సంజీవని

షుగరుతో నపుంసకత్వం..! (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: షుగరు జబ్బు వస్తే మనిషి లైంగిక శక్తి తగ్గుతుందా, నివారణ చెప్పగలరా?
-జి.సదారావు, విశాఖపట్టణం
జ: షుగరు వ్యాధిలో మొదట తగిలే దెబ్బ లైంగిక వ్యవస్థమీదేనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. లైంగిక సుఖం ఒక్కటి కరువైతే, కోట్ల ఆస్తులుండీ, తరగని సుఖ సౌఖ్యాలుండీ, అధికారాలుండీ ఏం ప్రయోజనం? జీవితంలోని మాధుర్యాన్ని దెబ్బతీసే ఈ వ్యాధిని ఉపేక్షించడం అనర్థదాయకం..!
పురుషాంగ స్తంభన జరగనీయకుండా అడ్డుకొనే వ్యాధుల్లో షుగరు వ్యాధి మొదటిది. ఈ వ్యాధి లక్షణాన్ని ళూళషఆజళ జూజఒచిఖశషఆజ్యశ లేక ఉ అంటారు. ఒక పెన్సిలుని నిలువుగా చీలిస్తే, రెండు బద్దలుగా ఉంటుంది. పురుష జననాంగం కూడా ఇలా రెండు బద్దలు అతికినట్టు ఉంటుంది. ఈ బద్దల్లాంటి కండరాలను ష్యూఔ్య్ఘ ష్ఘ్పళూశ్యఒ్ఘ అంటారు. ఇవి సాగే గుణం కలిగిన కండరాలు. ఉత్తేజం కలిగినపుడు వీటిలోకి రక్తప్రసారం అధికంగా జరిగి ఈ కండరాలు పొంగుతాయి. అపుడు పురుషావయవం స్తంభన చెందుతుంది.
ఇదంతా మెదడు పంపించే సిగ్నల్సు మీద ఆధారపడి నడిచే ప్రక్రియ. రక్తంలోని నైట్రిక్ ఆక్సయిడ్ అనే రసాయనం అంగ స్తంభానికి ప్రధాన కారణం అవుతోంది. లైంగికోత్తేజం తృప్తినొందాక, పురుషాంగం యధాస్థానానికి వచ్చేస్తుంది.
35 శాతం నుండి 75 శాతం మధుమేహ రోగులైన పురుషులలో ఈ అంగస్తంభన వైఫల్యం ఉంది. రక్తనాళాలు దెబ్బతినటం వలన రక్తంలోని నైట్రిక్ ఆక్సయిడ్ శరీరానికి తగినంత అందకపోవడం ఇందుకు ప్రధాన కారణం అవుతోంది.
నాడీ వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా పైపొరలకు సరఫరా అయ్యే నాడులు కూడా దెబ్బతినటంవలన (శళ్పూళ జ్ఘ్ఘ్ళూౄ) లైంగిక సుఖ ఫ్రాప్తి తగ్గిపోతుంది. ఇందుకు రక్తపోటు, రక్తంలో చెడు కొవ్వు అధికంగా వుండటమూ ప్రధాన కారణలౌతాయి.
రక్తప్రసార వ్యవస్థ, నాడీ వ్యవస్థ కలిసి లైంగిక అవయవాన్ని పని చేయిస్తున్నాయి. ఆ రెండింటిలో ఏ ఒక్కటీ దెబ్బతిన్నా దాని ప్రభావం లైంగిక వ్యవస్థమీద ముందుగానూ ఎక్కువగానూ ప్రసరించే అవకాశం వుంది.
అంగస్తంభనం తగ్గిపోవటానికి కారణమయ్యే వాటిని మొదట మానేయాలి. మానేయటం అంటే, మానేయటమే! తగ్గించేశానండీ అన్నందువలన ఉపయోగం లేదు.
