సంజీవని

పొగ తాగని వారిలోనూ సిఓపిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఓపిడి (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) ఇప్పుడు పొగతాగనివారికి కూడా సోకుతుంది. ఈ వ్యాధి 300 లక్షల జీవితాలను ప్రభావితం చేస్తుంది, ఇంకా ఎన్నో సిఓపిడి కేసులను నిర్థారించడం జరగలేదు. తీవ్ర అవరోధాన్ని కలిగించే శ్వాసకోశనాళం వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 5వ ప్రాణాపాయకర వ్యాధిగా విజృంభించింది. సిఓపిడిని పొగతాగేవారి వ్యాధిగా గుర్తించేవారు కాని ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో పొగతాగనివారి సిఓపిడి ఓ కీలకమైన అంశంగా మారింది.
వైకల్యానికి ముఖ్యమైన కారణం, సిఓపిడి అనేది 50 సంవత్సరాలకు పైగా వయసుగల భారతీయులలో మరణానికి రెండవ అగ్రగామి కారణంగా మారింది. అయితే సిగరెట్ తాగడానికి సిఓపిడికి సంబంధం ఉన్న విషయం తెలిసిందే. కాని ఇటీవల అధ్యయనాలలో పొగతాగనివారిని కూడా ప్రేరేపించే ఎన్నో ఇతర అపాయ అంశాలు చూడడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు సగం జనాభా వంటకు మరియు వేడి చేసుకునేందుకు వాడే బయోమాస్ ఇంధనం పొగ బహిర్గతం అవుతుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలలో బయోమాస్‌కి బహిర్గతం అవడం అనేది సిఓపిడికి అగ్రగామి కారణం. దీని మూలంగా సిఓపిడి మృత్యువు రేటు అధికమవుతున్నాయి.
సిఓపిడితో బాధపడుతున్న నాలుగోవంతు వ్యాధిగ్రస్తులు పొగతాగనివారని తేలింది. అవరోధం ఊపిరితిత్తుల వ్యాధి (బిఓఎల్‌డి) అధ్యయనంలో పొగతాగనివారిలో కూడా సిఓపిడి ఉందని తేలింది.
పట్టణ భారతదేశంలోని 32 గృహాలు నేడు బయోమాస్ స్టవ్‌ని వాడుతున్నాయి. 22 శాతం కలపను వాడుతున్నాయి, 8 శాతం కిరోసిన్ వాడుతున్నాయి మరియు మిగిలినవారు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లేదా నేచురల్ గ్యాస్ లాంటి శుద్ధమైన ఇంధనాలను వాడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 50 శాతం సిఓపిడి మృత్యువులు బయోమాస్ పొగకు సంబంధించినవి. దీనిలో దాదాపు 75 శాతం మహిళలు ఉంటున్నారు. కలప, జంతువుల వ్యర్థాల పిడకలు, పంట అవశేషాలు లాంటి బయోమాస్ ఇంధనాలు చురుకైన పొగలా ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయి. అయితే, మహిళలలో సిఓపిడి తాకిడి దాదాపు మూడు రెట్లు పెరిగిందని తెలిసింది. దీనికి కారణాలు ఏంటంటే, మహిళలు మరియు యవ్వన అమ్మాయిలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ సమయాన్ని వంటగదిలోనే గడపడం.
బయోమాస్ ఇంధనం సులభంగా దొరుకుతుంది కాబట్టి చైనా, భారతదేశం మరియు సహారా ఆఫ్రికాలోని 80 శాతానికి మించిన గృహాలు దీనిని వంట కోసం వాడుతున్నాయి. బయోమాస్ ఇంధనాలు అత్యధికంగా గృహంలోనే కాలుష్యాన్ని పెంపొందిస్తాయి. ఎక్కువమటుకు గ్రామీణ ప్రాంతాలలోని వంట గదులలో ప్రాథమిక సదుపాయాలు కూడా ఉండవు మరియు గాలి సరిగ్గా ఆడదు. కాబట్టి గృహిణులు తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యానికి మరియు కణాల పదార్థాలకు గురవుతుంటారు.
భారతదేశంలో నాసిరకం జీవిత ప్రమాణాల మూలంగా సిఓపిడి కారణంగా ఎన్నో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇది ఎంతో ప్రాణాపాయకరమైనది ఎందుకంటే, ఈ వ్యాధిని మనం సరైన సమయంలో గుర్తించి మరియు చికిత్స చేయడంలేదు. ప్రత్యేకించి వ్యాధిగ్రస్తులు పొగ తాగనివారైతే చికిత్స నిర్థారణ చాలా సమయం పడుతుంది.
