రాష్ట్రీయం

ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25:ప్రజా రవాణాలో ప్రయాణికులకు భద్రతను కల్పిస్తూ సురక్షిత ప్రయాణం కోసం రాష్ట్ర ఆర్టీసీ అధికారులు భద్రతా వారోత్సవాను నిర్వహిస్తున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల్లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిపోల్లో ప్రయాణికు సంఘాలు, న్యాయ, పోలీస్, ఇతర ప్రముఖ వ్యక్తులను డిపోలకు ఆహ్వానిస్తున్నారు. స్థానిక డిపో సూపర్ వైజర్లు, డ్రైవర్లుకు సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. రోడ్డు భద్రతపై సంస్థ సిబ్బంది, ప్రయాణికులకు అవగాహన పెంచడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. రోడ్డు భద్రతపై విస్తత్ర ప్రచారం ద్వారా ప్రజలకు వివరించడానికి వీలైతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బ్యానర్లు, పోస్టుర్లు. స్టిక్కర్లు వంటి ప్రచార సామాగ్రిని ఆయా డిలోలకు పంపుతున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సిబ్బందికి ప్రత్యేక మెడికల్ క్యాంపులు, సురక్షిత డ్రైవింగ్‌పై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.
ప్రమాద రహిత డ్రైవింగ్ చేసిన డ్రైవర్లకు నగదు ప్రోత్సాహాలను ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. డిపో, రీజియన్, జోనల్ స్థాయిలో సురక్షిత డ్రైవింగ్ చేసిన డ్రైవర్లకు నగదును ఇవ్వబోతున్నారు. ప్రథమ బహుమతి రాష్టస్థ్రాయి డ్రైవర్‌కు రూ.12వేలు, ద్వితీయ బహుమతి రూ.10వేలు, తృతీయ బహుమతి రూ.8వేలు ఇవ్వనున్నారు. జోనల్, రీజియన్, డిపోల స్థాయిలో ఉత్తమ డ్రైవర్లకు నగదు ఇవ్వనున్నారు. రాష్టస్థ్రాయి కేటగిరి 1కు 99.000, కేటగిరి 2కు రూ.20,000, కేటగిరి 3కి రూ. 18,000 ప్రకటించారు. 2018-19 సంవత్సరంలో అతి తక్కువ ప్రమాదాల రేటు నమోదు చేసిన డిపోలకు చెందిన డీఎంలను ఆర్టీసీ ఎండీ ప్రశంసించారు.