సంజీవని

మీ చిరునవ్వుని సరిదిద్దుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖం మైండ్‌కి సూచికలాంటిదనే విషయం మనందరికీ తెలుసు. కానీ నోరు ముఖ్యంగా పళ్ళు ముఖానికి అందాన్నిస్తాయని ఎందరికి తెలుసు? అది తెలీకే కొందరు పళ్ళని, చిగుళ్ళని నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో వాళ్ళ దగ్గరకు వస్తే వాసన, పళ్ళు పద్ధతిగా అమరి ఉండకపోవడంవల్ల, వాళ్ళని చూడగానే చిరాకు వేస్తుంటోంది. అందుకే మన పళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎగుడు దిగుడుగా వున్నా, పళ్ళూడిపోతున్నా, రంగు మారుతున్నా తగు జాగ్రత్తలు తీసుకుంటూ చిరునవ్వుని సరిదిద్దుకోవాలి. అప్పుడు మన చిరునవ్వుకి అవతలివాళ్ళు స్పందిస్తారు.
ముందు పళ్ళు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి వాటి పరిమాణంలో మార్పు తీసుకురావడంతోపాటు తెల్లగా మెరిసేట్టు చేయడానికి డెంటల్ వెనీర్స్ తోడ్పడతాయి. పళ్ళమీద అమర్చే పోర్సిలిన్ లామినేషన్‌ని ‘డెంటల్ వెనీర్స్’ అంటారు. ఈ వెనీర్స్‌తో నోటిలో ముందు కనిపించే పళ్ళని ఆకర్షణీయంగా తీర్చిదిద్దవచ్చు. వీటిని పళ్ళపై అమర్చి, వాటి రంగు, పరిమాణం లాంటి వాటిని మార్చవచ్చు.
వెనీర్స్ కాంపొజిట్ రెజిన్‌తో చేస్తారు. కాంపోజిట్ రెజిన్‌కన్నా పోర్సిలిన్ రెజిన్ నాచురల్‌గా వుంటుంది. చాలా పల్చగా ఈ పొర ఉంటుంది కాబట్టి పంటి పైభాగాన్ని పెద్దగా తొలగించనక్కరలేదు. ఈ పొరని బిగించడానికి మీకు తగిన వెనీర్స్‌ని మీరు అమర్పించుకోవచ్చు.
రూట్‌కెనాల్ చికిత్సవల్లగాని, టెట్రాసైక్లిన్ మందులు వాడడంవల్ల గాని, ఫ్లోరైడ్‌వల్లగాని పంటి రంగు మారితే ఈ చికిత్స ఎంతగానో తోడ్పడుతుంది. పళ్ళు పైపొర దెబ్బతిని పాడైనా, పళ్ళమధ్య దూరమున్నా, ఎత్తుపల్లాలున్నా ఆ లోపాన్ని సవరించి అందంగా కనిపించేట్టు చేయడానికి వెనీర్స్ తోడ్పడతాయి.
వెనీర్స్ అమర్చడానికి మనం మూడుసార్లు దంత వైద్యుణ్ణి కలుసుకోవలసి ఉంటుంది. మొదటిసారి వెళ్లినప్పుడు నవ్వితే ముందు కనిపించే పళ్ళ లోపాల్ని పసిగట్టి ఎలా చికిత్సనందించాలో నిర్థారించుకుంటాడు వైద్యుడు. అందుకని మీ ఇబ్బందుల్ని పరిపూర్ణంగా వైద్యుడికి చెప్పాలి. ఆయనా మీకు ఎలాంటి వెనీర్స్ అమరుస్తే బావుంటుందో చెప్తారు. ఇద్దరు చర్చించుకుని చికిత్సని నిర్థారించుకోవచ్చు. పళ్ళకి ఎక్స్‌రేలు లాంటివి తీయాల్సి వుంటుంది.
రెండవసారి దంత వైద్యుణ్ణి కలిసినప్పుడు ఆయన పంటిమీద ఎనామెల్‌ని మి.మీ వరకు తొలగిస్తారు వెనీర్స్‌ని అమర్చటానికి వీలుగా. ఆ తర్వాత ఎలాంటి వెనీర్స్‌ని అమర్చాలో నిర్ణయించుకుని దాని మందం, పరిమాణం లాబొరేటరీకి పంపిస్తారు. కావలసిన విధంగా వెనీర్స్ సిద్ధమై రావడానికి 1, 2 వారాలు పట్టవచ్చు.
మూడవసారి వెళ్లినపుడు దంత వైద్యుడు జాగ్రత్తగా వెనీర్ పొరని పంటిమీద అమరుస్తాడు. వెనీర్స్ పళ్ళని స్వభావ సిద్ధంగా కనిపించేలా చేస్తాయి. చిగుళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా పళ్ళని అందంగా కనిపించేలా చేస్తుంది. వెనీర్స్ మీద ఎటువంటి మచ్చలు రావు. ఇవి 5 నుంచి 10 సంవత్సరాల వరకు పళ్ళని కాపాడతాయి. ఆ తర్వాత మళ్ళీ వెనీర్స్‌ని అమర్చుకోవచ్చు. మామూలుగా మనం పళ్ళకి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

-డా. సుధీర్
డెంటల్ సర్జన్.. 9885012444

-డా. సుధీర్ డెంటల్ సర్జన్.. 9885012444