సర్దార్ పాటలు వచ్చేస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రంలోని పాటలను ఈనెల 20న భారీ స్థాయిలో విడుదల చేస్తారట. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రం బిజినెస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలోని పాటలను ఈనెల 20న విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సమాయత్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఈ పాటల వేడుకను నిర్వహిస్తారట. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ పనులు కూడా జోరందుకున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్ నిర్మిస్తున్నాడు.