సంజీవని

సకాలంలో చికిత్స పొందకపోతే ఏరోటిక్ స్టెనోసిస్‌తో జీవితానికి ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో 15 లక్షలమంది తీవ్ర స్థాయిలో ఏరోటిక్ స్టెనోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. వారిలో చాలామందికి శస్తచ్రికిత్సకు పరిష్కారం స్థాయిలో వ్యాధి తీవ్రమైందని నిర్థారణ.
సకాలంలో ఏరోటిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేయకుంటే వారిలో 50 శాతం మంది రోగులు హార్ట్ ఫెయిల్యూర్, ఛాతిలో నొప్పి వచ్చిన వారిలో రెండు నుంచి ఐదేళ్లు మాత్రమే జీవిస్తున్నారని వెల్లడి.
ప్రమాద కారకాలు
ఏరోటిక్ వాల్వులు కుంచించుకుపోవడంవల్ల తరచుగా తీవ్రంగా వచ్చే ఏరోటిక్ స్టెనోసిస్ నివారణ యోగ్యం కాదు. ఈ పరిస్థితికి నేపథ్యం- వయస్సు, రేడియేషన్ థెరపీ, గుండె ఇన్‌ఫెక్షన్ చరిత్ర, కుంచించుకుపోతున్న ఏరోటిక్ వాల్వుల్లో కాల్షియం డిపాజిట్ల పెరుగుదల, రక్తకణాల్లో పెరుగుతున్న కొవ్వు (హైకొలెస్ట్రాల్) గుండె నుంచి రక్తప్రవాహం సక్రమంగా సాగుతున్నపుడు కవాటాలు తెరచుకుంటాయి. తదనుగుణంగా గుండె కొట్టుకుంటుంది. దిగువన వున్న ఎడమ జఠరిక నుంచి ధమనిలోకి రక్తం పంపిణీకి ఏరోటిక్ వాల్వు తెరుచుకుంటుంది. ధమని ప్రధానంగా దిగువన ఎడమ వైపు నుంచి మొత్తం శరీరంలోని మొత్తం భాగాలకు రక్తప్రసరణకు వీలు కల్పిస్తుంది. ఒకవేళ ఏరోటిక్ వాల్వు సరిగ్గా పనిచేయకపోతే తీవ్రమైన ఏరోటిక్ స్టెనోసిస్ వ్యాధి సోకినట్లే. అప్పుడు శరీర భాగాలన్నింటికి రక్తప్రసరణ చేసేందుకు గుండె బలవంతంగా పనిచేయాల్సి వస్తుంది. అవసరాన్ని మించి గుండె కండరాలు పనిచేయడంవల్ల అవి బలహీనపడతాయి.
దీని ప్రభావం రోగి మొత్తం ఆరోగ్యంపై పడుతుంది. రోజువారీ కార్యకలాపాలకు దూరం చేస్తుంది. ఒకవేళ సకాలంలో చికిత్స అందించకపోతే ఏరోటిక్ స్టెనోసిస్ పరిస్థితి తీవ్రంగా మారి హార్ట్‌ఫెయిల్యూర్‌తోపాటు ప్రాణానికే ముప్పుగా పరిణమిస్తుంది. డాక్టర్ మనోజ్ కె అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ- ‘ఏరోటిక్ స్టెనోసిస్’ సమస్యతో బాధపడుతున్నవారిలో ఛాతినొప్పి, ఒత్తిడి, శ్వాస తీసుకోలేకపోవడం, రోజువారీ కార్యక్రమాలు పడిపోవడం, భారీ నొప్పి, మూర్ఛ, చురుకుదనం తగ్గుదల, గుండె గొణుగుతున్నట్లు సంకేతాలు వస్తే ఏరోటిక్ స్టెనోసిస్ సమస్య ఉన్నట్లే. రోగి తన శరీరంలోని లక్షణాలను నిశితంగా గమనించాలి. ప్రత్యేకించి పెద్దల్లో ఈ పరిస్థితులు తలెత్తాయా? అన్న విషయం నిర్థారించుకోవాలి. ఏరోటిక్ స్టెనోసిస్‌తో బాధపడుతున్న రోగుల్లో ఈ లక్షణాలు ప్రారంభ దశలో బయటపడవు. ఛాతిలో నొప్పితోపాటు మూర్ఛ, శ్వాస మందగించడం వంటి ఘటనలు ముందుకు వస్తాయి అని తెలిపారు. ఈ దశలో ఏరోటిక్ వాల్వు రిప్లేస్‌మెంట్ ఒక్కటే మార్గం అని డాక్టర్ మనోజ్ కె అగర్వాల్ అన్నారు.
తీవ్ర స్థాయిలో ఏరోటిక్ స్టెనోసిస్ వచ్చి ప్రాణానికే ప్రమాదకర పరిస్థితులు తలెత్తినపుడు శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్ తెలిపారు. ఇటువంటి రోగాలకు ఇప్పటివరకు ఓపెన్ హార్ట్ సర్జరీ మాత్రమే పరిష్కార మార్గం ఉన్నది. కానీ ట్రాన్స్- కాథటర్ ఏరోటిక్ వాల్వు రీప్లేస్‌మెంట్ (టిఎవిఆర్) రంగప్రవేశం చేసిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. శస్త్ర చికిత్సకు పరిష్కారం కాని స్థాయికి ఏరోటిక్ స్టెనోసిస్ వస్తే ప్రత్యామ్నాయంగా టిఎవిఆర్ విధానంలో ప్రాథమికంగా ఏరోటిక్ వాల్వు రీప్లేస్‌మెంట్ విధానం అందుబాటులోకి రావడమే కాదు గొప్ప ప్రయోజనాలు కూడా ఉన్నాయని, ఇటువంటివారికి టిఎవిఆర్ అత్యంత రిస్క్‌తో కూడుకున్న పరిష్కార మార్గమైనా ప్రాణ రక్షణతోపాటు అవయవాల పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. మోస్తరు స్థాయి నుంచి తీవ్ర స్థాయికి చేరుకునేవరకు ఏరోటిక్ స్టెనోసిస్ సమస్య తలెత్తబోదని అన్నారు. నిరంతర వైద్య పరీక్షల ద్వారా మాత్రమే రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని డాక్టర్ మనోజ్ కె.అగర్వాల్ తెలిపారు.