సంజీవని

పొట్ట తగ్గేది ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: నా వయస్సు 35 సంవత్సరాలు. నేను కొంతకాలంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నాను. పొట్ట పెద్దగా ఉండి చూడడానికి అసహ్యంగా ఉంది. చెమటలు ఎక్కువగా వస్తున్నాయి. థైరాయిడ్ పరీక్ష చేయించగా థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య లేదని తేలింది. మలబద్దకం సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నాను. నా సమస్యకు హోమియో వైద్యంలో ఏదైనా మందును సూచించగలరు.
రజిత, ఖమ్మం
జ: మీ సమస్యకు ‘కాల్కేరియా కార్బ్’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో వారానికి ఒక రోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున ఒక నెల పాటు వాడగలరు. అలాగే ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మానివేయాలి. స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, ఫాస్ట్ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా 45 నిమిషాలపాటు వ్యాయామం చేస్తూ మందులు వాడుకుంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.