సంజీవని

జీవకణాల పరిమాణాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మించగానే శిశువుల శ్వాసంగాలు విస్తరిస్తాయి. రక్త సంచారంలో మార్పులు వస్తాయి. శిశువు సుమారుగా 5.5 పౌనులుంటుంది.
మొదటి సంవత్సరం మెదడు బాగా పెరుగుతుంది. ఎముకలు పొడవు లావవుతాయి. పుర్రె ఎముకల మధ్య ఇంకా ఖాళీ ప్రదేశాలుంటాయి. ఆ ప్రదేశాల్ని ‘్ఫంటెన్‌లు’ అంటారు. అవి ఉపదేహాలతో కప్పి ఉంటాయి. ఆ ఖాళీ ప్రదేశాలు పుర్రె, దానిలో ఉండే మెదడు పెరగడానికి తోడ్పడతాయి. సుమారు రెండు సంవత్సరాలలో పుర్రె ఎముకల ఖాళీలు పూడిపోతాయి. 6-8 నెలల మధ్య పాల పళ్ళు, దవడ ఎముకలలోంచి బయటకు వస్తాయి. రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి మొదటి దంత శ్రేణులు ఏర్పడతాయి. అందులో 20 పళ్ళుంటాయి. ఆరు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పాల పళ్ళు రాలిపోతాయి. వాటి స్థానంలో శాశ్వత పళ్ళు రావడం మొదలుపెడతాయి. వాటిలో ఆఖరి పన్ను దాదాపు 25 సంవత్సరాల ప్రాంతంలో వస్తుంది. ఇవి జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చే దంతాలు కాబట్టి ‘జ్ఞానదంతాలు’ అంటారు. అంతేకాని ఆ దంతాలవల్ల జ్ఞానం రాదు!
పదమూడేళ్ళ ప్రాయంలో ఆడ మగ ఎవరైనా లైంగికంగా వృద్ధి చెందడం ప్రారంభిస్తారు. ఈ వయస్సులో ఆడపిల్లల్లో రుతుస్రావం ప్రారంభమవుతుంది. స్తనాలు పెరగడం ప్రారంభిస్తాయి. మగపిల్లల్లో అయితే ఈ వయసులో గొంతులో మార్పులు వస్తాయి. ఆడపిల్లల్లో అయితే 16 సంవత్సరాలకు, మగవాళ్ళలో 20 సంవత్సరాలకు లైంగికంగా పూర్తిగా ఎదుగుతారు.
ఒక దశలో 150 ‘మ్యూ’లు ( ఒక మ్యూ అంటే 1/1000 మిల్లీమీటర్లు) వున్న పురుష భ్రూణం (సెమన్‌లో) వ్యాసంలోను, భారంలోను ఒక మిల్లీ గ్రాములో లేశాంశ- 2500 గ్రాముల బరువున్న భ్రూణంలో 50 సెంటీమీటర్ల పొడవు గలిగి కోటానుకోట్లు జీవకణాలు- అనేక ఆకారాలు, పరిమాణాలు కలిగి వున్న భ్రూణంగా వృద్ధి చెందుతుంది. ఈ వృద్ధిలో జీవకణాల సంఖ్యాభివృద్ధి, జీవకణాల పరిమాణాభివృద్ధి, జీవకణాంతర ధాతువృద్ధి ఉంటాయి. సఫలీకృత రజఃకణము (ఓనమ్) గోళాకారంలో వుంటుంది. గర్భకాలం పూర్తయి.. భ్రూణ వృద్ధయినకొద్దీ ఆకృతిలో మార్పులు వస్తాయి. ఈ వృద్ధి వేగం జీన్‌ల మీద ఆధారపడి వుంటుంది.
వృద్ధిలో - ధాతువృద్ధి, ధాతు నాశనంకన్నా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు లభించేదే యవ్వనం! అప్పటినుంచి శరీరాభివృద్ధి క్రమంగా తరుగుతూ వస్తుంటుంది. శరీరాభివృద్ధి, సంతానోత్పత్తి వ్యక్తి జీవితంలో రెండు ముఖ్యమైన దశలు.