సంజీవని

డాబుసరి పొట్లాల్లో విషాహారాలు (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు బజార్లో దొరికేవి నీటుగా ఉంటాయి కదా! వాటిని పిల్లలకు పెట్టవద్దని ఎందుకు చెప్తున్నారు? టీవీల్లో ప్రకటనలు ఆవే ఆరోగ్యానికి మంచివని చెప్తున్నాయి, వీటిని నమ్మవచ్చా?
-సరళాజైన్, సికిందరాబాద్
జ: వండి ప్యాక్ చేసి అమ్మే ఆహారం (ఔ్యషళఒఒళజూ చ్య్యిజూ) మన నాగరికతకు గుర్తు. నాగరికతా లక్షణాలు ఆదినుండీ ఉన్నాయి. మూస పోసినట్టు (స్టీరియో టైపుగా) సాగిపోయే జీవితంలోకి కొత్త అలవాట్లు ప్రవేశించటం ఎప్పుడూ ఉంది. తైలపక్వ భక్ష్యాలు శూద్రుడు వండినా బ్రాహ్మణుడు తినవచ్చును... అనే మినహాంపుల్లాంటివి ఈ కొత్త మార్పుల్ని స్వంతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగినవే! కొత్త మార్పులే నాగరికత అంటే!
ఎక్కువ కాలం నిలవుండేలా అతిగా ఉప్పు, తీపి, పులుపు ఇతర రసాయనాలు కలిపి వండి, వాటిని డాబుగా పొట్లాం కట్టి (ప్యాకింగ్) అమ్మటం అనేది ఈనాటి నాగరికత. పొట్లాం ఘనంగా ఉండి, దానిమీద నిలువు గీతలు (బార్‌కోడ్) ముద్రించి ఉంటే అది గొప్ప విదేశీ వంటకం అనీ, అమెరికావాడు తినేదాన్ని ఇవ్వాళ మన పల్లెటూర్లలో కూడా తినగలుగుతున్నారనీ గొప్పగా భావిస్తుంటాం. ఇందులో నిజానిజాల గురించి మనకు ఆసక్తి ఉండదు. ఎందుకంటే, విదేశీ వ్యామోహం అనే రంగుల కలలోంచి బయటకు రావటానికి మన మనసులు అంగీకరించవు కాబట్టి.
పట్టణీకరణంలో ప్రాసెస్డ్ ఫుడ్‌కి డిమాండ్ పెరుగుతుంది. సాంప్రదాయకమైన, ఆరోగ్యదాయకమైన ఆహార పదార్థాల మీద విరక్తి, వైరాగ్యాలు ఏర్పడతాయి. ఇదే ప్రమాదకరమైన విషయం. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో పోషకాలు సమృద్ధిగా వుండి, ఆరోగ్యాన్ని చెడగొట్టే అంశాలు లేవనే హామీ ఉండదు. బదులుగా తీపి, ఉప్పు, రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటుంది. రంగులు కూడా మితిమీరి కలుస్తాయి. రెడీ టు ఈట్... పద్ధతిలో ఈ ఆహార పదార్థాలు ఇంట్లో వండుకునే శ్రమను తగ్గిస్తాయి. డబ్బులు పారేస్తే కొండమీద కోతి పరిగెత్తుకొస్తుందనే ధోరణి ఈనాటిది.
రెడీ మిక్సులు, ఎండించిన పదార్థాలు, పాష్టాలు, చాక్లెట్లు, బిస్కట్లు, బన్నులు, ఇతర బేకరీ ఉత్పత్తులు, ఉదయమే హోటళ్ళ మీద ఆధారపడే ఇడ్లీ, అట్టు, పూరీ, బొంబాయి రవ్వ ఉప్మా, బజ్జీ, పునుగులు, సగం కాల్చి నిలవుంచుకున్న చపాతీలు, ఇలా ఒకటేమిటీ ఉదయం లేచిన దగ్గర్నించీ మనం బజారు తిళ్ళమీదే ఎక్కువ ఆధారపడుతున్నాం. ఆధునిక యంత్రాలతో చేస్తారు కాబట్టి ఖరీదుగానే ఉంటాయి. ఇవి నున్నగా మెరిసేందుకు మైనంతో లామినేషను చేయటం, రంగులు కలిపి డాబుగా కనిపించేలా చేయటం, నిలవుంచే రసాయనాలు, యాసిడ్లను కలపటం, మృదుత్వంకోసం జంతు సంబంధ కొవ్వు కలపటం, ఇంకా చాలా దుర్మార్గాలన్నీ వీటిలో చేరిపోతాయి. విదేశీ కంపెనీల లేబుల్స్‌తో తయారయ్యే నూడుల్స్ వగైరాలలో పాపభీతి లేని రీతిలో ఈ విషాలను కలుపుతున్నారని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అయినా చలించటం లేదు.
ఇలా చలించకపోవటానికి మన జీవనశైలి (జజచిళఒఆకళ) ముఖ్య కారణం. స్ర్తిపురుషులిద్దరూ వివిధ వృత్తి వ్యాపారాల్లో ఉండటం, జీవితంలో వేగం పెరగటం, పరిమిత కుటుంబ వ్యవస్థ, టీవీల్లో ఆకర్షణీయమైన ప్రకటనలు, విదేశీ వ్యామోహాలు, శ్రమ లేకుండా పనులు సమకూరాలనే తత్త్వం పెరగటం, ఈజీ గోయింగ్ విధానాలను ఎక్కువగా పాటించటం, వంటకోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోవటం... ఇలా చాలా కారణాలు ఈ రెడీమేడ్ వంటకాలకోసం ఎగబడేలా చేస్తున్నాయి. మాంసాహార వంటకాలకన్నా శాకాహార వంటకాల మీద వీటి ప్రభావం ఎక్కువుంది.
ఆధునికంగా మనకు 4 రకాలుగా ఈ ప్రమాదకర ఆహార ద్రవ్యాలు కనిపిస్తాయి. నూడుల్స్ లాంటి తక్షణ ఆహారం (జశఒఆ్ఘశఆ చ్య్యిజూ), ఇడ్లీ అట్టు, పూరీ లాంటి వేగాహారం (చ్ఘిఒఆ చ్య్యిజూ), బజ్జీలు, పునుగుల్లాంటివి. వీధుల్లో వండే ఆహారం (ఒఆళళఆ చ్య్యిజూ), అపకారం చేసే పిజ్జాలు, పాష్టాలు ఇతర కృత్రిమ ఆహారం (ఖశరీ చ్య్యిజూ) ఇలా రకరకాల ఆహార ద్రవ్యాలు, పదార్థాలు మార్కెట్టు నిండా ముంచెత్తి ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం అధిక ఉష్ణోగ్రత దగ్గర వేగి ఉంటాయి. అలా అవసరానికి మించి వేగటం వలన వాటిలో ఎక్రిలమైడ్ అనే విష రసాయనం పుట్టి అది కేన్సర్ లాటి అనేక వ్యాధులకు దారితీస్తుంది. కొవ్వు పదార్థాలు, ఉప్పు, తీపి, అధిక కేలరీలనిచ్చే ద్రవ్యాలు వీటిలో ఎక్కువగా కలిసి ఉంటాయి. మన ప్రధాన ఆహారంలో ఈ నాలుగు రకాల వంటకాలు ఎంతెంత ఉంటున్నాయో గమనించి, ఎక్కువగాఉంటే తగ్గించి ముందు జాగ్రత్త పడటం అవసరం.
