రాష్ట్రీయం

‘విలీన’ సమస్యల్లో ఆర్టీసీ కార్మికులు విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జనవరి 27: ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశతో ప్రభుత్వంలో సంస్థ విలీనాన్ని కోరుకోగా, నేడు కార్మికులు, ఉద్యోగులకు ఎన్నో సమస్యలు ఎదురౌతున్నాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు వాపోయారు. కార్మికులు, ఉద్యోగుల ఆకాంక్షలకు భిన్నంగా కమిటీ నివేదికలు ఇచ్చినందునే సౌకర్యాలు కోల్పోతున్నామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూన్ 12న సమ్మె విరమణ సందర్భంగా సీఎం జగన్ జేఏసీ నాయకత్వానికి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. కానీ ప్రస్తుతం విలీనం ద్వారా పీటీడీలోకి వచ్చే 52వేల మందికి పెన్షన్‌పై టెన్షన్ పట్టుకుందన్నారు. కమిటీ సూచిస్తున్నట్లు ఓల్డ్ పెన్షన్ స్కీమ్, సీపీఎస్ వల్ల కార్మికులకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. జీతభత్యాల్లో వ్యత్యాసాలను సరిచేయడం పైనా కమిటీ రిపోర్టులో ఎలాంటి క్లారిటీ లేదన్నారు. రైల్వే మాదిరిగా ట్రేడ్ యూనియన్లను, బస్‌పాస్‌లను కొనసాగించే అవకాశాలున్నా యాజమాన్యం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్టీసీ కార్మికులు కోరుకున్న పెన్షన్ రాలేదు సరికదా కార్మికుల డబ్బుతో ఏర్పాటు చేసుకున్న ఎస్‌ఆర్‌బీఎస్ పెన్షన్‌ను కూడా ఈ నెల నుండి రద్దు చేశారన్నారు. అంతేకాకుండా ఎస్‌బీటీనీ రద్దు చేశారన్నారు. నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడే, సంస్థ పరిరక్షణ కోసం పరితపించే యూనియన్లను కించపరిచేలా రద్దు చేస్తామని బహిరంగ ప్రకటనలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటినీ సీఎం, రవాణా మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున కలిసి వివరిస్తామన్నారు. ఆర్టీసీ విలీనం ద్వారా కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లి, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 7న విజయవాడలో జరిగే ఈయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ నిర్ణయాలపై చర్చిస్తామని దామోదరరావు వివరించారు.