సంజీవని

ఫోరెన్సిక్ సైన్స్... వైద్యరంగంలో వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెంచ్ మెడికో లీగలిస్ట్ డా పి.సి.హెచ్.బి. బ్రోనార్‌డెల్ అనేదేమంటే ‘ఒక మనిషిని శిక్షించాలన్నా, రక్షించాలన్నా అతనిపై ఆరోపించబడిన నేరాన్ని న్యాయ వైద్య సాంకేతికపరమైన పరిధుల్లో నిర్ణయింపగలిగే శాస్త్ర విజ్ఞానం కావాలి’ అన్నాడు. ఆ రీతిగా నేర పరిశోధన శాస్త్రం అన్ని ముఖ్యదేశాలలోనూ తన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘పౌర హక్కులు వృధా అవుతున్నపుడు, హింసాత్మక చర్యలవలననూ, దేశాలు యుద్ధోన్మాదంవలనగాని, పాలనాపరమైన అస్తవ్యస్తతవలన అఘాయిత్యాలూ, అత్యాచారాలూ, దురాగతాలూ జరుగవచ్చు. జరుగుతున్నాయి. అదే సమయంలో సైనిక శక్తిని కావాలనే గల్లంతు చేయడం, మానవ హననం, బతికుండానే పూడ్చిపెట్టడం, విచక్షణారహితంగా కావాలనే శరీరంపై కొన్ని భాగాల్ని గాయపరచడం, సజీవ దహనం చేయడం మొదలైనవి అనేకం జరుగుతూ ఉంటాయి. నేర పరిశోధన కోసం వాటి మూలాలను తెలుసుకోవాలంటే వైద్యశాస్త్రం ఆ మనిషి శరీరానికి సంబంధించిన కొన్ని పరిశీలనల తర్వాత తన రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. న్యాయపరంగా తదుపరి చర్య తీసుకోవడానికి ఈ వైద్య శాస్త్రం ఇచ్చిన రిపోర్టు ఆధారంగా న్యాయాధికారులు తమదైన శైలిలో న్యాయ నిర్థారణ చేస్తారు. దీనినే నేడు ఫోరన్సిక్ సైన్సు లేదా న్యాయ వైద్య సంబంధిత శాస్త్రంగా చెప్పుకోవచ్చు. 20వ శతాబ్దంలో దీని ఆవశ్యకత ఎక్కువగా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోరన్సిక్ సైన్సు పోలీసు శాఖలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫోరన్సిక్ సైన్సు విభాగాలు
ఫోరన్సిక్ ఆంత్రోపాలజీ మనిషిని శరీరకంగా, తన సామాజిక అవసరాల నిర్వహణలో ఎలాగున్నాడన్నది అధ్యయనం చేస్తుంది. రసాయన శాస్త్ర మిశ్రమ అనుబంధాలూ, క్రిమికీటకాలూ, జంతువులూ, పక్షులూ వాటి భిన్న శారీరక నిర్మాణ స్వభావాలూ కాల ప్రాంత పరిమితులూ, లైంగిక అత్యాచారం, దంత నిర్మాణం శరీర ఆకృతి, వయస్సు లాంటివి నిర్థారిస్తుంది. విష రసాయనాలనూ, లభ్యమయ్యే చేయి మరియు కాలి ముద్రలూ మొదలైనవి పరిశోధిస్తుంది. న్యాయస్థానానికి అవసరమైన నేరస్థుని మానవ మనోశాస్త్రం దాని ప్రవర్తనా మంచి చెడులూ ఈ సైన్సు వివరించి తన అభిప్రాయం వెల్లడిస్తుంది. అంతేగాకుండా శరీర అవయవ నిర్మాణం వాటి అంతర్గత పనితీరూ మానసిక వైపరీత్యాలూ ఈ సైన్సు శాస్తయ్రుక్తంగా బహిర్గతం చేస్తుంది. దీనినే జ్గఉడన్ళి డ్ళనిఉ్ళఉడగా వాడుక భాషలో చెపుతారు.
