సంజీవని

మత్తుని పెంచే మందులు.. తెచ్చును సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంటి డిప్రెజెంట్స్‌కి, ట్రాంకిలైజర్స్‌కి మధ్య చాలా తేడా ఉంది. డిప్రెషన్‌ని తగ్గించడానికి ఉపయోగించే మందులు ‘యాంటి డిప్రెజెంట్స్’! ఇవి ప్రధానంగా రెండు రకాలు. అవి- ట్రైసైక్లిక్స్, మోనో అమైన్ ఆక్సిడేజ్ ఇన్‌వాబేటర్స్. ఎవరైనా డిప్రెషన్‌కి లోనైతే ముందు వాడే మందులు- ట్రైసైక్లిక్స్. ఈ మందువల్ల ఫలితం అంతగా కనిపించనివాళ్ళకి మోనోఅమైన్ ఆక్సిడేజ్ ఇన్‌హిబిటార్స్‌ని వాడతారు.
మనిషి మనసు అల్లకల్లోలంగా వుంటే శాంతంగా ఉంచడానికి ట్రాంక్విలైజర్స్ వాడతారు. అవి ప్రధానంగా రెండు రకాలు. యాంటీ సైకోటిక్ డ్రగ్స్ లేక న్యూరోలెప్టిక్స్, ఆందోళనని తగ్గించే మందులు. మామూలుగా వైద్యులు మెల్లెరిల్, స్టిలజైన్, లార్గాక్టిల్ లాంటి యాంటి సైకోటిక్స్‌ని ఉన్మాదం ఎక్కువగా ఉన్నప్పుడు వాడతారు. ఆదుర్దాని తగ్గించడానికి బెండో డయాజెపైన్స్‌ని వాడుతుంటారు. హెలియమ్ లేక రిబ్రియమ్ ఈ కోవకి చెందినవే. ఫెనోబార్బిటోన్స్‌ని వాడతారు.
సరైన మోతాదులో ఈ మందుల్ని ఇస్తే ఆదుర్దా తగ్గి నిద్రపోతారు. నిద్ర సమస్యలకైతే ఎక్కువ మోతాదులో ఈ మందుల్ని వాడతారు. వైద్యుడికే ఏ మోతాదులో ఎప్పుడివ్వాలో తెలుస్తుంది. మానసిక వైద్యుడి సలహా లేకుండా ఈ మందుల్ని వాడకూడదు. ఈ మందుల్ని వాడడం ప్రారంభిస్తే, వాటికి అలవాటుపడే ప్రమాదముంది. అందుకని మన సమస్యల్ని వైద్యుడికి చెప్పి అతడి సలహా మీద మాత్రమే ఈ మందుల్ని వాడాలి.
వాటికి బానిస కాకుండా ఈ మందుల్ని వాడవచ్చా? అంటే తప్పకుండా వాడవచ్చు. అది మీరు వాడే మందుల మీద డోసేజ్‌మీద, వాడే కాలంమీద ఆధారపడి ఉంటుంది. బార్బిట్యురేట్స్ వాడితే వాటికి బానిసయ్యే లక్షణాలు ఎక్కువ. కానీ చాలామంది ఈ మందులే వాడుతుంటారు. నిద్ర త్వరగా పడుతుంది. బాగా పడుతుంది. ఆల్కహాల్ లాంటి వాటితో కలిసినప్పుడు ఇవి మరీ అపాయకరం. ఎక్కువ రోజు నిద్రకోసం ఈ మందుల్ని వాడితే ‘నైట్‌మేర్’ నిద్రలో భయంకరానుభవాన్నిస్తాయి. బెంజో డైజోపైన్స్ మందులు కొంత మెరుగు నిద్ర పట్టడానికి! తక్కువ మోతాదులోనే వాడాలి. డైఫెన్ హైడ్రామెన్, క్లోరల్ హైడ్రేట్స్‌ని పెద్ద వయసు వాళ్ళకి వాడుతుంటారు. అవి కొంతవరకు క్షేమకరం.
వారియమ్ లాంటి మందులవల్ల వాటిమీద ఆధారపడే గుణం ఎక్కువవుతుంది. ఎక్కువ కాలం వాడి, హఠాత్తుగా ఆపేస్తే ఇబ్బందులెక్కువవుతాయి. ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఇది మరీ ఇబ్బందికరం! అందుకే వైద్య సలహా లేకుండా ఈ మందుల్ని వాడకూడదు. నిద్రకోసం వాడే మందుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, మరికొన్ని మందులతో కలిపి వేసుకుంటున్నప్పుడు. ముఖ్యంగా ఈ నిద్ర మాత్రలు వేసుకునేప్పుడు, మనసుని నిద్రపుచ్చే మరే మందులు వాడకూడదు. ఆల్కహాల్ లాంటివాటిని తీసుకోకూడదు. ఈ మందులు తీసుకున్నప్పుడు ఈత, డ్రైవింగ్ లాంటివాటికి దూరంగా ఉండాలి.

-డా.పి.సి.పి.గుప్తా సైకియాట్రిస్ట్.. 9848063547