ఉదయం పూట టిఫిన్లను తగ్గించి, కేరట్, ముల్లంగి, ఇతర కూరగాయ ముక్కలు, పెరుగు, కొద్దిగా అన్నం కలిపి తాలింపు పెట్టిన పెరుగన్నం తినటం ఒక మంచి అలవాటు. దానివలన కలిగే మంచితోపాటు టిఫిన్లను తగ్గించిన లాభం కూడా కలుగుతుంది. కడుపులోకి విషాలు పోవటం కొంత ఆగుతుంది. ఇడ్లీ, దోశ, పూరీ, బొంబాయి రవ్వ ఉప్మా, పునుగులు, బజ్జీలు ఇవన్నీ పిండి వంటలు! పిండి వంటల్ని పండక్కో పబ్బానికో చేసుకోవాలే గానీ, రోజూ తినేవిగా ఉండకూడదు. అతిగా నూనెలో వేగే పదార్థాలను కూడా రోజూ తినటం మన నెత్తికి ప్రమాదాన్ని మనమే తెచ్చుకోవటం అవుతుంది. ఆలూ చిప్సు, మిరప బజ్జీలు, మైసూరు బజ్జీలు, పునుగులు వీటిని వంటే బల్లమీద దండయాత్ర చేయవద్దని మనవి. ఇవి ఎప్పుడో ఒకసారి సరదాగా తినటానికే గానీ, రోజువారీగా తినేందుకు కాదు.
బజార్లోంచి ఇడ్లీ మిక్సులు, దోశ మిక్సులు, గారె మిక్సులు, గులాబీ జామూన్ మిక్సులు, బిసిబెలాబాత్ మిక్సులు, పులిహోర మిక్సులు, జిలేబీ మిక్సులు, రకరకాల సాసులు, కెచప్పులు ఒకటేమిటీ... మన కొంపలంటించే చాలా వాటిని నాగరికత పేరుతోనూ, ఇలాంటివి కొనటం ఒక గొప్ప అనే భావనతోనూ వాడుకోవటం పరిపాటి అయ్యింది. జీవన వేగానికి తగ్గట్టుగా ఎప్పుడో అత్యవసర పరిస్థితిలో తప్ప సాధ్యమైనంతవరకూ వీటిని కొనటాన్ని నియంత్రించుకోవటం అవసరం. వీటి తయారీ మీద ప్రభుత్వ అదుపు లేదని, అందులో చెప్పరాని విషాలున్నాయని ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక నూడుల్సు వ్యవహారం బట్టబయలు చేసింది. అయినా చాలామందికి చీమకుట్టినట్టుగా కూడా లేదు. మోనో సోడియం గ్లూటోనేట్ అనే నిలవుంచే పదార్థమే ప్రమాదకరం అని పరిశోధకులు చెప్తున్నారు. పరిశుభ్రత కూడా ముఖ్యమైనదే!
చాక్లెట్లు, బిస్కత్తులు, చిప్సు, ఐస్‌క్రీములు వగైరా ఇటీవలి కాలంనాటి నాగరిక సదుపాయాలు. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయా...? అప్పటి మనుషులు అనాగరికులని, మనమే నాగరికులమనే భావన సరైనది కాదు. శ్రీనాథాదుల రచనలు చదివితే ఆరేడొందల యేళ్ళ క్రితం మనుషులు మనకన్నా జీవితాన్ని ఎక్కువగా ఎంజాయి చేసినట్టు కనిపిస్తుంది. నాగరికత అనేది మనల్ని దెబ్బతీసేదిగా ఉండకూడదు. మనం కూడా ప్రశ్నించటం అలవాటు చేసుకోవాలి. ఏది పడితే దాన్ని భారతీయులకు పెట్టవచ్చనే అలుసు విదేశీ కంపెనీలకుంది. ఆ నమ్మకాన్ని వారికి కలిగించింది మనమే! ఏది (సరి)పడితే అది మాత్రమే తింటామనీ, హాని చేసేవి మార్కెట్లోకి తెస్తే తిరగ్గొడతామనీ ముక్తకంఠంతో చాటి చెప్పగలగాలి. స్వచ్ఛ్భారత్ అనేది స్వచ్ఛ ఆహారాన్ని ప్రజలకు అందేలా చూడడంలో ఉంటుందని విన్నపం.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002.
సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com