నేర పరిశోధనలో మానవ శరీర నిర్మాణ
జీవశాస్త్రం మరియు వైద్యశాస్త్రం
ఫోర్సనిక్ సైన్సు మానవ ఎముకలు, దంతాలు, శరీరంపై పుట్టుమచ్చలూ తదుపరి ఏర్పడిన మచ్చలూ ఆనవాళ్ళూ తెలుపుతూ దానితోపాటు మరణ సమయం, దానికిగల సమీప కారణం మొదలైనవి తెలియజేస్తుంది. ఒక్కోసారి వైద్య శాస్త్రం ఈ నేర పరిశోధక శాస్త్రంలో సమన్వయమై అది హత్యా, ఆత్మహత్యా, ప్రమాదమా - దానికిగల పూర్వాపరాలను అంచనా వేస్తుంది. కొన్నిసార్లు పాథాలజీ ప్రకారం రుజువుల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.
మానవ నిర్మాణ జీవశాస్త్ర అనుబంధంగా ఫోరన్సిక్ సైన్సు జనుల జీవన స్థితిగతులూ, వేషభాషలూ, పుట్టుపూర్వోత్తరాలు అధ్యయనం చేస్తుంది. అంతేగాకుండా మానవుని పురోగతి, శరీర ఒడ్డూ పొడుగులూ అతను / ఆమె పూర్వీకుల చరిత్రల గురించి కూడా అధ్యయనం ద్వారా వైద్య మరియు న్యాయశాస్త్రానికి ఎంతో ఉపయోగకారిగా ఉంది.
ప్రపంచంలో కొన్ని జాతులు ఒకర్నొకరు పోలి ఉంటారు. శరీర నిర్మాణ శాస్త్ర ప్రవీణుడు మాత్రమే ఆ సూక్ష్మ వైరుధ్యాలను, ఆయా జాతుల శరీర నిర్మాణాలతోపాటు లక్షణాలూ, వృత్తిపరంగా, ప్రదేశపరంగా శరీరంపైగల ఆనవాళ్లూ బహిర్గతం అవుతాయి. ఫోరన్సిక్ ఆంత్రోపాలజిస్టు (మనుష్య వర్ణన శాస్తజ్ఞ్రుడు) ఫోరన్సిక్ పాథాలజిస్టు (రోగ నిర్థారక శాస్తజ్ఞ్రుడు) పరిశీలనలో కొంత సమాచారం బయటపడుతుంది.
డిజిటల్ ఫోరన్సిక్ విధానం
నేర పరిశోధనలో వేలిముద్రలూ, నేరం జరిగిన ప్రదేశంలో లభ్యమైన ఆధారాలూ సేకరించి ఫోరన్సిక్ ఆంత్రపోలజిస్టు ఒక సమగ్ర పరిశీలనాంతరం వాటి సమన్వయంతో ఫోరన్సిక్ పాథాలజిస్టు జరిగిన ఆ నేరం యొక్క పూర్తి వివరాలూ, ప్రదేశం, సంభవించిన ప్రాంతం, కాలపరిమితులతోపాటు బహిర్గతం చేయడంతో నేర నిర్థారణకు న్యాయవాదులకు సరైన మార్గం దొరుకుతుంది.
ఫోరన్సిక్ రిపోర్టులన్నీ నమ్మదగినవేనా?
