సంజీవని

ప్రశ్న - జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మనం ఎలాంటి సందర్భాలలో వైద్యుణ్ణి కలుసుకోవడం అవసరం?
- శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ వుంటే జ్వరంతో బాధపడుతున్నట్లే. సాధారణంగా శరీరోష్ణత పెరగడం ఇన్‌ఫెక్షన్స్‌కి గురైనట్లే. అలాగే మనం శ్వాసించడంలో కూడా మార్పు రాకూడదు. సాధారణంగా నిముషానికి 12 నుంచి 20 సార్లు శ్వాసించాలి. వ్యాయామానంతరం శ్వాసించే రేటు పెరగవచ్చు. మామూలప్పుడు అంతకన్నా ఎక్కువున్నా, తక్కువున్నా జాగ్రత్తపడాలి. అలాగే గుండె కొట్టుకునే రేట్ పెరిగి దడగా ఉన్నా వెంటనే వైద్యుణ్ణి కలవడం అవసరం.
* గుండె కొట్టుకునే రేట్‌ని ఎలా గురిస్తారు?
- నాడి పట్టుకుని గుండె నిముషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చు. 15 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటోందో తెలుసుకుని, దానిని నాలుగుతో హెచ్చిస్తే, నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చు. సాధారణంగా నిముషానికి గుండె 72 సార్లు కొట్టుకోవాలి. పిల్లల్లో అయితే గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. నిముషానికి 90 నుంచి 120 సార్లు కొట్టుకోవచ్చు. విశ్రాంతి తీసుకున్నప్పుడు పల్స్ రేట్ తగ్గుతుంది. భయపడ్డా, శరీరానికి శ్రమ పెంచినా పల్స్ రేటు పెరగవచ్చు.
* నాడి (పల్స్) అందడం లేదంటూ కంగారు పడతారు?
- పల్స్ అందనప్పుడు తప్పకుండా భయపడాలి. కారణమేమిటంటే గుండె కొట్టుకునే రేట్ పడిపోవడంతో సాధారణంగా ఇలాంటి స్థితి కలగవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్‌లో ఇలా కలగవచ్చు.
* రక్తపోటు గురించి కాస్త వివరంగా చెప్పండి?
- గుండె గట్టిగా ముడుచుకున్నప్పుడు రక్తం బయటకు నెట్టబడి అధిక రేటుని 120 మి.మీ మెర్క్యురి స్థాయిని సూచిస్తుంది. మళ్లీ మామూలు కాగానే 80 మి.మీ ఉంటుంది. దీనిని రక్తపోటుని కనుక్కునే చిన్న యంత్రంతో కొలుస్తారు. ఈ కొలతలకన్నా ఎక్కువగా 140/90, అంతకన్నా ఎక్కువ వున్నట్టు భావిస్తారు.

-డా రవికుమార్ ఆలూరి గుండె, రక్తనాళాల వైద్య నిపుణులు కిమ్స్, కొండాపూర్, హైదరాబాద్.. 9848024638