రాష్ట్రీయం

భాషావేత్తలతో సమావేశమైన ఉప రాష్ట్రపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జిల్లాలోని వెంకటాచలంకు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకటాచలంలో ఏర్పాటు చేసిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించనున్నారు. ఇందులో భాగంగా భాషావేత్తలతో ముందస్తుగా సోమవారం నిర్వహించిన కార్యగోష్టిలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. భాష, సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు నిపుణులు, భాషా వేత్తలు, భాషాభిమానుల సలహాలు తీసుకుంటే ప్రణాళికలు తయారుచేసుకోవడానికి అనువుగా ఉంటుందన్న ఉపరాష్ట్రపతి సూచనతో ఈ ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యగోష్టిలో తెలుగు భాషా పండితులు నాలుగు బృందాలుగా ఏర్పడి శాసనాలు, లిపి, చరిత్ర, తాళపత్ర గ్రంథాలు, భాషా వ్యాకరణం, ప్రాచీన ఆధునిక జానపద సాహిత్యాలు, డాక్యుమెంటైజేషన్, డిజిటలైజేషన్, అనువాదం మొదలైన అంశాలపై తమ అభిప్రాయాలను కేంద్ర నిర్వాహకులకు నివేదిక రూపంలో అందచేశారు. తెలుగు భాష అభివృద్ధి కోసం అధ్యయన కేంద్రంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రాచీన హోదా అంటే ఏమిటి? దీనికి సంబంధించి విశిష్ట అధ్యయన సంస్థ చేపట్టే కార్యక్రమాలు ఏమిటనే అంశాలను తెలుసుకున్నారు.
అనంతరం భాషావేత్తలతో కలిసి ఉప రాష్ట్రపతి సహ పంక్తి భోజనం చేశారు. అంతక్రితం చెన్నై నుండి ప్రత్యేక రైలులో వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయనకు తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్‌రావు, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, వాకాటి నారాయణరెడ్డి, కలెక్టర్ ఎం.వి.శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లు స్వాగతం పలికారు. వెంకటాచలంలోని స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో జరిగిన కార్యక్రమాల్లో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. ఇక్కడి ప్రజా మందిరంలో ప్రదర్శించిన ‘్భవన విజయం’ నాటకాన్ని ఆద్యంతం ఆయన వీక్షించి కళాకారులను అభినందించారు. పర్యటనలో భాగంగా మంగళవారం భాషావేత్తల కార్యగోష్టి ముగింపు సమావేశంలో ఉప రాష్టప్రతి ఉపన్యసించనున్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో కలిసి విక్రమ సింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భాషావేత్తల కార్యగోష్టిలో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీవరప్రసాద్, అధ్యయన కేంద్రం పిడి ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి చెల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
''చిత్రాలు.. వెంకటాచలంలో తెలుగు భాషావేత్తలతో సమావేశమైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
*సాహితీ, భాషా వేత్తలతో కలిసి భువన విజయం నాటకాన్ని తిలకించిన అనంతరం మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు