Others

సినీ దంపతులు -- శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవిత భాగస్వామిని నిర్ణయించుకొనే సమయంలో ఒకే రంగంలోని యువతీ యువకులు ఇంటివారైతే -చేస్తున్న వృత్తిలోని సాధక బాధకాలు ప్రత్యక్షంగా అర్థం చేసుకుని నిండైన జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి వస్తే స్వర్ణయుగం నుంచే సినిమా దంపతులను చూస్తున్నాం. స్వర్ణయుగం కాలంలో -కన్నాంబ, కడారు నాగభూషణం; శాంతకుమారి, పి పుల్లయ్య; జి వరలక్ష్మి, కెయస్ ప్రకాశరావు; భానుమతి, రామకృష్ణ; అంజలీదేవి ఆదినారాయణరావు; రాజసులోచన, సియస్ రావు; గిరిజ, సన్యాసిరాజులాంటి వారిని చెప్పుకోవచ్చు. తర్వాతి తరంలో కృష్ణ విజయనిర్మల; రోజారమణి చక్రపాణి; ఆ తర్వాతి తరంలో రాజశేఖర్ జీవిత; శ్రీహరి డిస్కోశాంతిలాంటి జంటలను ప్రస్తావించుకుంటాం. పై లిస్టంతా మాకు తెలియందా? అనుకుంటే -పెళ్లి భోజనం మిస్సైనట్టే. ఎందుకంటే -గుర్తు చేసుకున్న జంటల్లో మిస్సైన జంట వీళ్లు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన పెళ్లి వేడుక ఫొటోసహా ఇక్కడచూడొచ్చు. 1974 ఆగస్టు 15న జరిగిన పెళ్లి ఇది. ఈ పెళ్లికి మహానటుడు ఎన్టీఆర్ పెళ్ళిపెద్దగా వ్యవహరించి కడు వేడుకగా కార్యక్రమం జరిపించారు. పరిశ్రమలో అన్నిరంగాలకు చెందిన కళాకారులు హాజరై దంపతులను దీవించారు.
ముక్తాయింపు:
నటి వాణిశ్రీ ఈ పెళ్లి సందర్భంలో ఒక జోకేశారు. అది -ఈరోజు దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. మన రామక్రిష్ణకు స్వాతంత్య్రం పోయింది. చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ జంట -గీతాంజలి, రామకృష్ణల పెళ్లివేడుక.
(చిత్రం) పెళ్ళికిముందు విడుదలైన ‘దేవుడమ్మ’ చిత్రంలో గీతాంజలి, రామక్రిష్ణ.

-పర్చా శరత్‌కుమార్ 9849601717