సంజీవని

నిధ్రలేమి నుండి విముక్తి ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన యుగంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో ‘ఇన్‌సోమ్నియా’ అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు వున్నట్లుగా గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది కాని ఈ సమస్యను అనుభవించేవారి బాధ అంతా ఇంతా కాదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా లోలోన మదన పడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకుంటే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
కారణాలు
* మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటం. సరైన ఆహారం తీసుకోకపోవడం.
* దాంపత్య జీవితం సరిగా లేకపోవడం, నెగటివ్ ఆలోచనలు పెరిగి పోవడం.
* అసహజ వాంఛలు, దీర్ఘకాలిక వ్యాధులు. ఆత్మన్యూనత భావన, పర్సనాలిటీ వ్యాధులు.
* అనుమానాలు, జన్యుపరమైన కారణాలు, శారీరక సమస్యలు మొదలైన అనేక అంశాలు నిద్రలేమి సమస్యకు కారణమవుతున్నాయి.
లక్షణాలు
* వీరు నిద్రకు ఉపక్రమించిన తరువాత కొంతసేపటికే నిద్రనుంచి మేల్కొని మరల ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టకపోవడం.
* తలనొప్పి, చిరాకు, ద్వేషం, కోపం ఎక్కువగా వుంటాయి.
* ఏ పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, పనులను వాయిదా వేయడం.
* ఏకాగ్రత లోపించడం, ఆకలి తగ్గిపోవడం, చదువుపై శ్రద్ధ తగ్గడం.
* నీరసంగా వుండటం, తమలో తామే బాధపడటం వంటి లక్షణాలతో ఉంటారు.
జాగ్రత్తలు
* మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం నిత్యం చేయాలి. ఇలాచేస్తే మానసిక ప్రశాంతత కలిగి నిద్రలేమి తీవ్రత తగ్గుతుంది.
* పడుకోవడానికి 2 గంటల ముందుగానే మంచి ఆహారం తీసుకోవాలి.
* ఫాస్ట్ఫుడ్స్, మసాలా పదార్థాలు, వేపుళ్లకు స్వస్తిపలికి పౌష్టికాహారం తీసుకోవాలి.
* ఆకుకూరలకు, వెజిటేబుల్స్, తాజా పండ్లు తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.
* వేళకు ఆహారం తీసుకుంటూ సమయానికి నిద్రపోతూ వుండాలి.
* ప్రతిరోజూ వేకువజామున లేచి 45 ని.లపాటు నడవటం అలవాటు చేసుకోవాలి. తద్వారా రక్తసవరణ క్రమంగా జరిగి మనసు ఉత్తేజ పూరితంగా వుంటుంది.
* నిద్రలేమితో బాధపడేవారు తమ చుట్టూ ప్రశాంత వాతావరణం వుండేలా చూసుకోవాలి.
* అంతర్మథనాలకు దూరంగా వుండడం, భావోద్వేగాలను, ఆలోచనలను, అభిప్రాయాలను అణచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయులతో పంచుకోవడం వంటివి చేస్తే నిద్రలేమి నుంచి తొందరగా బయటపడవచ్చు.
చికిత్స
నిద్రలేమే కదా అని వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. హోమియో వైద్యంలో నిద్రలేమికి మంచి చికిత్స కలదు. ఈ వైద్య విధానంలో మందును ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను, అలవాట్లను పరిగణనలోకి తీసుకుని మందును ఎన్నుకోవడం జరుగుతుంది కావున నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
మందులు
నక్స్‌వామికా: వీరికి ఉదయం సాయంత్రం నిద్ర ఎక్కువగా వస్తుంది. వీరు నిద్రకు ఉపక్రమించిన తరువాత కొంతసేపటికే నిద్ర నుంచి మేల్కొంటారు. భయంకరమైన కలలతో నిద్రనుంచి మేల్కొని మరల ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. మసాలాలు, ఫాస్ట్ఫుడ్స్, కాఫీలు ఎక్కువ సేవించడం, శారీరక శ్రమ తక్కువగా వుండి, మానసిక శ్రమ ఎక్కువగా వున్నవారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
బెల్లడోనా: వీరికి సుఖనిద్ర ఉండదు. నిద్రలో భయంకరమైన ఆకారాలు కనిపిస్తూంటాయ. నిద్రలో మాట్లాడటం చేస్తుంటారు. చిన్న పిల్లల్లా నిద్రా భంగంతో లేచి ఏడుస్తుంటారు. కీళ్ల నొప్పులతో నిద్రపట్టక బాధపడేవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
కాఫియాక్రూడా: శరీరము మెదడు ఎక్కువగా ఉద్రేకం చెందడంమూలాన నిద్ర రాకుండటం. ఇటువంటి లక్షణం వున్నపుడు ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
ఇగ్నీషియా: దుఃఖభారంతో కుంగిపోయినప్పుడు నిద్ర పట్టక, వేదన పడుతున్న సందర్భాల్లో ఈ మందు బాగా పనిచేస్తుంది.
జెల్సిమియం: మానసిక శ్రమ ఎక్కువగా వుండటంవలన నిద్ర పట్టనివారికి ఈ మందు ముఖ్యమైనది. అలాగే ఏ పనిపై శ్రద్ధ పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం, ఏకాగ్రత లోపించడం, ఆకలి తగ్గిపోవడం, చదువుపై శ్రద్ధ తగ్గడం. నీరసంగా ఉండటం, తమలో తామే బాధపడటం వంటి లక్షణాలతో వున్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా పాసిఫ్లోరా, హయోసయామస్, కాలీబ్రోమ్, కాలీఫాస్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడుకొని నిద్ర లేమి నుండి బయటపడవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646