సంజీవని

పాంక్రియాటిక్ కేన్సర్‌కు రోబోటిక్ సర్జరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేన్సర్ వ్యాధుల్లోనే అత్యంత సంక్లిష్టంగా పరిగణిస్తున్న పాంక్రియాటిక్ కేన్సర్‌కు రోబోటిక్ సర్జరీల ద్వారా మెరుగైన చికిత్సలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇటీవలి కాలంలో పాంక్రియాటిక్ కేన్సర్ సోకిన ముగ్గురు రోగులకు రోబోటిక్ సర్జరీ చేసిన వైద్య బృందం వారికి నూతన జీవితాన్ని ప్రసాదించింది. పలు రకాల కేన్సర్ వ్యాధులకు రోబోటిక్ ఆపరేషన్లు చేస్తున్న కిమ్స్ తాజాగా పాంక్రియాటిక్ కేన్సర్‌కు కూడా ఈ పద్ధతిని వర్తింపజేసింది.
రోబోటిక్ సర్జరీలు ల్యాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలకంటే కూడా అధునాతన చికిత్సలుగా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా శస్త్ర చికిత్సల్లో కాలేయంపై పెరిగిన కణితులను తొలగిస్తారు. ఉదర భాగంలో చిన్న గాట్లు పెట్టి, కెమెరాతో పాటు కొన్ని వైద్య పరికరాలను లోపలికి పంపి.. కాలేయంపై పెరిగిన కణితులను తొలగిస్తారు. ఇలా ఉదర భాగంలోకి పంపే వైద్య పరికరాల్లో డావిన్సి రోబోటిక్ పరికరం అతి ముఖ్యమైనది. ఈ పరికరంతో చేతుల కంటే అతి సునాయాసంగా ఆపరేషన్ చేసే వీలుంది. ఈ ఆపరేషన్‌ను నిర్వహించిన తీరుపై డాక్టర్ మధు మరింత విపులంగా వివరాలు వెల్లడించారు. ఇటీవల పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న ముగ్గురు రోగులకు ఇదే పద్ధతి ద్వారా విజయవంతంగా ఆపరేషన్లు చేశామని ఆయన వివరించారు. సాధారణ ఆపరేషన్ల కంటే రోబోటిక్ సర్జరీలు అతి సులువుగా చేసే వీలుందని చెప్పారు. ఈ తరహా ఆపరేషన్లు చేసేందుకు ఐసీయూ తరహా ఏర్పాట్లు ఎంత మాత్రం అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా రోగుల కుటుంబాలకు ఖర్చులో భారీ వెసులుబాటు లభిస్తుందన్నారు.
ఈ ఆపరేషన్ పద్ధతిలో రోగి శరీరంలోని రోగ కారక భాగాలపైనే ప్రభావం పడుతుందని, ఇతర శరీర భాగాలపై ఎలాంటి ప్రభావం పడదని డాక్టర్ వివరించారు. ఇక ఈ తరహా సర్జరీల ద్వారా ఆపరేషన్ తర్వాత తలెత్తే సమస్యలకు కూడా చెక్ చెప్పే అవకాశముందని తెలిపారు. విజయవంతమైన ఆపరేషన్లు చేసేందుకు ఈ తరహా సర్జరీలకంటే మించిన మార్గం మరొకటి లేదని కూడా చెప్పారు. ఇక ఈ తరహా ఆపరేషన్లు జరిగిన ముగ్గురి రోగుల గురించి ఆయన వివరిస్తూ- 60 ఏళ్ళ వయసున్న పాండురంగ అనే రోగి కాలేయంలో 12-9 సెంటీమీటర్ల మేర కణితిని అతి సులువుగా తొలగించినట్లు చెప్పారు. 55 ఏళ్ళ మహిళ, 60 ఏళ్ళ వయస్సున్న వృద్ధుడికి కూడా ఇదే రీతిన రోబోటిక్ సర్జరీ పద్ధతిన పాంక్రియాటిక్ కేన్సర్‌కు చికిత్స అందించామన్నారు. ఈ ముగ్గురికి తాము చేసిన ఆపరేషన్లు విజయవంతమయ్యాయని, ప్రస్తుతం వారు ముగ్గురూ వేగంగా కోలుకుంటున్నారని కూడా డాక్టర్ మధు పేర్కొన్నారు.
పాంక్రియాటిక్ కేన్సర్.. ధూమపానం, మద్యపానం వల్లనే కాకుండా జన్యుపరంగానూ సంక్రమిస్తుందని డాక్టర్ మధు తెలిపారు. ఈ తరహా కేన్సర్‌కు తాము అందిస్తున్న రోబోటిక్ సర్జరీలు చేయించుకున్న రోగులు సుదీర్ఘకాలంపాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, అంతేకాకుండా త్వరితగతిన కోలుకుంటారని ఆయన చెప్పారు. తాము అవలంభిస్తున్న వైద్య చికిత్సల్లో కణితులను విజయవంతంగా తొలగించడమే కేన్సర్ లాంటి అతి పెద్ద రోగాలకు కూడా కేవలం 6-7 గంటలపాటు సర్జరీలను ముగించే వెసులుబాటు రోబోటిక్ సర్జరీల ద్వారానే లభిస్తుందని తెలిపారు. వైద్య నిపుణులు కూడా ఈ తరహా చికిత్సా పద్ధతులను అవలంబించడం ద్వారా రోగులకు త్వరితగతిన ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక పాంక్రియాటిక్ కేన్సర్‌కు ఆధునిక వైద్య పద్ధతులైన రోబోటిక్ సర్జరీ పద్ధతుల ద్వారా ఆపరేషన్లను విజయవంతంగా ముగించారు.