ఆంధ్రప్రదేశ్‌

శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నుంచి నరసరావుపేటలో మూడు రోజుల పాటు వేడుకలు

నరసరావుపేట, డిసెంబర్ 10: గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీ ఏర్పడి వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నరసరావుపేట మున్సిపాలిటీ శత వసంతాల వేడుకలు జరగనున్నాయి. తొలి రోజు శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్, 300 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. ఉత్సవాల పైలాన్, స్వర్గపురి, మరుగుదొడ్లు ప్రారంభించనున్నారు. మండలంలోని ఇసప్పాలెంలో 11 వేల మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నారు. అదే గ్రామంలో మహిళలతో ముచ్చటించనున్నారు. రెండో రోజు శనివారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వస్తారు. ఆయన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి, 1500 గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. మూడో రోజున ఆదివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొని మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు అందజేయనున్నారు. మూడు రోజులు జరిగే ఈ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సినీ నటి శోభన నృత్యం, శివమణి డ్రమ్స్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ తర్వాత రోజు వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ ప్రోగ్రాం జరగనుంది. ఇప్పటికే పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. వీధులను విద్యుద్దీపాలతో అలంకరించారు. గురువారం రాత్రి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఉత్సవాల జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, టీడీపీ పట్టణ అధ్యక్షులు వేల్పుల సింహాద్రియాదవ్, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, మున్సిపల్ కమీషనర్ భానూప్రతాప్, వైస్ చైర్మన్ షేక్ మీరావలి తదితరులు పాల్గొన్నారు.