సంజీవని

పింపుల్స్ పోయే మార్గం లేదా? (ప్రశ్న-జవాబు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: నా వయసు 19 సం.లు. నేను ఒక కంపెనీలో కంప్యూటర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నాను. నాకు కొంతకాలంగా ముఖంపై మొటిమలు వస్తున్నాయి. మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోషన్‌లను రాసుకోవడం, మొటిమలను గిల్లడం మొదలైనవి చేయడంతో అవి తగ్గకపోగా ఇన్‌ఫెక్షన్‌కు గురై చీముకారడం మచ్చలు ఏర్పడటం, గుంటలు పడటం జరిగింది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
-ఉష, రంగారెడ్డి
జ: మీ సమస్యకు ‘బెర్బెరియన్ ఆక్విఫోలియం’ మందును మదర్ టించర్ రూపంలో దూదితోతీసుకుని మొటిమలపై పూతగా రాయాలి. అలాగే పొటెన్సీ రూపంలో లోనికి తీసుకోవడంవల్ల గరుకుగా వున్న చర్మం నునుపుగా మారుతుంది. పింపుల్స్ త్వరగా తగ్గుతాయి. బెర్బెరిన్ ఆక్విఫోలియం అనే మందును 200 పొటెన్సీలో మీరు 15రోజులకు ఒక్కసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒకడోసు చొప్పున మూడు నెలలపాటు వాడగలరు. అలాగే కాల్కేరియాఫ్లోర్ 6 ఎక్స్ అనే మందును రోజుకు 4 మాత్రలు మూడుసార్లు చొప్పున 2 నెలలు వాడగలరు. ఈ సమస్య నివారణకు ముఖ్యంగా మొదటగా మొటిమలను గిల్లడం, గిచ్చడం చేయకూడదు. గోరువెచ్చని నీటితో రోజుకు నాలుగు నుంచి ఆరుసార్లు శుభ్రపరచుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా రకరకాల క్రీములను, లోషన్లను వాడకూడదు. సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలామంచిది. ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్, నిలువ వున్న ఆహార పదార్థాలు తినకూడదు. నీరు సరిపడినంతగా తాగాలి. తాజా కూరగాయలు నిత్యం ఆహారంలో వుండేలా తీసుకోవాలి.
కదలికవల్ల బాధ
ప్ర: నా వయసు 44 సంవత్సరాలు. నేను మెకానిక్ పనిచేస్తుంటాను. ఈ మధ్యకాలంలో నాకు మణికట్టు వద్ద నొప్పి బాధిస్తుంది. మణికట్టు కదిలిస్తే బాధ తీవ్రమవుతుంది. అలాగే ఇంకొక సమస్య బలబద్ధకంతో బాధపడుతున్నాను. దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళగా ఎక్స్‌రే తీయస్తే ఏమీ లేదన్నారు. అయినా నొప్పి తగ్గలేదు. నా సమస్యకు సరైన మందును సూచించగలరు.
-కార్తిక, కరీంనగర్
జ: మీ సమస్యకు ‘బ్రయోనియా’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు వారాలపాటు వాడండి.