సంజీవని

మణికట్టు నొప్పి పోయేదెలా ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతకాలంలో మారిన జీవనశైలి విధానంవల్ల, సరైన పోషక ఆహారం తీసుకోక చాలామంది మణికట్టు (వ్రిస్ట్ జాయింట్) నొప్పితో బాధించబడుతున్నారు. నిత్య జీవితంలో ఏ పని చేయాలన్నా, వస్తువులను పైకి ఎత్తాలన్నా, గట్టిగా పట్టుకోవాలన్నా, మణికట్టు కీలు మరియు కండరాల కదలికతోనే చేయవల్సి వుంటుంది. మణికట్టు కీలులో మార్పు రావడంతో నొప్పి ఆరంభమై పనులు చేయుట కష్టంగా మారుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకుంటే ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
మణికట్టు నొప్పికి కారణాలు
- మణికట్టు ఎముకలోని ‘కార్టిలేజ్’లో మార్పు రావటం
- ఆర్థ్రరైటిస్, గాంగ్లియాన్ ఏర్పడుట, కార్పెల్ టన్నల్ వ్యాధివల్ల
- మణికట్టు ఎముక ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం
- మణికట్టువద్ద కండరాలు ఒత్తిడికి లోనుకావడం
- అనుకోకుండా మణికట్టుకు దెబ్బ తగలడం వంటి కారణాలలో మణికట్టు నొప్పి వస్తుంది.
లక్షణాలు
- మణికట్టు (వ్రిస్ట్ జాయింట్) కదలిక కష్టంగా మారుతుంది.
- చేయితో వస్తువులను పట్టుకోవాలన్నా, రాత రాయాలన్నా మణికట్టు నొప్పి వస్తుంది.
- కంప్యూటర్ కీబోర్డ్స్ వాడాలన్నా నొప్పి వస్తుంది.
- నొప్పి మణికట్టు నుండి మొదలై చేతి భుజంలోకి వ్యాపిస్తుంది.
- రాత్రిపూట నిద్రలో కూడా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు
- మణికట్టు (వ్రిస్ట్ జాయింట్) నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తడం చేయకూడదు.
- నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం వలన నొప్పి తీవ్రత తగ్గుతుంది.
- మణికట్టు నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ అతిగా వాడకూడదు.
- చేయి మణికట్టు కదలికలకు సంబంధించిన వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజియోథెరపీ వైద్యుల సలహా తీసుకోవాలి.
పరీక్షలు
ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ, ఆర్.ఎ ఫ్యాక్టర్ లాంటి పరీక్షలు మణికట్టు నొప్పి తీవ్రతను తెలుపుతాయి.
చికిత్స
మణికట్టు నొప్పి లక్షణాలను మరియు వ్యక్తిత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన మణికట్టు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
మందులు
బ్రయోనియా: వీరికి మణికట్టు కదలికలవలన బాధలు ఎక్కువవుతాయ. విశ్రాంతి వల్ల తగ్గుట గమనించదగిన లక్షణము. వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికి మలబద్ధకంతో బాధపడుతుంటారు. మలము గట్టిగా వస్తుంది. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగ పెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు వాడుకోదగినది.
రస్టాక్స్: మణికట్టునొప్పి మొదటి కదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండుట గమనించదగిన ముఖ్య లక్షణం. వీరికి రాత్రిపూట బాధలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి, తేమతో కూడిన వాతావరణం వీరికి సరిపడదు. అనుకోకుండా బెణుకుటవలన వచ్చే మణికట్టు నొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
హైపరికం: మణికట్టు ఎముక మధ్య సులువుగా కదిలేందుకు ఉపయోగపడే కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవలన నాడులు ఒత్తిడికి గురై వచ్చే మణికట్టు నొప్పికి, అలాగే ఎడమ చేతికి లేదా కుడి చేతికి వ్యాపించి బాధించే కండరాల నొప్పికి ఈ మందు ప్రయోజనకారి.
ఆర్నికా: పడటంవలన మణికట్టు ప్రాంతంలో కముకు దెబ్బలు తగలటం, బెణకటం వలన నొప్పి ఉంటే ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం మణికట్టు నొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
ఈ మందులే కాకుండా రూటా, బెంజోయికి ఆసిడ్, మెడోరినం, ఆక్టియోస్పైకేట, అగారికస్, కాల్కేరియాకార్బ్, సల్ఫర్, కాలికార్బ్, కోలోసింగ్, మాగ్‌ఫాస్, సింఫైటినం వంటి మందులను లక్షణ సముదాయాన్ని పరిగణనలోకి తీసుకొని వైద్యం చేసిన యెడల మణికట్టు నొప్పి నుండి విముక్తి పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646