రాష్ట్రీయం

తెలుగు భాషాభివృద్ధికి సమష్టి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 21: తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనదని, తెలుగు భాషాభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై తెలుగు భాషాభిమానులతో నిర్వహించిన కార్యగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగు గొప్పదనాన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం మైసూరులో ఉన్న అధ్యయన కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చామని తెలిపారు. చరిత్రలో ఈ ఘట్టం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తెలుగు భాషాభిమానులు నాలుగు బృందాలుగా ఏర్పడి అధ్యయన కేంద్రంలో భాషాభివృద్ధికి తీసుకోదగిన అమూల్యమైన సలహాలను ఇవ్వడాన్ని అభినందించారు. భాష పట్ల ప్రేమ, అభిమానం, శ్రద్ధ చూపించి ప్రతి రాష్ట్రంలో ఈ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. భారతీయులందరూ ఎక్కడ ఉన్నా తమ మాతృభాషను మరువకూడదని హితవు పలికారు. సంస్కృతి, ఆచార వ్యవహారాలకు భాషే ముఖ్యమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరిని అనుసంధానం చేయాలని, అందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని అధ్యయన అధికారుకలు సూచించారు. భాష సజీవ సమాజ దర్పణమని, అమ్మ పాల అందించిన బలాన్ని భాష అందిస్తుందన్నారు. ప్రాథమిక విద్య వరకూ మాతృభాషలోనే కొనసాగాలని, దేశంలో తాను ఎక్కడికి వెళ్లినా ఇదే చెబుతానని స్పష్టం చేశారు. చారిత్రాత్మక స్థలమైన అమరావతిలో దొరికిన పలు అపురూపమైన గ్రంథాలు తెలుగు భాష విశిష్టతకు ఆధారాలుగా ఉన్నాయన్నారు. తెలుగు భాష మాధుర్యాన్ని గుర్తు చేసిన నందమూరి తారక రామారావు, విశ్వనాథ సత్యనారాయణలను ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏవైనా పనులు ఉంటే వాటి సాధనకు రాజకీయాలతో సంబంధం లేకుండా కృషి చేస్తానని హామీనిచ్చారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్ పొక్రియాల్ విశాంక్ మాట్లాడుతూ వెంకయ్యనాయుడు తనలాంటి ఎందరో వర్ధమాన రాజకీయ నేతలకు ఆదర్శమన్నారు. స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో పేద విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను చూడడం జరిగిందని, అందుకు కృషి చేస్తున్న దీపా వెంకట్‌ను మంత్రి అభినందించారు. తెలుగు అధ్యయన కేంద్రం నెల్లూరుజిల్లాకు రావడం వెనుక వెంకయ్యనాయుడు కృషి ఎంతో ఉందన్నారు. కవి తిక్కన జన్మించిన నెల్లూరుకు రావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. శబ్దాలలోనే శక్తి ఉంటుందని, శబ్దాలకు కేంద్ర బిందువైన భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధికి వెంకయ్యనాయుడు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి అనేవి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనవన్నారు.
'చిత్రం... వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ హరిచందన్ తదితరులు