సమన్వయం, సమగ్రతా లోపంతోపాటు ఆలస్యం ఒక్కోసారి నిర్థారణకు అవాంతరం కావొచ్చు. ఒకసారి న్యూమెక్సికోలోని ఆల్‌బుక్విరోలో ఒక పర్వతారోహకుడికి ఓ అస్థిపంజరం కనిపిస్తే ఆ విషయం పోలీసులకు తెలియజేశాడు. అక్కడికి ఓ జూనియర్ పోలీసు అధికారిని పరిశోధనకు పంపితే కపాలం లేకుండా కొన్ని ఎముకలు పోగుగా కనిపిస్తే వాటిని పాథాలజిస్టు దగ్గరికి కాకుండా అందుబాటులో వున్న ఓ మామూలు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా మిడిమిడి జ్ఞానంతో ఆ డాక్టర్ ఆ ఎముకలు పనె్నండు సంవత్సరాల వయస్సుగల మనిషిదని చెప్పడంతో, అది కాస్తా పనె్నండు సంవత్సరాల అమ్మాయి రేప్ తర్వాత హత్యచేయబడినట్టు, ఆ ఉదంతం నేటికి బయటపడనట్టూ అన్ని వార్తా పత్రికలూ, టీవీ చానెళ్లూ గగ్గోలు చేస్తూ బ్రహ్మాండమైన ప్రచారం చేశాయి.
దాని తర్వాత ఆ ఎముకలు ఫోరన్సిక్ పాథాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లగా అతను ఛాతీ ఎముకల్నీ, తక్కిన ఎముకల్ని లెక్కిస్తే అవి మనిషిలో వుండే ఎముకలకంటే అధికంగా వున్నాయి. వెంటనే ఫోరన్సిక్ ఆంత్రపాలజిస్టు అభిప్రాయం కోసం, అతన్ని పిలవగా మరోసారి ఆ ఎముకల్ని లెక్కించి తనదైన అనుభవంతో పరిశీలించాడు. మెడ తెగనరికిన ఆనవాలుతోపాటు, నడుంపై కూడా అదే ఆనవాలూ స్పష్టంగా లభ్యమయ్యాయి. చేతివేళ్ల ఎముకలూ, కాళ్ల వేళ్ల ఎముకలూ గమనించిన తర్వాత, ఆఖరికి తేలిందేమంటే అదో చిన్న ‘ఎలుగుబంటి’ అని.
వాస్తవాలు ప్రక్కతోవకి
తెలివైన హంతకులు చేసే వరుస హత్యలూ, చట్టవ్యతిరేకులు, ఆర్థిక నేరస్థులూ తమ ఆనవాళ్లు దొరక్కుండా అక్కడ కొత్త ఆధారాలు వదిలి, లేదా సృష్టించి ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా నేర పరిశోధకులను తికమక చేసే ఉద్దేశంతో ఎనె్నన్నో మోసాలు చేస్తుంటారు. పోలీసులకు నేరస్థులు దొరక్కుండా పోతారు. నేర పరిశోధనలో కాలయాపన జరిగిపోతుంది. నేరస్థులు తప్పించుకునే అవకాశం ఎక్కువ. అయితే ఫోరెన్సిక్ సైన్సు శిక్షణతో నిష్ణాతులైన ఆంత్రపోలజిస్టులైతే వాస్తవాలు వెంటనే బయటకు వస్తాయి.
ఇంతవరకూ జరిగిన పై అధ్యయన, సమాలోచన రీత్యా ఫోరెన్సిక్ సైన్సు ఆధునిక నేర పరిశోధనకు సంబంధించినదేగాక అదో ప్రత్యేక వైద్య శాస్త్ర విజ్ఞానం. చట్టరీత్యా సంబంధిత క్రిమినల్ కేసుల్లో న్యాయనిర్థారణకు దోహదపడి దోషులపై న్యాయపరమైన చర్య తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఫోరెన్సిక్ సైన్స్ ఆధునిక యుగంలో తనదంటూ ఓ శాస్ర్తియ విజ్ఞానంగా అభివృద్ధిగాంచడంవలన నేర పరిశోధనా రంగంలో గొప్ప పాత్ర పోషిస్తుంది.

-జి.నరసింహమూర్తి రిటైర్డ్ ఎయర్‌ఫోర్స్ లాబ్ టెక్నీషియన్.. 8977987266