రాష్ట్రీయం

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులపై లాఠీఛార్జి చేయించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన పార్టీ నిద్రపోదని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. ఆడపడుచులు, అన్నదాతలు, దివ్యాంగుల ఒంటిపై పడిన దెబ్బలే వైసీపీ సర్వనాశనానికి దారితీస్తాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మూడు కాదు 30 రాజధానులు పెట్టినా తిరిగి రాజధానిని అమరావతికే తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు మంగళవారం పవన్‌కు కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పవన్‌కు ఏకరువు పెట్టారు. పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన రైతులు, దివ్యాంగులు, మహిళల బాధలు తెలుసుకుని పవన్ తీవ్రంగా స్పందించారు. రాజధాని కోసం తమ భూములు త్యాగం చేసి, బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టిన మీ చేత ప్రభుత్వం రక్తం చిందించేలా చేయడం పాశవిక చర్యగా అభివర్ణించారు. రాజధాని పరిరక్షణ కోసం అమరావతి పరిరక్షణ సమితితో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. నేడు రాజధాని రైతుల కష్టాలను ఢిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వ ముఖ్యులకు వివరిస్తామని పవన్ పేర్కొన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలనేది ఐదు కోట్ల మంది సమష్టిగా తీసుకున్న నిర్ణయమని, రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులను నేడు ప్రభుత్వం వంచిస్తోందని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే దానిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలే తప్ప ఏకంగా రాజధానినే మార్చేయాలని చూడటం సరికాదన్నారు. అమరావతి రాజధానిలో వైసీపీ నాయకులకు భూములు ఉంటే రాజధాని మార్చేవారే కాదని, విశాఖలో భూములు ఉన్నాయి కాబట్టే అక్కడికి మార్చేస్తున్నారని ఆరోపించారు. మట్టి మనిషితో కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించినట్లు చరిత్రలో లేదన్నారు. పోలీసుశాఖను రౌడీయిజం చేసే స్థాయికి దిగజార్చారని, వారి వ్యక్తిత్వాన్ని చంపేశారన్నారు. ప్రభుత్వ ఆలోచనా విధానానే్న పోలీసు శాఖ తీసుకోవడం బాధ కలిగించిందన్నారు. తాజాగా సోమవారం గాయపడిన రైతులను పరామర్శించేందుకు వెళ్తానంటే పోలీసులు అడ్డుకున్నారని, దాదాపు 400 నుండి 500 మంది పోలీసులు మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టారన్నారు. డిఐజి స్థాయి అధికారులను పంపించి నిర్భందించారని, సుమారు ఐదు గంటల పాటు పార్టీ కార్యాలయం నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేశారన్నారు. మేము తలచుకుంటే పోలీసు వలయాలను ఛేదించగలమని, అయితే గొడవ జరిగితే జనసేన నాయకులు, కార్యకర్తల ముసుగులో పోలీసులపై రాళ్ల దాడి చేయడానికి వారి మనుషులు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వారికి అవకాశం ఇవ్వకూడదనే ముందుచూపుతోనే సంయమనం పాటించామని పవన్ వివరించారు. ఈ రోజు రాజధాని ప్రాంత రైతులను మోసం చేసిన వారు రేపు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయకుండా ఎందుకుంటారని ప్రశ్నించారు. నేడు 151 ఎమ్మెల్యేలను గెలిచిన వైసీపికి భవిష్యత్తులో ఒక్క ఎమ్మెల్యే స్థానం లభిస్తే గొప్ప అనే పరిస్థితి వచ్చేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. సచివాలయం ఉద్యోగులు రాజధాని ఆందోళనకు సంఘీభావం తెలపాలని, రాజకీయ నాయకులు అశాశ్వితమైన వ్యవస్థను పక్కనబెట్టి శాశ్వతమైన ప్రజలను నమ్మి వారి పక్షాన నిలిచి పోరాటాలు చేయాలని పవన్‌కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
న్యాయ పరమైన సూచనలు ఇవ్వండి
రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లు, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ బిల్లుపై సమగ్రంగా అధ్యయనం జరిపి న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్లాలో సూచించాలని పార్టీ న్యాయ విభాగం నేతలను పవన్ కోరారు. లీగల్ విభాగంలోని సభ్యులు కేవలం న్యాయపరమైన కార్యక్రమాలకే పరిమితం కాకుండా పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని సూచించారు. రాజధాని మార్పును అడ్డుకునేందుకు అవసరమైన న్యాయ సలహాలు ఇవ్వాలన్నారు.
గోదావరి జిల్లాల్లో మాటలతో అయ్యే రాజకీయాలను వైసీపీ నాయకులు కత్తులు, కటారుల వరకూ తీసుకువచ్చారని జనసేనాని పవన్ పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లో సీమ తరహా రాజకీయం ఉండదని, పెద్దరికం మాత్రమే ఉంటుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరుల చేతిలో దాడికి గురైన జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ జనసేన కేంద్ర కార్యాలయంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాయలసీమలో ప్రతి ముద్దకు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయని అన్నారు.
తులు ఉండవన్నారు. గోదావరి జిల్లాలకు కూడా అలాంటి సంస్కృతిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రం నుండి ఈ తరహా క్రిమినల్ రాజకీయాలను పారద్రోలాలన్నదే తన లక్ష్యమని పవన్ పేర్కొన్నారు.
'చిత్రం... రాజధాని ప్రాంత మహిళల గోడు వింటున్న జనసేనాని పవన్‌కళ్యాణ్