బయోమాస్ ఇంధనంతోపాటు, పట్టణ ప్రాంతాలో గాలి కాలుష్యానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి సిఓపిడికి కీలకమైన సమస్యగా మారింది. కాలుష్యం పరంగా చూస్తే, ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్యమైన నగరాలలో భారతదేశంలోనే 10 ఉన్నాయి. కేంద్రీయ కాలుష్య నివారణ బోర్డ్ సర్వే ప్రకారం, నియంత్రణగల సమూహంలోని 20.1 శాతంతో పోల్చితే ఢిల్లీలోని వ్యక్తులలో ఊపిరితిత్తుల కార్యాచరణ 40.3 శాతానికి తగ్గింది.
నేడు మనం పీల్చుకుంటున్న గాలి విషపూరితమైనది. గాలిలోగల ఈ నానో కణాల మూలంగా మన ఊపిరితిత్తుల కార్యాచరణ ఎంతో ప్రభావితం అవుతుంది. పట్టణ ప్రాంతంలోని ఈ జీవన పరిస్థితి మూలంగా శ్వాసకోశ వ్యాధులు ఎంతో సమస్యగా మారాయని డాక్టర్లు పేర్కొన్నారు.
సిఓపిడి ఓ వృత్తిపరమైన అపాయం కూడా. జాతీయ ఆరోగ్యం మరియు పౌష్టికాహార పరీక్ష సర్వే (ఎన్‌హెచ్‌ఏఎన్‌ఇఎస్) ఓ సర్వే నిర్వహించింది. దీనిలో పరిశ్రమలు మరియు వృత్తులు సిఓపిడికి పెంపొందుతున్న అపాయాలని తేలింది. వీటితోపాటు రవాణాకు సంబంధించిన వృత్తులు, మెషీన్ ఆపరేటర్స్, నిర్మాణం వ్యాపారాల రవాణా, స్టాక్ మరియు సామాన్ల వ్యవహారాలు, రికార్డుల ప్రాసెసింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ గుమాస్తాలు, అమ్మకాలు మరియు వేట్రెసెస్. సిఓపిడి నిష్పత్తి అంచనా పూర్తి మొత్తం 19.2 శాతం మరియు 31.1 శాతం ఇంతకుముందు ఎన్నడూ పొగతాగనివారిలో.
సిఓపిడి భారానికి జతకలిసే మరో అంశం కొలినెస్టెరెస్ ఇనిబిటింగ్ వ్యవసాయ కీటకనాశినులు. భారతదేశంలో తరచుగా వాడే వ్యవసాయ ఉత్పత్తులకు (ఆర్గానోఫాస్పేట్స్ మరియు కార్బామేట్స్) సుదీర్ఘంగా బహిర్గతం అవడం మూలంగా శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. ఊపిరితిత్తుల కార్యాచరణ తగ్గుతుంది మరియు సిఓపిడికి దారితీస్తుంది. రైతులలో (పొగ తాగనివారు, కీటకనాశినిలు వాడుతున్నవారు) సిఓపిడి సంఘటనలు 18.1 శాతం ఉందని భోగట్టా తెలియజేస్తుంది. వృత్తిపరంగా చూస్తే నియంత్రణ గల వారితో పోల్చితే ఇటుక పనిచేసేవారిలో ఊపిరితిత్తుల కార్యచరణ ఎంతో తక్కువ ఉంటుంది.
మీ గృహాలలో కనిపించే ఆదరణగల ఉత్పత్తి, ప్రత్యేకించి వేసవికాలంలో అన్ని చోట్ల కనిపించే దోమల కాయిల్. మీకో వాస్తవం తెలిస్తే ఆశ్చర్యపోతారు. దోమల కాయిల్ 100 సిగరెట్ల పొగను విడుదల చేస్తుంది. ఇది విడుదల చేసే ఫార్మాల్డిహైడ్ 50 సిగరెట్లకు సమానం. మనం క్రమబద్ధంగా పొగతాగేవారం కాకపోయినప్పటికీ, తెలియకుండానే మన ఆరోగ్యంతో రాజీపడే ఉత్పత్తులను వాడుతూ ఇబ్బందులను తెచ్చుకుంటున్నాము.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కొనసాగించిన 300లకు పైగా వ్యాధిగ్రస్తుల విశే్లషణలో వెల్లడైన విషయం ఏంటంటే, 75 శాతానికిపైగా ఉబ్బసం గల వ్యాధిగ్రస్తులు వారి పరిస్థితికి సరైన చికిత్స పొందక మరియు ఎంతోకాలం నోటి ద్వారా తీసుకునే బ్రోంకోడైలేటర్ మందులను వాడినవారు సిఓపిడి లక్షణాలను పెంపొందించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపాయకరమైన మరియు తీవ్రమైన ఉబ్బసం విషయంలో నాసిరకమైన చికిత్స సిఓపిడి భారాన్ని పెంపొందించే అవకాశం చాలా మట్టుకు ఉందని పరిశోధనలో వెల్లడయ్యింది.