సంజీవని

చలికాలంలో వేధించే దగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఋతువులు మారుతున్నపుడు అంటే ఒక సీజన్ నుంచి మరో సీజన్‌లోకి అడుగుపెడుతున్నపుడు, శరీరంలోని రక్షణ వ్యవస్థ త్వరగా వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటు కాక, తేలికగా ఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశముంటుంది. ఇలా సీజన్ మారుతున్న సందర్భంలో జలుబు, జ్వరం వంటి సమస్యలతో పాటు చాలామంది పొడి దగ్గుతో వేధించబడుతుంటారు.
వైరస్, బాక్టీరియా, ఫంగస్, పరాన్నజీవులవల్ల కలిగిన ఇన్‌ఫెక్షన్ మొదట పొడి దగ్గుతోనే ఆరంభమై బాధిస్తుంటుంది. గొంతు, ముక్కులో ప్రారంభమైన ఇన్‌ఫెక్షన్, ఊపిరితిత్తులవరకూ ప్రయాణించి, శ్వాసమార్గాలలోపల వుండే ‘మ్యూకస్’ పొరను దెబ్బతీస్తాయి. ఫలితంగా పొడిదగ్గు మొదలై సతాయిస్తుంది.
సాధారణంగా ఏ దగ్గు అయినా, వారం రోజులలో తగ్గాలి. వారం దాటినా పొడి దగ్గు వేధిస్తుంటే మాత్రం ప్రమాదకరమైన సమస్య ఉన్నదని భావించి జాగ్రత్తపడాలి. దగ్గుతోపాటు జ్వరం, తలనొప్పి, ఆయాసం వుంటే రక్తపరీక్ష, ఊపిరితిత్తుల ఎక్స్‌రే, శ్వాసకోశాల పరీక్ష చేయించుకోవాలి.
జాగ్రత్తలు
- వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చల్లటి పదార్థాలు, కూల్‌డ్రింక్స్, స్వీట్స్ తీసుకోకూడదు. చల్లటి గాలికి వెళ్ళేముందు మాస్క్ ధరించాలి.
- ఆల్కహాలు, పొగ తాగే అలవాటు వున్నవారు వెంటనే మానివేయాలి.
- బ్రీతింగ్, ఎక్స్‌ర్‌సైజు, ప్రాణాయామం, యోగ నిత్యం చేయాలి.
చికిత్స
వ్యాధి లక్షణాలను, ఉద్రేక ఉపశమనాలనీ, వ్యక్తి శరీర తత్వాన్నీ దృష్టిలో ఉంచుకొని, చికిత్స చేసిన పొడి దగ్గునుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
మందులు
ఎకోనైట్: చల్లగాలిలో తిరగటంవలన పొడి దగ్గు వస్తుంది. పొడి దగ్గు భరించలేకుండా ఉండి మంచంమీద వెల్లకిలా పడుకోలేరు. మూడు, నాలుగు దిండ్లు వేసి ఎత్తుగా పడుకోబెట్టాలి. విపరీతమైన దాహం ఉండి, ఎప్పుడూ చల్లటి పానీయాలు కోరడం ప్రత్యేక లక్షణాలు.
ఇపికాక్: రాత్రిళ్లు దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతిలో గురు గురు శబ్దాలు వస్తుంటాయి. వాంతులు, వికారం ఉంటాయి. వాంతి చేసుకొన్న తర్వాత కూడా, వికారం తగ్గకపోవటం గమనించదగిన లక్షణం. ఈ రోగికి ముక్కులో జిలజిలగా వుండి తుమ్ములెక్కువగా వస్తుంటాయి. ఈ రోగులలో సాధారణంగా దప్పిక ఉండదు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
హెపార్‌సల్ఫ్: గొంతులో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వుండి, పుల్ల అడ్డుపడినట్లుగా అనిపించి, నొప్పిగా ఉంటుంది. ఊపిరితిత్తులలో నెమ్ము ఉండి పిల్లికూతలు వస్తాయి. దగ్గుతోపాటు జ్వరం ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.
స్పాంజి: గొంతు చీరుకుపోతూ, కంగు కంగుమని దగ్గు ఉంటుంది. దగ్గువలన గొంతు బొంగురుపోయి, మాట స్పష్టతను కోల్పోతుంది. ఈ లక్షణం ఉన్న రోగులకు, ఈ మందు ఆలోచించదగింది.
పై మందులతోపాటు, బ్రయోనియా, ఆర్సినిక్ ఆల్బ్, బెల్లడొనా, రస్‌టాక్స్, డల్కమెర, పల్సటెల్లా, ఫాస్పరస్, సల్ఫర్ వంటి కొన్ని మందులను లక్షణాలను అనుసరించి డాక్టరు సలహా మేరకు వాడి ప్రయోజనం పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646