Others

స్నేహంకొద్దీ.... - శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో నటీనటుల మధ్య సఖ్యత అంతంత మాత్రం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక తారల విషయమైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రెడ్షిప్ కొద్దీ పైకి లేదా మీడియా ముందూ ఎన్ని కబుర్లు చెప్పినా -వాళ్లమధ్య సఖ్యతకంటే ‘ఇగో’ ముందుంటుందనేది వాస్తవం. అది కొన్ని సందర్భాల్లో మీడియా ముందూ బయటపడిన సందర్భాలు కోకొల్లలు. స్వర్ణయుగ సినిమా కాలంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. ఒక హీరో చిత్రం షూటింగ్ జరుగుతుంటే -మరో హీరోవచ్చి నిర్మాత, దర్శకులను అభినందించేవారు. అలాంటి సందర్భాలు చిత్రాల రూపంలో పలు సినిమా పత్రికల్లోనూ కనిపించేవి. ఆధునిక సినిమా కాలంలో అలాంటి హ్యూమన్ రిలేషన్స్‌ని ఊహించటం కొంచెం కష్టమే. ఎఫ్‌బిల్లోనూ, ట్విటర్‌లో ప్రశంసలు గుప్పించటం వినా, కార్యక్రమానికి హాజరై విషెస్ చెప్పే సన్నివేశాలు తక్కువ.
సీనియర్ నటి బి సరోజాదేవికి హ్యూమన్ రిలేషన్స్ అంటే ప్రత్యేక ఆసక్తి. తన సహ నటీమణులను కలుస్తూనో, ఫోన్‌లో పలకరిస్తూనో టచ్‌లో ఉంటుందామె. లేదా, బెంగుళూర్‌లో ఏదోక సందర్భం పెట్టి ‘గెట్ టుగెదర్’ లాంటిది ఏర్పాటుచేసి సీనియర్లు, జూనియర్ నటీమణులను ఆహ్వానించి అందరూ ఒకచోట కలిసేలా చేయటం సరోజాదేవికి హాబీ. తన పేరిట ఒక జాతీయ అవార్డు ఏర్పాటుచేసి ఏటా ఒక సీనియర్ నటీమణిని సత్కరించటం కూడా బి సరోజాదేవి చేస్తోంది. అలాంటి ఒక సన్నివేశంలో తారామణులంతా కలిసిన సందర్భమే ఈ దృశ్యం. సరోజాదేవి ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్‌కు హాజరైన నటీమణులు జమున, హరిణి, హేమాచౌదరి, అంజలీదేవి, జయంతి, కాంచనలను ఇక్కడ చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717