సంజీవని

రుమాటిక్ జ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది వస్తుంటే ముందు గొంతు రాచుకుపోతుంది. ఇన్‌ఫెక్షన్‌తో శరీరానికి సంబంధించి ఎక్కడ వున్నా గొంతులో ఇన్‌ఫెక్షన్ ఎక్కువవుతుంది. రోగిలో జ్వరంతోపాటు ఛాతీనొప్పి, అలసట లాంటి లక్షణాలు ప్రారంభమవుతుంది. జాయింట్స్ వాచిపోయి ఎర్రగా తయారవుతాయి. తరచు చర్మంలో రాష్ వస్తుంటుంది. క్రమంగా ఈ ఇన్‌ఫెక్షన్ గుండె కవాటాల్ని దెబ్బతీస్తాయి.
సాధారణంగా రుమాటిక్ ఫీవర్‌లో మైట్రల్ వాల్వ్ దెబ్బతింటుంది. మైట్రల్ స్టినోసిస్ వస్తుంది.
చిన్నవయసులోనే ఈ జబ్బు వచ్చి గుండె కవాటాలు దెబ్బతింటాయి. ప్రథమ దశలో గుర్తించలేరు. మధ్యవయసులో సరిగా శ్వాసించలేకపోవటం, అలసట, కళ్లు తిరగడం లక్షణాలతో గుండె జబ్బని తెలుస్తుంది.
యాంటి బయాటిక్ రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడే వాడి ఇన్‌ఫెక్షన్‌ని అదుపులోకి తెచ్చుకుంటే కవాటాలు దెబ్బతినే స్థితికి రాదు. గొంతు రాసుకుపోయే దశలో జాగ్రత్తపడ్డా గుండె కవాటాల్ని కాపాడుకోవచ్చు.
గొడుగు లోపలికి ముడుచుకున్నట్లు మైట్రల్ కవాటం లోపలికి ముడుచుకుపోవడంతో కవాటం సరిగా మూసుకోదు. కవాటం సరిగా పనిచేయకపోవడంతో ఒక్కోసారి రక్తం వెనక్కి వెళ్తుంది. దాంతో మర్మర్ శబ్దం వస్తుంది. ఈ కవాటాలు సమస్య ఎక్కువగా వస్తుంటుంది. వంశపారంపర్యంగా కూడా ఈ ఇబ్బంది రావచ్చు. కొన్ని సందర్భాలలో ఈ అనారోగ్యం ఉన్నట్టుగా కూడా తెలీదు. కొందరిలో చెమటలు పట్టడం, ఛాతిలో ఇబ్బంది, అలసట, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
సాధారణంగా ఈ ఫీవర్ చిన్న వయసులో వస్తుంటుంది. లక్షణాలు కనిపించగానే జాగ్రత్తపడాలి. సరైన చికిత్స వెంటనే అందేలా చూడాలి. వీటన్నింటికన్నా అన్నిరకాల టీకాలను పిల్లలకి పద్ధతి ప్రకారం వేయించడం చాలా అవసరం. ఆ తర్వాత కూడా ఏ అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడికి చూపించాలి. ముఖ్యంగా రుమాటిక్ ఫీవర్ లక్షణాల్ని అసలు విడిచిపెట్టకూడదు. పెరుగుతున్నకొద్దీ ఆ ఫీవర్ దుష్పరిణామాలతో గుండె కవాటాలూ దెబ్బతినే ప్రమాదముంది. దెబ్బతిన్న తర్వాత చికిత్స కోసం పరుగెత్తేకన్నా దెబ్బతినకుండా చూసుకోవడమే మంచిది కదా!

-డా రవికుమార్ ఆలూరి