సంజీవని

సూక్ష్మజీవుల్లోనూ మంచివీ, చెడ్డవీ ఉంటాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుట్టూ వున్న పరిసరాల్లోనే కాదు, పెద్ద జీవుల శరీరాల్లో సూక్ష్మజీవులు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. మన శరీరాల్లో కూడా కొన్ని రకాల సూక్ష్మజీవులు నివసిస్తూ వుంటాయి.
సూక్ష్మజీవులు మన శరీరంలోకి ఆహారం, నీరు, గాలి, చర్మంలో ఏర్పడే అనేక రకాల గాయాలు ద్వారా సూక్ష్మజీవులు శరీరంలోకి జొరబడి అక్కడే అభివృద్ధి చెందుతుంటాయి. ఇతరుల శరీరంమీద ఆధరాపడి జీవించే సూక్ష్మజీవుల్ని పేరసైట్స్ అంటారు. పేరసైట్లు శరీరంలో స్థిరపడి పెరిగే అనుకూల పరిస్థితులు ఉండడంతో లోపలికి ప్రవేశించిన సూక్ష్మజీవులు ఆ ప్రదేశాలలో స్థిరపడి పెరుగుతున్నాయి. ఇలా మన శరీరంలో పెరిగే సూక్ష్మజీవులన్నీ అపాయకరాలే కాదు, ఉపయోగకారకులైన సూక్ష్మజీవులూ ఉన్నాయి.
మనుషుల ప్రేగులలో నివసించే కొన్ని రకాల సూక్ష్మజీవులు విటమిన్ బి12 లాంటి విటమిన్లను ఉత్పత్తి చేస్తుంటాయి. చర్మోపరిభాగంలో నివసించే సూక్ష్మజీవులు, గ్రంధులలో, ముక్కు, గొంతుల్లో జీవించే సూక్ష్మజీవులు కొన్ని మన శరీరంమీద ఆధారపడి బ్రతుకుతున్నా- వాటివల్ల మనకేమీ లాభముండదు. ఇలా ఉపయోగపడే, ఉపయోగపడకపోయినా అపాయం కలిగించని సూక్ష్మజీవులతోబాటు నష్టపరిచే సూక్ష్మజీవులూ ఉంటాయి. వాటివల్ల శరీరానికి ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి.
క్రిమి హానికరమైనప్పుడు, వాటికై అవి ఆశ్రయం తీసుకుంటున్న శరీర కణాలకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది. మన శరీర విజయం, లోపలి రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోతే సూక్ష్మజీవుల దాడి ఎక్కువవుతుంది. అదే ఇన్‌ఫెక్షన్! ఇన్‌ఫెక్షన్‌ను ప్రారంభ దశలోనే అరికట్టాలి. లేకపోతే తీవ్రమై ప్రాణాలు పోవచ్చు. అందుకని మనం చక్కటి రోగ నిరోధక శక్తిని కలిగుండాలి.
సాధారణమైన ఎనికె పాము పూర్తిగా వృద్ధి చెందడానికి ముందు శరీరంలోని చాలా ప్రదేశాలలో పెరుగుతుంది. ముందు రక్తంలోకి ప్రవేశించి శ్వాసాంగాలకు, అక్కడనుంచి గొంతులోకి.. అక్కడనుంచి ఆహార నాళంలోకి.. పేగులోకి ప్రవేశించి అక్కడ పెద్దదవుతుంది.
మనుషులలోలాగే వీటికీ జీవించడానికి ఆహారం కావాలి. అందుకే వాటి జీవన విధానం మనుష శరీరంలో కొనసాగేదిగా వుంటుంది. అలా జీవించేటప్పుడు, వాటి శరీర కార్య ఫలితంగా ఏర్పడే పదార్థాలు, రక్తప్రవాహంలో కలిసిపోతాయి. సాధారణంగా రోగాన్ని కలిగించేవే! అందుకే వీటిని టాక్సిన్స్ అంటారు. ఈ సూక్ష్మజీవులు శరీరంలో శిథిలమైతే, ఆ ఖండాలు రోగ కారకాలై టాక్సిన్లుగా మారతాయి. ఒక్కో క్రిమి ఒక్కోరకమైన రోగ ముద్రలను కలిగి వుంటాయి.
బాక్టీరియాను మందులు విచ్ఛిన్నం చేయగలవు (యాంటీబయాటిక్స్)! అత్యంత సూక్ష్మజీవులైన వైరస్‌ని ఏ మందులూ ఏమీ చేయలేవు. అందుకని అవి ఎక్కువ ఉష్ణంలో బ్రతకలేవని తెలిసిన శరీరములోపలి ఉష్ణాన్ని పెంచుతాయి. అదే జ్వరం! అందుకే ఇన్‌ఫెక్షన్లతో జ్వరం వస్తుంటుంది.