సంజీవని

స్పృహ తఫ్పి శ్వాస కష్టమవుతుంటే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి దగ్గర గాని, బయట ఎక్కడైనా గానీ ఓ వ్యక్తి స్పృహ తప్పినపుడు ఊరికే ఆదుర్దా పడడంగాని, అవతలివాళ్ళమీద కోపం తెచ్చుకుని అరవడంగాని సరికాదు. మనం అతని పట్ల బాధ్యతతో కొన్ని పనులు చేయాల్సిన అవసరముంది.
ఓ వ్యక్తి స్పృహ తప్పి సరిగా శ్వాసించలేని స్థితిలో ఉన్నప్పుడు అందించాల్సిన ప్రథమ చికిత్స గురించి తెలుసుకుందాం.
అతడిని లేక ఆమెని కలుసుకోవడానికి సురక్షితమా? కాదా? ముందు గమనించాలి. ట్రాఫిక్ మధ్య, మంటలు లాంటి వాటిమధ్య రోగి ఉంటే, ఇవతలికి సురక్షిత ప్రదేశానికి తీసుకురావాలి. ఎక్కువ దూరం లాక్కురాకూడదు. వెల్లకిలా పడుకోబెట్టి గడ్డాన్ని పైకెత్తితే గొంతు మూసుకుపోకుండా ఉంటుంది.
ఒకవేళ రోగి గొంతులో ఏదైనా అడ్డం పడినట్లుంటే నోటిలో వేళ్ళు పెట్టి తీసివేయాలి. శ్వాసించడానికి తోడ్పడే విధంగా నోటి నుంచి నోరులోకి గాలిని ఊదాలి. అప్పటికీ శ్వాస సరిగ్గా అందకపోంటే గొంతు పూర్తిగా సాగదీసి ఛాతిమీద చేతులతో ఒత్తుతూ శ్వాస నాళాలలో అడ్డంకులేర్పతే తొలగించడానికి ప్రయత్నించాలి.
అప్పటికీ రోగి శ్వాసించకుంటే గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవడానికి నాడి చూడాలి. ఛాతిని రెండు చేతుల్తో మర్దన చేస్తూనే ఉండాలి. శరీరం కన్నా తల ఎక్కువ ఎత్తులో ఉండేట్లు రోగిని బోర్లా పడుకోబెట్టి తలని ప్రక్కకి తిప్పి పడుకోబెట్టాలి. తల క్రింద దిండులాంటి ఎత్తులేవీ పెట్టకండి. ఒక సన్నటి దుప్పటిని ఒంటిమీద కప్పండి.
రోగిని గమనిస్తూనే ఎమర్జెన్సీ సర్వీసుకి తెలియజేయాలి. అంబులెన్స్ వచ్చేలోపు మార్పులేమైనా వస్తుంటే వాటిని గమనిస్తూ అవసరమైన ప్రథమ చికిత్సల్ని చేస్తుండాలి.