రక్తసరఫరాను, రక్తనాళాలను దెబ్బతీసే పొగాకు ఉత్పత్తుల వినియోగన్నా పూర్తిగా ఆపేయాలి. బీపీని అదుపులో ఉంచుకోవాలి. స్మోకింగ్ అనేది లైంగిక శక్తిని చంపే మారణాయుధం. గుట్కాలు మగటిమిని గుటకాయ స్వాహా చేస్తాయి. ఆల్కహాలు తొలి దశలో ఉత్తేజకరంగా కనిపిస్తుంది. దాంతో ఆ అలవాటుకు బానిస అవటం మొదలెడతారు. అది క్రమేణా పుంసత్వాన్ని చంపుతూ వస్తుంది. తాగి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాననే భ్రమ కూడా ఆల్కహాలిజంలో ఒక లక్షణమే!
షుగరు వ్యాధి వచ్చిన తరువాత ఆహారంలో వేపుడు కూరలు, నూనె పదార్థాలు, కొవ్వు కలిసిన పిజ్జాలు, బర్గర్లు, బజ్జీలు, పునుగులు ఇలాంటివన్నీ రక్తంలో చెడు కొవ్వు పెంచుతాయి. రక్తసరఫరాని ఈ కొవ్వు పదార్థాలు మందగింపజేస్తాయి. దాని ప్రభావం నేరుగా పురుషావయవం మీద పడుతుంది. స్తంభన శక్తి కోల్పోవటానికి కొవ్వు పదార్థాలు ఒక కారణం అవుతున్నాయి.
షుగరు వ్యాధి ఉన్న వ్యక్తి తన వయసు కన్నా ఎక్కువ వయసులో కనబడతాడు. ముసలితనం ముందుగా ముంచుకురావటాన్ని గమనించగానే రోగి జాగ్రత్తలు మొదలుపెట్టాలి. అర్థరాత్రిదాకా టీవీలకు అంటుకొనిపోవటం, తెల్లారి పొద్దెక్కేదాకా లేవకపోవటం, మధ్యాహ్నం అన్నం తింటూనే నిద్రకు ఉపక్రమించటంవలన పురుషత్వం దెబ్బతిని ముసలితనాన్ని ముందుగానే తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది!
షుగరు వ్యాధిని అదుపులో పెట్టుకోవటం అంటే జీవితాన్ని సుఖమయం చేసుకోవటం అని అర్థం. ముల్లంగి, కేరట్, బీట్‌రూట్, పిల్లిపీచర లాంటి దుంపలు, బూడిద గుమ్మడి, సొర, బీర, పొట్ల, బెండ, దొండ లాంటి కాయగూరలు, పాలకూర, మెంతికూర లాంటి చలవ చేసే ఆకుకూరలు వీటిని అతిగా మసాషాలు, చింతపండు, నూనెలతో కల్తీ చేయకుండా వండుకు తింటే షుగరు వ్యాధి వలన కలిగే అపకారాలు, ఉపద్రవాలు చాలావరకూ తగ్గుతాయి.
పులుపు వస్తువులు, పులిసిన పదార్థాలు, ఊరగాయలు, ఆల్కహాలు, పులుసు కూరలు, అతిగా చింతపండు పోసి వండే వంటకాలు.. ఇవన్నీ రేపు వచ్చే బాధల్ని ఇవ్వాళే తెచ్చిపెట్టేవిగా వుంటాయని గమనించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం, శరీరానికి తగినంత శ్రమ, తేలికగా అరిగే భోజనం, తగినంత నిద్ర- ఇవి ఈ నాలుగూ జీవితంలో సుఖాన్ని, సంతృప్తినీ పెంచే విషయాలు.
ఎసిడిటీ నివారణ
ప్ర:ఎసిడిటీ, గ్యాస్ట్రయిటిస్‌లతో బాధపడుతున్నాను, నివారణలు చెప్తారా?
