సంజీవని

కదిలితే బాధ.. మనసు కలుక్కు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కుర్రవాడి వయసు ఏడేళ్లు ఉండవచ్చు. నవ్వు ముఖంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలడు. మన చూపు ముఖంమీదనుంచి క్రిందికి కదిలితే బాధతో మనసు కలుక్కుమని తీరుతుంది. అంత అందమైన కుర్రవాడు అదేమి శాపమో కాళ్లని ‘డబ్ల్యు’ ఆకారంలో మడత వేసుకుని కూర్చుంటాడు. కుందేలులా పాకగలగడు తప్ప నడవలేడు. కనీసం నిల్చోలేడు. కాళ్ళని ఒకదానిమీద మరొకటి అడ్డంగా వేసుకుని కూర్చుంటాడు. కాళ్ళు అలా మారడానికి కారణం పోలియోయేమో అని అనుకుంటున్నారా?
కానే కాదు!!
మరి?
పది సంవత్సరాల కులదీప్ నవ్వుతూ అందర్నీ పలకరించగలడు గాని మాట్లాడలేడు. నిల్చోలేడు, నడవలేడు. చేతుల్ని పూర్తిగా చాచలేడు. ఇతని జీవితం ఇతనికే కాక తల్లిదండ్రులకు భారమైంది.
ఇతనూ ఇందాకటి కుర్రవాడు బాధపడే వ్యాధిలాంటి వ్యాధితోనే బాధపడుతున్నాడు.
ఏమిటి ఈ వ్యాధి?
నెలలు నిండకుండా పుట్టేప్పుడుగాని, కాన్పు సమయంలో నొప్పులు మరీ ఎక్కువసేపు వస్తేగాని, పిండంమీద ఏమైనా వత్తిడి కలిగించినా, ఫోర్‌సెప్స్‌తో బిడ్డను బయటకు తీసేప్పుడుగాని, బిడ్డ పుట్టేప్పుడు ఏడ్వడం ఆలస్యమైనా, గర్భంలో కామెర్లు వచ్చినా, బ్లూ బేబి మెరింజైటిస్ లాంటి జబ్బులు వచ్చినా, పుట్టుకముందే మెదడుకి అనారోగ్యం కలిగి, సరైన పెరుగుదల లేక వచ్చే జబ్బువల్ల పిల్లలు ఇలా తయారవుతారు. దీనినే ‘సెరిబ్రల్ ఫాల్సీ’ అంటారు. ఇటువంటి వ్యాధి వచ్చిన పిల్లల్ని ‘స్పాస్టిక్స్’ అని కూడా అంటారు.
ఈ సవాలు ఎదుర్కొని వైద్య ప్రముఖులు శస్త్ర చికిత్స ద్వారా కదలనూ కూర్చోలేని పిల్లల్ని తమ పనులు తాము చేసుకోగలిగేట్టు చేయగలుగుతున్నారు.
1981లో లాస్ ఏంజిల్స్‌కి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ డా పీకాక్ సెలెక్టివ్ పొస్టీరియర్ రైజోటమి పద్ధతిలో కొన్ని మార్పులు చేసి సెరిబ్రల్ ఫాల్సీతో బాధపడేవాళ్ళకి విముక్తి కలిగించడంలో కృతకృత్యుడయ్యాడు.
పీకాక్ శస్త్ర చికిత్స చేసే ప్రాంతాన్ని కోనస్ నుంచి వెనె్నముక క్రింది భాగానికి మార్చి శస్తచ్రికిత్సలో ఉండే క్లిష్టతను చాలావరకు తగ్గించారు. దీనివల్ల ఫలితం కూడా కొంతవరకు మెరుగైంది.
కండరాలు బాగా పెరగడంవల్ల కాళ్ళు చేతుల్ని వెనక్కి లాగగలిగే శక్తి తగ్గుతోంది. చేతిని మడిచినప్పుడు బైసెప్స్ కండరాలు ముడుచుకుని ట్రైసెప్స్ కండరాలు రిలాక్స్ అవుతాయి. బయటి వాతావరణం నుంచి వచ్చే సిగ్నల్స్, మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ కలవనప్పుడు కాళ్లు, చేతుల్ని కదిలించలేని ‘స్టాస్టిసిటి’ వస్తుంది. కండరాలను ఉత్తేజపరిస్తే సిగ్నల్స్‌ను స్పైనల్ కార్డ్‌లో ఉండే నరాలకు పంపగలదు. ఈ కణం మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్‌ని అందుకుంటుంది. ఈ రెండు సిగ్నల్స్ బాలన్స్ తప్పితే.. అంటే న్యూరాన్స్ దెబ్బతింటే వెన్ను నరానికి దెబ్బ తగిలితే ఈ సెరిబ్రల్ ఫాల్సీ వస్తుంది.
సెరిబ్రల్ ఫాల్సీ వ్యాధి సోకిన పిల్లలకు నాలుగు -ఎనిమిది సంవత్సరాల మధ్య శస్త్ర చికిత్స జరపవచ్చు. ఎనిమిదేళ్ళు దాటిన వారిక్కూడా ఈ శస్త్ర చికిత్స జరుపుతున్నారు. వెనె్నముక క్రింది భాగాన్ని కోసి ప్రత్యేక పరికరాల సాయంతో శరీరంలో గుర్రపు తోకల్లా వుండే నరాల్లోంచి వ్యాధికి గురైన నరాలు వెదికి వాటిని జాగ్రత్తగా కత్తిరిస్తారు. ఈ పద్ధతిని ‘సెలెక్టివ్ పోస్టిరియర్ రైజొటమి’ అంటారు. ఈ శస్త్ర చికిత్స చేయడానికి దాదాపు అయిదు గంటలు పడుతుంది. కొత్తగా రక్తం ఎక్కించాల్సిన పనిలేదు. ఈ శస్తచ్రికిత్సవల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. శస్త్ర చికిత్స జరిగిన తర్వాత ఫిజియోథెరపి చాలా అవసరం.
మెదడుకి ఏమైనా నష్టం కలిగినా కండరాలనుండి సమాచారం వెన్ను నరంలోని న్యూరాన్‌లకు సరిగా అందకపోయినా, సెరిబ్రల్ ఫాల్సీ కలుగుతుంది. మెదడునుంచి వచ్చే ఆజ్ఞలు, కండరాల నుంచి న్యూరాన్‌లకు సమాచారం బాలెన్స్‌డ్‌గా అందితేనే అవయవాల కదలిక సరిగ్గా ఉంటుంది. ఏ ప్రక్కనుంచి సమాచారం సరిగ్గా అందకపోయినా కష్టమే.
శస్త్ర చికిత్స విజయవంతం కావడానికి రోగి ఎన్నిక ముఖ్యం. కండర పుష్ఠి ఉండి, అసాధారణ కాళ్ళ చలనం ఉండి అనేక శస్తచ్రికిత్సలకు లోనుకాని వాళ్ళను ఎన్నుకుంటారు.
ఫంక్షనల్ పోస్టీరియర్ లైజోటోమా శస్తచ్రికిత్సని చేసి బిగుసుకుపోవడాన్ని రూపుమాపగలరు. దీంతో కాళ్ళు చేతులు కొట్టుకోవడం తగ్గుతుంది. మాట బాగా వస్తుంది. నోటినుంచి లాలాజలం కారడం తగ్గుతుంది. మల, మూత్ర విసర్జన పనులు సక్రమమవుతాయి.