Others

సూర్యాయస్కాంతం -- శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రం నిర్మించేటప్పుడు టైటిల్స్‌లో ఎవరి పేరు ముందు, ఎవరి పేరు వెనుక వేయాలోనన్న సందేహం వచ్చిందట. అందరూ గొప్పనటులే కనుక -సమస్యకు పరిష్కారం చూపలేక కేవలం పేకముక్కలపై నటీనటుల బొమ్మలు వేసి సరి అనిపించుకున్నార్ట. కానీ టైటిల్స్ విషయంలో ఎలాంటి సంశయం లేకుండా మరొక పాత్రధారి పేరును డైరెక్ట్‌గా వేసినా ఎవరి నుంచీ అభ్యంతరం రాలేదు. ఆ చిత్రం గుండమ్మ కథ. ఆ పాత్రధారి సినిమాలో గుండక్క, నిజ జీవితంలో సూర్యకాంతమ్మ. గుండమ్మగా ఆమె నటనను ఆస్వాదించడమే తప్ప, ప్రశంసించడానికి మాటలు చాలవు. అందరికీ ఆమె కావాల్సిన మనిషే కనుక -సహనటులంతా ఆమెకు తల్లిస్థానమిస్తూ సూర్యకాంతమ్మ అని పిలిచేవారు. అందుక్కారణం లేకపోలేదు. ఒక తల్లి బిడ్డలపట్ల ఎలాంటి ఆదరణ చూపుతుందో -సూర్యకాంతమ్మ సైతం సహనటుడు, సెట్లోని అందరిపట్లా అలాంటి ప్రేమ, వాత్సల్యమే చూపించేది. ఒక చిత్రంలో నాగయ్యను తూలనాడుతూ డైలాగులు చెప్పాల్సిన సీనుంది. కెమెరాముందు ఏమాత్రం తడుముకోకుండా నటనా సహజత్వాన్ని ప్రదర్శిస్తూ తూలనాడే సంభాషణలు టకటకా చెప్పేసింది. చిత్రీకరణ పూరె్తైన తరువాత నాగయ్య కాళ్లమీదపడి క్షమించమని ప్రాధేయపడింది. ‘నీ పాత్రకు తగిన సంభాషణలవి. ఆ పాత్రలో నటిస్తూ చెప్పినవేగా. దానికి బాధ పడతావెందుకు’ అంటూ నాగయ్య ఆమెను ఓదార్చార్ట. నిజ జీవితంలో సూర్యకాంతమ్మ ఔదార్యాన్ని సహనటీమణులు గొప్పగానూ, వింతగానూ చెప్పుకుంటారు. షూటింగ్ టైంలో సెట్‌కు వచ్చేటపుడు -ఇంట్లో స్వయంగా చేసిన వంట క్యారియర్‌లో సర్దుకుని తీసుకొచ్చేది. లంచ్ బ్రేక్‌లో సహనటీనటులకు తినిపించేది సూర్యకాంతమ్మ. తెరమీద సూర్యకాంతమ్మకు, నిజ జీవితంలో సూర్యకాంతమ్మకు యోజనాల తేడా. పాత్రలపరంగా తెరమీద ఎంత పిసనారో, నిజ జీవితంలో దానధర్మాలు చేయటంలో ఆమెకు ఆమే సాటి. ఇక హైదరాబాద్‌లో జరిగిన ఓ సన్మాన సభలో అగ్రనటుడు అక్కినేని నుంచి సన్మానాభినందన అందుకుంటున్న సూర్యకాంతమ్మను ఇక్కడి చిత్రంలో చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717