రాష్ట్రీయం

మహాకూటమి కాదు.. మాయా కూటమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలన్నీ ఏకమై మహాకూటమిగా ముందుకు వస్తున్నాయని, వారి కూటమిని ప్రజలంతా మాయకూటమిగా భావిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలకేంద్రంలోని పీఆర్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మండల టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించి పోరాడితే కాంగ్రెస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ రాష్ట్రం రాకుండా అడ్డుకున్నాయని మండిపడ్డారు. అలాంటి పార్టీలు తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు మహాకూటమి పేరుతో జత కట్టటడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు ఉన్న కూటమిని గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఉండనిస్తారా ? అన్న విషయాన్ని ప్రజలు గమనించాలని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో నాలుగున్నర ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని, జరిగిన అభివృద్ధిని చూసి ఇక తమకు పుట్టగతులు ఉండవనే భయంతో అభివృద్ధిని అడ్డుకునేందుకే అన్ని పార్టీల జతకట్టాయన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్రోకర్‌ల పార్టీ అని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డే స్వయంగా ప్రకటించారని, ఆయనతో పాటు ఆయన సోదరుడు కూడ బ్రోకరేనని చెప్పుకున్నారని చమత్కరించారు. బ్రోకర్‌లు ఉండే కాంగ్రెస్‌ను గెలిపిస్తారా, సేవకుల్లా పనిచేసే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజలు తమ కోసమే ఎదురూచూస్తున్నారని ఊహలోకంలో ఉన్నారని, ప్రజలు ఎదురుచూస్తుంది నిజమే అయినప్పటికీ కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పట్టేందుకు అని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని, ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్ధానాలను, ఆతర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గులాబీజెండాను ఎగురవేస్తాని ధీమా వ్యక్తంచేశారు. అదేవిధంగా నకిరేకల్ స్థానం నుండి వేముల వీరేశం 50వేల మెజార్టీతో విజయం సాధించనున్నారన్నారు. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో రూ.220కోట్లతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేశామన్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధిసంస్ధ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, టీఆర్‌ఎస్ నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కిశన్‌రావు తదితరులు పాల్గొన్నారు.