సంజీవని

ప్రాణాలకు పొగబెట్టే ధూమపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరణ్‌సింగ్ తన 14వ ఏటనే ధూమపానం అలవాటు చేసుకున్నాడు. దాని గురించి కూల్‌గా ఆలోచించాల్సి ఉంది. 30వ సంవత్సరంలో అడుగుపెట్టేనాటికి రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు తాగేవాడు. 40 ఏళ్ల మధ్యలోకి వచ్చేసరికి దగ్గుతో బాధపడుతున్నపుడు తుప్పు పట్టిన రంగులో కఫం వచ్చింది. దీంతో భయాందోళననకు గురైన కరణ్‌సింగ్ తక్షణం వైద్యుల సలహా తీసుకున్నాడు. ప్రాజిస్టాన్ ఎమిషన్ ట్రోమోగ్రఫి స్కానింగ్‌లో అతడికి లంగ్ కాన్సర్ వచ్చిందని నిర్థారణైంది. అదృష్టవశాత్తు కరణ్ సింగ్ తనలో వ్యాధి ముదరకముం దే వైద్యుల సలహా తీసుకొనేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. సదరు వైద్యుడు కూడా కరణ్‌సింగ్‌ను లంగ్ కాన్సర్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
ప్రపంచంలోనే ఇతర రకాల కాన్సర్లతో పోలిస్తే లంగ్ కాన్సర్ చాలా విధ్వంసకర వ్యాధి అధి వైద్యులు పేర్కొన్నారు. భారతదేశంలో గతంలో అరుదుగా సోకే వ్యాధి అయినా ప్రస్తుతం దారి బారిన పడుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వున్నది. లంగ్ కాన్సర్ రావడానికి ప్రధాన కారణం ధూమపానమేనని సుస్పష్టం. ధూమపానం చేసేవారి సంఖ్యకు అనుగుణంగా భారత్‌లో లంగ్ కాన్సర్ మహమ్మారి నిష్పత్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ధూమపానం చేసేవారిలో 87 శాతం మంది పురుషుల్లో, 85 శాతం మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు పొడసూపాయి. పాసివ్ స్మోకింగ్ ప్రభావం అదనంగా మూడు శాతం. స్థూలంగా లంగ్ కాన్సర్ బాధితుల కేసులు 90 శాతం నమోదవుతూ వచ్చాయి.
‘‘లంగ్ కాన్సర్ రావడానికి ప్రధాన కారణం ధూమపానమే. దానివల్లే 80 నుంచి 90 శాతంమంది లంగ్ కాన్సర్‌వల్ల మరణిస్తున్నారు. ధూమపానం చేసే పురుషుల్లో లంగ్ కాన్సర్ 23 రెట్లు, మహిళల్లో 13 రెట్లు అభివృద్ధి చెందుతుంది. పొగ తాగని వారిలోనూ 20 నుంచి 30 శాతం మంది పాసివ్ స్మోకింగ్ ప్రభావంతో లంగ్ కాన్సర్ సోకుతుంది’’ అంటున్నారు ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ హేమంత్.
భారత్‌లో పొగాకు అనుబంధ ఉత్పత్తుల వాడకంవల్ల లంగ్ కాన్సర్ సోకుతుంది. బీడీలవల్ల 28.4 నుంచి 79 శాతం, సిగరెట్లతో తొమ్మిది శాతం నుంచి 53.7 శాతం, హుక్కా తాగడంవల్ల 3.4 నుంచి 77.3, మిశ్రమ కారణాలవల్ల 7.5 నుంచి 13.6 శాతంతోపాటు పాసివ్ స్మోకింగ్‌వల్ల 2.23, బీడీ పొగరాయుళ్ల ద్వారా ఇతరుల్లో 2.64 శాతం మందికి లంగ్ కాన్సర్ సోకుతున్నది. భారత్‌లో ధూమపానం చేస్తున్న యువత శాతం క్రమంగా పెరుగుతున్నది. 1998 నుంచి 2010 మధ్యకాలంలో 15-29 మధ్య వయస్కుల్లో ధూమపానం నాలుగు రెట్లు పెరిగిందని ఓ సంస్థ నిర్వహించిన సర్వే పేర్కొంది. ప్రతి సిగరెట్ పఫ్‌వల్ల వారి శరీరంపై ఆరువేలకుపైగా రసాయనాలు ప్రభావం చూపడంతోపాటు 60 రకాల పుండ్లు ఏర్పడతాయి. రోజురోజుకు లంగ్ కాన్సర్‌తో ప్రాణాలకు ముప్పు కొనితెచ్చుకోవడమే అవుతుంది. లంగ్ కాన్సర్ లక్షణాలు వ్యాధి ముదిరేవరకు బయటపడవు. ‘లంగ్ కాన్సర్ ప్రాణాంతక పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రారంభదశలో దీన్ని గుర్తిస్తే పలు రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి’ అని అంటున్నారు డాక్టర్ హేమంత్.