సంజీవని

శరీర సహజ రక్షక విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయటనుంచి వచ్చే సూక్ష్మజీవుల బారినుంచి వచ్చే అపాయాలని తగ్గించుకోవడానికి మానవ శరీరంలో సహజ రక్షక విధానాలున్నాయి. వీటి ద్వారా రోగ నిరోధక శక్తి కలుగుతుంటుంది.
అవి ఏమిటో వరుసగా చూద్దాం-
మనిషి దేహం అనేక పొరల చర్మంతో కప్పబడి ఉంటుంది. ఈ చర్మం చుట్టూ వాతావరణంలో వున్న సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంటుంది. అనేక గ్రంధుల నాళాలు చర్మోపరి భాగంలో తెరుచుకుని ఉంటాయి. ఆ గ్రంధుల స్రావకాలు చర్మం వ్యాధికారిక సూక్ష్మజీవులను చంపేస్తుంటాయి. అటువంటి వాటిలో నేత్ర స్పందనాలలో విరివిగా వున్న ‘లైపోజోమ్’ ఒకటి. ఇది అత్యంత క్రిమి సంహారక శక్తి కలది. శరీరం లోపల ఆహార నాళము మ్యూకస్ ముంబ్రేన్ అనే నున్నటి పొరతో కప్పబడి వుండి, కండరాలనుంచి ఆహారనాళాన్ని వేరుచేస్తుంది.
దగ్గడం, తుమ్మడం లాంటి క్రియలలో శ్వాసకోశంలోని సూక్ష్మజీవులు బయటికి నెట్టబడతాయి. మూత్రము ద్వారా మూత్ర విసర్జన, కళ్ళలో పడ్డ పరాయి వస్తువులను కన్నీళ్ళతోను బయటికి పోయేట్లు చేస్తాయి.
నోట్లోని లాలాజలం శ్వాసకోశ స్యందనాలు తమలో ప్రవేశించే పరాయి వస్తువుల్ని బయటకు పంపిస్తాయి. పడిశం పట్టినప్పుడు ఎక్కువ ఉత్పత్తి అయ్యే ద్రావకం (చీమిడి) శరీరంలో వ్ను రక్షక యంత్రాంగాల్లో ఒకటి. జీర్ణకోశం క్రిమిగ్రస్తమైనపుడు- వాంతి, విరోచనాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా శరీరంలోకి ప్రవేశించిన క్రిముల్ని బయటకు పంపించే క్రియలే.
ఆహార ద్వారం కూడా క్రిమి ప్రవేశానికి మార్గం. అందుకని దానిలోనే క్రిమి సంహారం చేసే యంత్రాంగాలున్నాయి. ఉదాహరణకి జఠరాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. ఇది ఆహారం ద్వారా ప్రవేశించిన క్రిముల్ని చంపుతుంది. అతి ప్రమాదకరమైన కలరా, టైఫాయిడ్ క్రిముల్ని కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ చంపుతుంది. ఆహారంలో వున్న జీర్ణరసాలు, ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు, ఆహారంతోపాటు లోనికి ప్రవేశించిన క్రిముల్ని నాశనం చేస్తాయి. శరీరం అంతటా లింఫ్ గ్రంధులు శరీరంలోకి ప్రవేశించిన క్రిముల్ని నిరోధించి నశింపజేస్తాయి.
శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవుల్ని, ఒక క్రమంలో సంహరించడానికో, అరికట్టడానికో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రతీకార సముదాయాన్ని ‘ఇన్‌ఫ్లమేషన్’ అంటారు. ఇన్‌ఫ్లమేషన్ అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది రెండు భాగాలుగా.
మొదటిభాగం రక్తనాళాలకు సంబంధించింది. బాధిత ప్రదేశానికి అధిక రక్తాన్ని పంపించడానికి రక్తకణాలు విస్తరిస్తాయి. రెండవ భాగం రక్తంలోని తెల్ల కణాలు రక్తనాళాల గోడల ద్వారా బాధిత ప్రదేశంలోకి వ్యాపిస్తాయి. తెల్ల కణాలు సైనికుల వంటివి. ఇవి శత్రువుల ఉనికిని గమనించగానే రక్తంలోంచి అధిక భాగం శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మక్రిముల్ని చుట్టుముట్టి చంపివేస్తాయి. వాటి మృత శరీరాలనుంచి ఆ క్రిములను కరిగించే ‘పెర్మెంట్స్’ అనే రసాయన పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. శరీరంలోని ఏ ప్రదేశంలోనైనా ఇన్‌ఫ్లమేషన్ అనే ప్రతీకారం ఏర్పడినపుడు యావత్ శరీరంలో హెచ్చరిక పొంది జాగరూకతమవుతుంది. 1.జ్వరం, 2.అధిక సంఖ్యలో తెల్ల కణాలు ఉత్పత్తి అవడం.
ఇలా రోగకారక క్రిములను అరికట్టడానికి శరీరంలో అనేక పద్ధతులూ, మార్గాలూ ఉన్నాయని తెలుసుకోండి. అది శరీరమే రోగ నిరోధక శక్తిని అలవరచుకోవడం, శరీరంలోని జీవకణాలు ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్‌ని గుర్తించి ‘యాంటీబాడీ’లు అనేక ప్రత్యేక కణాల్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీలు సూక్ష్మజీవుల్ని చంపగలవు. వాటిని కరిగించగలవు. వాటి విషాన్ని తటస్థీకరించగలవు. వాటిని గుమిగూడేటట్టు చేయగలవు. ఇలా గుమికూడిన క్రిముల్ని శరీర సైనికులైన తెల్ల కణాలు దిగమింగేస్తాయి.
ఒక్కొక్కసారి వ్యాధితో బాధితమైనందువల్ల ఏర్పడే రోగ నిరోధక శక్తిని రోగంతో బాధపడకుండానే శరీరంలో కృత్రిమంగా ఉత్పత్తి చేయవచ్చు. ఇనాక్యులేషన్ అనే పద్ధతిలో టీకాలవల్ల రోగ నిరోధక శక్తిని కల్పించవచ్చు. అలాగే రోగ కారక క్రిముల మృతశరీరాల్ని, దుర్భల శరీరాల్నీ మానవ శరీరంలోకి పంపించి, రోగ నిరోధక శక్తి కల్పించడానికి కొంత కాలం పడుతుంది. వెంటనే శీఘ్రంగా ఆ శక్తిని కలిగించడానికి అప్పటికే తయారై ఉన్న యాంటీ బాడీలని శరీరంలోకి సూచీ మార్గంగా పంపించే కొత్త విధానం వచ్చింది. ఆ రోగంతో బాధపడిన కొన్ని జంతువుల సీరంలో ఈ యాంటీబాడీలు తయారుగా ఉంటాయి. వీటిని పంపించి ఆ వ్యాధి రాకుండా చేయడంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తారు.