రాష్ట్రీయం

ఖమ్మంలో అన్నీ కారుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 25: మున్సిపల్ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్ ఖాతాలోకే వెళ్ళాయి. ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాల్టీలను ఈ నెల 22న ఎన్నికలు జరగగా, శనివారం కౌంటింగ్ నిర్వహించారు. సత్తుపల్లి మున్సిపాల్టీలో మొత్తం 23 వార్డులు ఉండగా 6 వార్డులను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోగా 17 వార్టులకు ఎన్నికలు జరిగాయి. అందులో 16 వార్డులు అధికార టీఆర్‌ఎస్ గెలుచుకోగా ఒక వార్డులో ఆ పార్టీ బలపరచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సత్తుపల్లి మున్సిపాల్టీలో టిఆర్‌ఎస్ మినహా మరే పార్టీకి ప్రాతినిధ్యం లేకుండాపోయింది. మధిర మున్సిపాల్టీలో మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఎం, సీపీఐ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం అధికార పార్టీవైపే మొగ్గుచూపారు. ఇక్కడ 22వార్డులకు గాను 13వార్డుల్లో టీఆర్‌ఎస్ 8చోట్ల కూటమి, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వైరా మున్సిపాల్టీలో 20వార్డులకు గాను 15చోట్ల టీఆర్‌ఎస్, రెండు చోట్ల కాంగ్రెస్, ఒకచోట సీపీఎం, రెండుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కొత్తగూడెం మున్సిపాల్టీలో 36వార్డులకు గాను టీఆర్‌ఎస్ 25, సీపీఐ 8, కాంగ్రెస్ 1, స్వతంత్రులు రెండుచోట్ల విజయం సాధించారు. ఇల్లెందులో 24వార్డులకు గాను 19చోట్ల టీఆర్‌ఎస్, ఒకచోట సీపీఐ, మరోక చోట సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.