సంజీవని

ప్రశ్న - జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆల్కహాల్ వల్ల గుండెకి ఎటువంటి అపాయం కల్గుతుంది?
- గర్భం ధరించిన మొదటి నెలల్లో ఆల్కహాల్ సేవిస్తే గర్భస్థ శిశువు గుండె దెబ్బతింటుంది. గుండె కొట్టుకునే పద్ధతిమీద ఆల్కహాల్ తీవ్రంగా పనిచేసి కార్డియోమయోపతి లాంటి జబ్బులకు కారణమవుతుంది. గుండె కొట్టుకునే వేగం మీదా ఆల్కహాల్ ప్రభావముంటుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటుంటే రక్తపోటు పెరుగుతుంది. శరీర బరువు పెరుగుతుంది. వీటివల్ల గుండెకి హాని జరుగుతుంది. లెక్క ప్రకారం, మితంగా తాగితే గుండెపోటు రాదంటారు. గుడ్ కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) పెరుగుతుంది.
మానసిక సమస్యలతో గుండె జబ్బులు రావచ్చంటారా? గుండె జబ్బులతో మానసిక సమస్యలు వస్తాయంటారా?
- రెండు విధాలుగానూ జరగవచ్చు. గుండె జబ్బులలో 10 నుంచి 20 శాతం మానసిక సమస్యలతో రావచ్చు. ఆదుర్దా, లోలోపల కుమిలిపోవడం, డిప్రెషన్ లాంటి వాటి ప్రభావంతో ఛాతీలో నొప్పి, చెమటలు పట్టడం, గుండె కొట్టుకునే రేటు పెరగడంతో జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఈ లక్షణాలు తీవ్రమై ఎంజైనా లేక హార్ట్ ఎటాక్‌కి దారితీయవచ్చు. అలాగే గుండె జబ్బు వచ్చిన వాళ్ళలో ఒక విధమైన భయం ఆందోళన లాంటివి కలుగుతుంటాయి. ముఖ్యంగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వాళ్లలో ఈ ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే మనసు, శరీరము ఒకటే యూనిట్ అంటారు.

-డా రవికుమార్ ఆలూరి గుండె, రక్తనాళాల వైద్య నిపుణులు కిమ్స్, కొండాపూర్, హైదరాబాద్.. 9848024638