సంజీవని

జీవకణాలలో నిరంతర మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఛర్మం మూడు పొరలుగా ఉంటుంది. పైపొర- ఎపిడెర్మిస్; పల్చగా వుంటుంది. మధ్యపొర-డెర్మిస్. ఇందులో ఫైబర్ టిష్యూ ఇతర ముఖ్య నిర్మితాలై ఉంటాయి. లోపలి పొర కొవ్వుండి దిండులా ఉంటుంది.
ఎపిడెర్మిస్ అనే చర్మం పైపొరలో చాలా పొరలుంటాయి. కార్నియం పొర వాటిలో ఒకటి. ఇది కొమ్ము వంటి మృతజీవకణాలతో ఏర్పడుతుంది. ఈ మృతకణాలలో కెరటిన్ అనే సంక్లిష్ట పొర కూడా ఉంటుంది. శరీరంలోని వివిధ భాగాలలో దీని మందము మారుతుంటుంది. అరచేతుల్లోను, అరికాళ్ళలోను ఎక్కువ మందంగా ఉంటుంది.
రెండవ పొరని జెర్మినేటివంటారు. దీనిలో కణాలు ఎప్పుడూ విభజన చెందుతూ, కొత్త కణాల్ని పైకి తోస్తుంటాయి. పైకి పోతున్న జీవకణాలలో నిరంతరాయంగా మార్పులు జరుగుతుంటాయి. ఈ పొరకు, కార్నియం పొరకు మధ్యన వుండే నిర్మలమైన పొరని ‘లూసిడమ్’ అంటారు. అడుగులో వున్న జీవకణాలు ఈ దశలన్నీ దాటడానికి మూడు నాలుగు వారాలు పడుతుంది. కొమ్ము పొర అంటే కార్నియా పొరలో వుండే జీవకణాలు ఎప్పుడూ రాలిపోతుంటాయి. కొన్ని చర్మ వ్యాధులలో తెల్లని పొలుసులు చర్మంమీద కనిపిస్తుంటాయి. ఇవి కార్నియమ్ పొర నుంచి ఏర్పడ్డవే. చర్మం పొట్టు రాలిపోవడంతో కెరటిన్ ఏర్పడడం భంగమైందన్నమాట!
అడుగున వుండే జీవకణాల్ని ‘మెలనోసైట్స్’ అంటారు. ఇవి మెలనిన్ అనే రంగు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ రంగుతోనే మన చర్మ రంగు వస్తుంది. చర్మంలో మెలనిన్ లేకపోతే ‘ల్యాకోడెర్మా’ (బొల్లి) వస్తుంది.
ఎపిడెర్మిస్‌లో రక్తనాళాలుగాని నరాలుగాని ఉండవు. ఈ జీవకణాల మధ్య ఏర్పడిన కాలువలో లింఫు సంచరిస్తూ జీవకణాలకు ఆహారం సమకూరుస్తుంటుంది.
చర్మంలోని రెండవ పొరైన కొరియమ్ లేక డెర్మిస్‌లో వెంట్రుకల మూలాలు, స్నేహ గ్రంథులు, శే్వ్దదగ్రంథులు, రక్తనాళాలు, నరాలు మొదలైనవి ఉంటాయి.
ప్రతీ వెంట్రుక ఒక కుదురులో ఉంటుంది. దాన్ని కేశమూలము అంటారు. దాంట్లోంచి వెంట్రుక పైకి వచ్చి, ఎపిడెర్మిస్‌ని చీల్చుకుని బయటకు వస్తుంది. ఒక ప్రత్యేకమైన ఎపిడెర్మిస్ ధాతువువల్ల వెంట్రుకలు ఏర్పడతాయి. వెంట్రుకల మొదళ్లు గుంటలో ఉంటాయి. వీటిలో మెలినోసైట్స్ ఉండి, వెంట్రుకలకు రంగుని సమకూరుస్తాయి. వెంట్రుకలు కెరటిన్‌తో ఏర్పడతాయి.
వెంట్రుకలు ఎప్పుడూ పెరగవు. వాటికి పెరిగే దశ, విశ్రాంతి దశ ఉంటాయి. శిరస్సుమీద వెంట్రుకలు రోజుకి 0.35 మి.మీ చొప్పున పెరుగుతాయి.
చర్మంలోని సేవాగ్రంథులనుంచి సీబం అనే తైలం ఉత్పత్తి అవుతుంటుంది. ఇది చర్మమంతటా వ్యాపించి చర్మాన్ని వెంట్రుకల్ని మృదువుగా ఉంచుతుంది. గాలి వేడిగా ఉంటే సీబం అధికంగా ఉత్పత్తి అవుతుంటుంది.
కొరియం పొరలో ఉండే శే్వదగ్రంథుల, నాళాలు చర్మం పైభాగాన తెరచుకుని ఉంటాయి. ఈ శే్వదగ్రంథుల ద్వారా చెమట బయటకు వెళ్తుంటుంది. ఈ గ్రంథులు మెదడు అధీనంలో ఉంటాయి. ఆ కేంద్రమే శరీర ఉష్ణాన్ని నిర్ణయిస్తుంటుంది.

-డా శశికాంత్ ప్లాస్టిక్ సర్జన్ 9581258179