సంజీవని

వీటిని ధూరం పెట్టండి..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని స్వభావ సిద్ధమైన, కృత్రిమ రసాయనాల సమ్మేళనం ‘స్టిరాయిడ్స్’ అంటే.
అనబాలిక్ స్టిరాయిడ్స్‌ని కండరాలు పెరగడానికి, బలంగా కావడానికి వాడుతుంటారు. సాధారణంగా క్రీడాకారులు ఈ స్టిరాయిడ్స్‌ని వాడుతుంటారు. క్రీడలలో వాళ్ళ ప్రావీణ్యమూ పెరుగుతుంది. కానీ ఇది క్రీడలలో నిషిద్ధం. స్టిరాయిడ్స్ వాడితే క్రీడాకారుల్ని బహిష్కరిస్తారు. స్టిరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. అందుకే వాటిని వాడవద్దంటారు. రక్త, మూత్ర పరీక్షలతో స్టిరాయిడ్స్ వాడినది, లేనిది తెలుసుకోవచ్చు. స్టిరాయిడ్స్ వాడడంవల్ల ఎన్నో నష్టాలున్నాయి, భవిష్యత్తులో. అందుకే క్రీడాకారుల్ని వాడవద్దంటారు.
అనబాలిక్ స్టిరాయిడ్స్ కండర కణాల పెరుగుదలకి తోడ్పడుతుంటాయి. అంతేకాదు ఎముకల్ని పటిష్టం చేస్తాయి. గాయాలతో దెబ్బతిన్న కండర కణాలు సరిగ్గా పెరగడానికి సహకరిస్తాయి.
మామూలుగా కండరాలు బలం వంశపారంపర్య లక్షణాలు, శిక్షణ, వయసుని బట్టి ఉంటాయి. కానీ అనబాలిక్ స్టిరాయిడ్స్ వాడడంవల్ల కండరాలు కృతకంగా పెరుగుతాయి.
స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడడంవల్ల కాలేయము దెబ్బతినవచ్చు. రక్తపోటు పెరగవచ్చు. జాండిస్ రావచ్చు. మంచి కొలెస్ట్రాల్ హెచ్.డి.ఎల్ తగ్గవచ్చు. గుండె కండరాలు దెబ్బతినవచ్చు. స్టిరాయిడ్స్ మానేయడంవల్ల ఈ లక్షణాలు కొన్ని తగ్గవచ్చు. కొన్ని ప్రాణాంతకమూ అవుతాయి.
స్టిరాయిడ్స్ ప్రభావం మగ సెక్స్ గ్రంథులమీద పడి టెస్టోస్టిరాన్ హార్మోన్‌ని దెబ్బతీస్తాయి. సెకండరీ సెక్స్ గుణాలు కలుగుతాయి. స్టెరాయిడ్స్‌వల్ల మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళలో మెనుస్ట్రువల్ సైకిల్స్ దెబ్బతీస్తాయి. కొంతమంది ఆడవాళ్ళలో మగ లక్షణాలు కలుగుతాయి. ముఖంమీద, ఛాతీమీద వెంట్రుకలు పెరుగుతాయి. రొమ్ము పరిమాణం తగ్గుతుంది. మగవాళ్ళలో రొమ్ము కణాలు పెరుగుతాయి. స్టెరాయిడ్స్ వాడడం తగ్గించిన తర్వాత ఈ లక్షణాలు తగ్గచ్చు, తగ్గకపోవచ్చు.
స్టిరాయిడ్స్‌వల్ల శరీరం తూలవచ్చు. కోపం పెరగవచ్చు. అలక్సియా కలగవచ్చు. పెరుగుదల ఆగిపోవచ్చు. ఆడవాళ్ళ చర్మం మీద నూనె ఎక్కువవుతుంది. ఎవర్ని ఎలాంటి స్టిరాయిడ్స్ ఎలా దెబ్బతీస్తాయో కూడా చెప్పడం కష్టం. నొప్పుల్ని తగ్గించే మందుల్లో స్టిరాయిడ్స్‌ని కలుపుతుంటారు. అందుకని వైద్య సలహా లేకుండా కొత్త మందుల్ని వాడకూడదు.

-డా సాయి లక్ష్మణ్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్.. 9704500909