సంజీవని

విజృంభించనున్న స్వైన్‌ఫ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత సంవత్సరం నగర ప్రజలను వణికించిన స్వైన్‌ఫ్లూ మహమ్మారి ఏడాది తిరగకముందే మళ్లీ వస్తుండటంతో నగర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తెలుసుకుందాం.
లక్షణాలు
స్వైన్‌ఫ్లూ లక్షణాలు దాదాపుగా ఫ్లూ జ్వరం లక్షణాలను పోలి ఉంటాయి. కండరాల నొప్పులు, నీరసంతో మొదలైన రొంప, తుమ్ములు, దగ్గుతోపాటు గొంతునొప్పి, తలనొప్పి, ఆకలి మందగించడం, వికారం, వాంతులు, విరోచనాలు అవుతుంటాయి.

ఇలా వస్తుంది
సాధారణంగా స్వైన్‌ఫ్లూ వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా వ్యాప్తి చెందుతుంది. అనగా వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ సమయంలోనే స్వైన్‌ఫ్లూ వ్యాధి ఇన్‌ఫ్లుయెంజా ఎహెచ్1, ఎన్1 అనే వైరస్‌వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఒకరినుండి మరొకరికి దగ్గు, తుమ్ములు తుంపరల ద్వారా, మరియు వైరస్ వున్న వస్తువులను తాకి చేతులు శుభ్రంగా కడుగకనే ముక్కును నోటిని అదే చేతితో తాకుటవలన ఈ వ్యాధి సులభంగా సంక్రమిస్తుంది.
స్వైన్‌ఫ్లూ సోకిన తర్వాత మనిషి రోగిగా మారటానికి ఏడు రోజులు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ వ్యాధి రోగ నిరోధక శక్తి తక్కువగా వుండేవారిలో తొందరగా వ్యాప్తి చెందుతుంది. అలాగే పిల్లలు, గర్భిణీ స్ర్తిలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అనగా షుగర్, బి.పి, అస్తమా, శ్వాసకోశవ్యాధులు, గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి.
ప్రమాదకరమైన లక్షణాలు
ఆయాసపడటం, శ్వాస సరిగా తీసుకోకపోవటం, ఛాతిలో, కడుపులో నొప్పితో తల తిరుగుతున్నట్లుగా అనిపించడం, చర్మం రంగు మారడం, ద్రవ పదార్థాలు సరిగా తీసుకోకపోవటం, అయోమయంగా, భయంగా అనిపించటం.
జాగ్రత్తలు.. జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం, ముక్కునుండి నీరు కారటం వంటి లక్షణాలు మూడు రోజులకు మించి ఉంటే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలి.
స్వైన్‌ఫ్లూ సోకినవారు దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కుకు, నోటికి చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ముక్కుకు, నోటికి మాస్కు ధరించి ఉండాలి. మాస్కులను ప్రతి ఆరు గంటలకొకసారి మారుస్తూ ఉండాలి.
వైరస్ సోకిన వ్యక్తులను పర్యవేక్షించేవారు మాస్కులను ధరించి ఉండాలి. వైరస్ సోకిన పరిసర ప్రాంతాల వస్తువులను తాకినపుడు చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
వ్యాధికి సంబంధించిన లక్షణాలు వ్యక్తిలో అగుపడినపుడు ఇంటి పరిసరాల నుండి బయటకు రాకూడదు. డాక్టర్ సలహా తీసుకొని ఒక వారంనుండి రెండు వారాల వరకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. మంచినీరు, పళ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ వైద్యం కోసం బయటకు రావలసి వస్తే చేతి రుమాలు లేదా మాస్కును నోటికి, ముక్కుకు అడ్డుపెట్టుకోవాలి.
నివారణ పద్ధతులు
ఆరోగ్యంగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి దరిచేరదు. అలాగే ఈ వ్యాధికి సంబంధించిన నివారణ మందు లేదా లక్షణాల తీవ్రత స్థాయిని బట్టి సరైన మందు వాడుకోవచ్చు. వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి.
మందులు
ఆర్సినికం ఆల్బం: ముక్కునుండి నీరుకారడం, దగ్గు, జ్వరంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, కళ్లనుండి నీరు కారడం, విపరీతమైన నీరసం, తరచుగా దాహం, ఒళ్ళు నొప్పులు, మానసిక స్థాయిలో ఆందోళన, భయం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.
జెల్సీమియం: దాహం లేకపోవుట, రోగి మగతగా, నిరసంతో అలసిపోయినట్లుగా ఉండి ముక్కునుండి నీరు కారడం, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరు తేలికగా ఆందోళన చెందుతారు.
యుపటోరియం పర్పోరేటం: నీరసంతో అలసిపోయినట్లుగా ఉండి ముక్కునుండి నీరు కారడం, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతోపాటుగా కండరాల నొప్పులు, కీళ్లనొప్పులున్నవారికి ఈ మందు ముఖ్యమైనది. పక్కలకు తిరిగి పడుకోవాలంటే ఒళ్లు నొప్పులతో అవస్థ పడుతుంటారు.
బ్రయోనియా: ఫ్లూ లక్షణాలతోపాటు దగ్గు ఎక్కువగా ఉండి నోరు తడి ఆరిపోయినట్లుగా ఉంటుంది. వీరిలో దాహం అధికంగా వుండుట, కదలికలను భరించలేకపోవుట, దాహం వేసినపుడు చల్లని నీరు కావాలని కోరుకొనుట గమనించదగిన ముఖ్య లక్షణం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
ఈ మందులే కాకుండా ఇపికాక్, రస్‌టాక్స్, బాప్టిషియా, ఎకోనైట్, ఫెర్రం ఫాస్, కాలిమోర్, వెరట్రం, అల్బం, ఎల్లియం సెఫా వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646