-కె.ప్రసాదరావు, మధిర
జ: మన ఆహార విహారాలు, మన మానసిక ఒత్తిడులు మాత్రమే కడుపులో ఆమ్లాన్ని పెంచుతున్నాయి. కడుపులో ఆమ్లం నోరు కారణంగానే పెరుగుతోంది. దాన్ని కట్టడి చేయడం అవసరం. పులుపు పదార్థాలు, అతిగా అల్లం, వెల్లుల్లి మషాలాలు రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఉండటం ఒక ముఖ్యకారణం. పులిహోర, బిరియానీ, పలావులు ఎప్పుడో ఒకసారి సరదాగా తినవలసినవని గుర్తుంచుకోవాలి. వేడి చేసేవి ఎప్పుడో ఒకసారి తింటూ, రోజువారీ భోజనం చలవ చేసేదిగా ఉండేలా చూసుకునేవాళ్లకు ఎసిడిటీ పెరగదు. ఆల్కహాలు, పొగాకు ఉత్పత్తుల వాడకంవలన పొట్టలో ఆమ్లం తొట్టెడంత ఊరుతుంది. వీటికితోడు కీళ్లనొప్పులు, ఎలర్జీ వ్యాధులు, ఇతర దీర్ఘవ్యాధుల్లో వాడే మందులు కూడా ఆమ్లాల ఉత్పత్తికి కారణం అవుతాయి.
ఆహారపరమైన పీచు (డైటరీ ఫైబర్) ఎక్కువగా ఉండే కూరగాయల వాడకంవలన ఆమ్లాలు అదుపులోకి వస్తాయి. రోజూ కేరెట్, ముల్లంగి, యాపిల్ ఈ మూడూ సమభాగాలుగా తీసుకుని జ్యూస్ చేసుకుని తాగండి. రోజూ ఏదో ఒక సమయంలో ఒక గ్లాసు జ్యూసు తాగుతూ ఉంటే ఎసిడిటీ తగ్గుతుంది. నూనెలో వేయించిన ఏ పదార్థమైనా యాసిడ్ పెంచేదిగానే ఉంటుంది. పాలకన్నా పెరుగు, పెరుగుకన్నా మజ్జిగ ఉత్తమోత్తంగా పనిచేస్తాయి. పాలు, పాల పదార్థాలు ఈ వ్యాధిలో యాసిడ్‌ని పెంచుతాయి. పులవని పెరుగును బాగా చిలికిన మజ్జిగ ఆమ్లాన్ని తగ్గిస్తుంది. మజ్జిగచారు మెంతిమజ్జిగ, పెరుగుపచ్చడి లాంటి వంటకాలను తింటూ ఉంటే ఆమ్లం తగ్గుతుంది. ధనియాలపొడి, జీలకర్రపొడి, శొంఠిపొడి- ఈ మూడింటినీ సమభాగాలుగా తీసుకుని తగినంత ఉప్పు కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. మజ్జిగలో గానీ, మజ్జిగ అన్నంలోగానీ, పెరుగు అన్నంలో గానీ ఈ పొడిని ఒక చెంచా మోతాదులో కలుపుకుని తీసుకుంటే ఎసిడిటీ త్వరగా తగ్గుతుంది.
ఇడ్లీ, అట్టు, పూరీ, బొంబాయి రవ్వ ఉప్మా, బజ్జీ, పునుగు లాంటి టిఫిన్లు అన్నీ ఎసిడిటీని పెంచేవే! వాటిని తింటూ గ్యాస్ట్రయిటిస్‌కు మందులు వాడటంవలన ఒనగూరే ప్రయోజనం తక్కువ. టిఫిన్లకు బదులుగా మజ్జిగ అన్నం లేదా పెరుగు అన్నం తినండి. ప్రొద్దున్న పూట మెతుకు తగలకూడదనీ, టిఫినే్ల అల్పాహారం అనీ అనుకోవటం అపోహ. మజ్జిగ అన్నమే టిఫిన్ల కన్నా అల్పాహారం.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,purnachandgv@gmail.com