సంజీవని

రక్తం ఎలా గడ్డకడుతుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరంలోని ఒక రక్తనాళం తెగినా, చిరిగినా- అతి ముఖ్యమైన ప్రాణరక్షక ప్రక్రియ తటస్థిస్తుంది. గాయమైనచోట నెత్తురు గడ్డకట్టి రక్తస్రావం కాకుండా నిలిపివేస్తుంది. ఈ ఘనీకరణము అతి సంక్లిష్టమైన కార్యక్రమము. ఇందులో అనేక వికృతులు ఒక క్రమంలో జరుగుతాయి.
మొదట నెత్తురులోని ప్లేటెలెట్స్ చితికి ‘థ్రోంబోప్లాస్టిన్’ అనే పదార్థము తయారవుతుంది. లివర్‌లో తయారయ్యే ప్రోథ్రోంబిన్ అనే పదార్థము రక్తంలో సంచరిస్తుంటుంది. విటమిన్ కె కాల్షియమ్‌ల సాన్నిధ్యంలో థ్రోంబోప్లాస్టిన్, ప్రోథ్రోంబిన్‌ల కలయికతో ‘థ్రోంబిన్’ అనే పదార్థము తయారవుతుంది. ఈ థ్రోంబిన్, రక్తంలో వున్న ఫైబ్రినోజైన్ అనే ప్రొటీన్‌తో కలిసి ఫైబ్రిన్ తంతువులు తయారవుతాయి. ఈ ఫైబ్రిన్ తంతువులతో తయారైన వలలో ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకణాలు ఇరుక్కొని గడ్డకడతాయి. ఇలా గడ్డకట్టిన తరువాత మిగిలిన భాగాన్ని ‘సీరమ్’ అంటారు. రక్తకణాలలో ప్రవహిస్తున్నంతవరకూ రక్తం గడ్డకట్టదు. రక్తనాళానికి అపాయమై, రక్తం నాళం నుంచి బయటకు వచ్చినపుడే రక్తం గడ్డకడుతుంది. ఒక్కోప్పుడు రక్తనాళాల గోడలు మందగించి, రక్త సంచార వేగం తగ్గిపోయినప్పుడు, కొన్ని ఇతర రక్త రోగాలలో- రక్తనాళాలలోనే రక్త ఘనీకరణ జరగవచ్చు. ప్రధాన రక్తనాళాలలో ఇలా ఘనీకరణ జరిగితే, ఆ తర్వాత ప్రాంతాలకు రక్తప్రసరణ సరిగా జరగక, ఆ కణాలు దెబ్బతింటాయి. వామోఫెలియా అనే రోగంలోలా రక్తం గడ్డకట్టకపోయినా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి.