సంజీవని

సియానిక్ మెడిసిన్ ద్వారా రోగ నిర్ధారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారంటే పరిశుభ్రత లోపించడంవల్ల ఇన్‌ఫెక్షన్స్ వచ్చి, పౌష్ఠికాహార లోపంవల్ల, మందులవల్ల, బలవంతాన అనారోగ్య కారణాల్ని అణచడానికి ప్రయత్నించడంవల్ల, మానసిక ఒత్తిడి లాంటివి కొన్ని కారణాలు!
కొన్ని విష పదార్థాలు మందులవల్ల శరీరంలో పేరుకుపోతున్నాయి.
ఆధునిక శాఖ సియానిక్ మెడిసిన్ కేవలం భౌతిక కారణాలతోనే కాకుండా ఎక్స్‌ట్రా సెన్సిటివ్ పవర్ ద్వారా రోగ నిర్థారణ, చికిత్స చేసే పద్ధతి.
మియాస్మ్, కొన్ని విష పదార్థాల కారణంవల్లే అనారోగ్యం సాధారణంగా కలుగుతుంటుంది. కొన్ని రకాల విషపదార్థాలు జన్యుపరంగా ఒకళ్లనుంచి మరొకళ్లకు జన్మతః వస్తుంటాయి. వాటినే ‘మియాస్మ్’ అంటారు. క్షయ విష పదార్థాలు వంశపారంపర్యంగా వస్తుంటే ఊపిరితిత్తుల నెమ్ము, అలర్జీ, మధుమేహం, ఎగ్జిమా అనే చర్మవ్యాధులు కొన్ని రకాల తలనొప్పులు, సూక్ష్మజీవుల కారణాన వచ్చే జబ్బులూ ఒక తరంనుంచి మరో తరానికి వ్యాపిస్తున్నాయి. రకరకాల అంటు వ్యాధుల ప్రభావంతో జీవితంలో అనేక రోగాలు ముంచుకు వస్తున్నాయి.
అల్యూమినియమ్, మెర్క్యురీ, సీసం, ఆర్సెనిక్, కాడియమ్, మాలిభియమ్, సోడియమ్ క్లోరైడ్, ఫ్లోరిన్, పంచదార, క్లోరిన్ లాంటి లోహాల కారణంగా శరీరంలోపల విష పదార్థాలు ఏర్పడవచ్చు. వీటిలో ఏ ఒక్కటైనా లేక కొన్ని కలిపి డి.ఎన్.ఎలో బాలెన్స్ తప్పేట్టు చేస్తాయి. ఈ బాలెన్స్ తప్పడం కేవలం భౌతిక స్థాయినే కాదు ఈథరిక్ స్థాయిలో కూడా జరుగుతుంది. బాలన్స్ తప్పడంతో రోగం బయట పడుతుంది.
ఈ విష పదార్థాల కారణంగా ముందు ఆకలి మందగిస్తుంది. క్రమంగా విష పదార్థాల మోతాదుతో బాటు రోగ తీవ్రత ఎక్కువవుతుంది. అందుకని ఏ మందుల్ని బడితే ఆ మందుల్ని వైద్య సలహా లేకుండా వేసుకోవడం మంచిది కాదు. ఒక్కోసారి శరీరంలో తక్కువైన విటమిన్లు, ఖనిజ లవణాల్ని ఇవ్వడం ద్వారా కూడా అనారోగ్యాన్ని తగ్గించవచ్చు.