సంజీవని

రక్తహీనతతో ప్రాణాలకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ జనాభాలో సగానికిపైగా ఆడవారిని, పావు శాతానికిపైగా మగవారిని, 6-59 నెలల వయసున్న వారిలో 79 శాతం మందిని బాధిస్తూ, 20 శాతం గర్భస్థ మరణాలకు కారణమవుతున్న అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యే రక్తహీనత.
దీన్ని సరైన సమయంలో గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారానే దీన్ని ఎదుర్కోగలం. విశ్వసనీయమైన, వేగవంతమైన, కచ్చితమైన పద్ధతులతో దీన్ని గుర్తించి ముందడుగు వేయడం ద్వారానే రక్తహీతను ఎదుర్కోగలం.
జాతీయ పౌష్టికాహార పర్యవేక్షణా విభాగం (ఎన్‌ఎన్‌ఎమ్‌బి) చేసిన సూక్ష్మ పౌష్టికాహార సర్వేలో బడి వయసుకూడా రాని పిల్లల్లో 70 శాతంమందిలో రక్తహీనత ప్రబలే అవకాశముందని, జిల్లా స్థాయి గృహావసరాల సర్వే (డిఎల్‌హెచ్‌ఎస్), భారతీయ వైద్య పరిశోధనా విభాగం (ఐసిఎంఆర్) చేపట్టిన సర్వేల్లో 70 శాతంమంది గర్భిణీలు, కౌమార దశలో వుండే బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపాయి. అధిక ఆదాయం ఉండే కుటుంబాల్లో కూడా 50 శాతం మంది పిల్లలు, కౌమార దశలోని బాలికలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ధనిక, పేద భేదాలు లేకుండా ప్రజలందరూ బాధపడుతున్న సమస్య.
స్పష్టంగా చెప్పాలంటే రక్తహీనత చాలా నెమ్మదైన, ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. సమాజంలోని వివిధ స్థాయిల్లో వుండే ప్రజల్లో చాలామందికి దీని గురించి సరైన అవగాహన లేదు. దీనిపై సులభమైన, కచ్చితమైన, అందుబాటులో ఉండి, అప్పటికప్పుడు పరీక్షించి, ప్రభావవంతమైన చికిత్సను కూడా అందించగలిగేలా చేసి వేగంగా ప్రబలుతున్న ఈ వ్యాధిని అందుబాటులో తెచ్చే కేంద్రాలను (చికిత్సా కేంద్రాలు అని కూడా అనవచ్చు) ఏర్పాటుచేయాల్సిన సమయమిది అని స్ర్తి సంబంధిత వ్యాధుల, ప్రసూతి అంతర్జాతీయ సమాఖ్య (ఎఫ్‌ఐజిఒ)లో స్ర్తి సంబంధిత వ్యాధుల, ప్రసూతి సంబంధిత భారతీయ సమాఖ్య (ఎఫ్‌ఒజిఎస్‌ఐ) ప్రతినిధి, మాజీ ఎఫ్‌ఒజిఎస్‌ఐ అధ్యక్షురాలు డాక్టర్ హేమా దివాకర్ అన్నారు.
త్వరితంగా, కచ్చితంగా గుర్తించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. ఇది భారత సమాజంలో అధికంగా వ్యాపించి ఉన్న నేపథ్యంలో శరీరంలో ఐరన్ లోపించడంవల్ల వచ్చే రక్తహీనత బాగా విస్తరించి ఉంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేయడంవల్ల ఇది కణ సంబంధమైన బలహీనతలు, రోగ నిరోధక శక్తిని బలహీనపరచడం వంటి బలహీనతల నుంచి మరిన్ని తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. అంతేకాకుండా రక్తహీనత కౌమారదశలో ఉన్న యువతుల శారీరక పని సామర్థ్యం, మెదడు పనితీరు, శరీర భాగాల పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది.
ఆరోగ్య రంగంలో చికిత్స విధానాలు, ఔషధాల్లో వినూత్నమైన ఫలితాలు వచ్చినపుడే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. ఈ మార్పుల కోసమే నేను ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తాను అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి.నడ్డా అన్నారు. త్వరితంగా కచ్చితంగా కనుగొనడమే విజయవంత మైన చికిత్సా ఫలితాలకు కీలకం రక్తహీనతను ముందుగా కనుగొనాలంటే దానికి వేగంగా, ఖచ్చితంగా, విశ్వసనీయంగా, వినియోగించడానికి సులువుగా వుండే పద్ధతులు అవసరం. దీనికి సంబంధించిన పద్ధతులు ఎప్పటినుంచో అందుబాటులోనే ఉన్నా, తప్పుడు పద్ధతులను ఎంచుకోవడం ద్వారా వ్యాధిని గుర్తించకపోవడానికి ఓ కారణం కావచ్చు. సమాచార సేకరణను మానవులు చేయడం ద్వారా ఇందులో దోషాలు అధికంగా వుంటాయి. రక్తహీనత నిర్వహణ విధానాలను ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించడం జరుగుతుంది. రక్తహీనత గురించి దీనివల్ల బాధపడే ప్రజలందరికీ తెలియాలి. రక్తహీనతను త్వరగా కనిపెట్టి, సకాలంలో చికిత్సను అందించడానికి ఇది సహాయపడుతుంది అని చంద్రకాంత్ పాండవ్, సామాజిక ఔషధ విభాగాధిపతి, ఎయిమ్స్, న్యూఢిల్లీ అన్నారు.
టీనేజ్ బాలికల్లో రక్తహీనత సమస్య కనిపిస్తున్నదానికంటే ప్రమాదకరమైనదని యునిసెఫ్ పౌష్టికాహార అధికారి అనూజ భార్గవ అన్నారు. ఇది కేవలం మహిళలకు మాత్రమే వర్తించదు. వారి ద్వారా తర్వాతి తరాలకు కూడా ఈ అనారోగ్యం వ్యాప్తి చెందుతుంది అని అనూజ అన్నారు.
దీని గురించి గురించి మరింత వివరిస్తూ, రక్తహీనత ఉన్న తల్లి కాన్పు సమయంలో తన ప్రాణాలను పణంగా పెడుతుంది. పుట్టే బిడ్డ శరీరంలో కూడా ఐరన్ తక్కువగా ఉండటంవల్ల తను కూడా భవిష్యత్తులో ఇదే సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. అటువంటి బిడ్డ సరిగా పెరగకుండా, బుద్ధి మాంద్యమున్న వ్యక్తిగా మారతాడు అన్నారు.
రక్తహీనతను గుర్తించడం, రోగిలో వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే కీలక నిర్ణయాలు తీసుకోవడం, చికిత్సా సమయంలో పర్యవేక్షణ చేయడం, హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలిస్తూ ఉండటంపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలి. రక్తహీనతను పర్యవేక్షించడానికి వేగవంతమైన, విశ్వసనీయమైన, కచ్చితమైన, వినియోగించడానికి సులువైన హిమోగ్లోబిన్ వ్యవస్థలను కౌడ్ ఆధారిత పరిష్కారాలతో అనుసంధానం చేయడానికి ఇదే సమయం. ఇది కేవలం క్షణాల వ్యవధిలోనే సరైన ఫలితాలను ఇవ్వడం కాకుండా పరిశోధనలకు, సర్వే ఆధారిత కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుంది.