రాష్ట్రీయం

శంబర పోలమాంబ జాతరకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, జనవరి 28: విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబరలోని గిరిజనుల ఆరాధ్య దైవం శంబర శ్రీపోలమాంబ అమ్మవారి జాతరకు మంగళవారం భక్తజనం పోటెత్తింది. సోమవారం తొలేళ్ల ఉత్సవం అనంతరం మంగళవారం నిర్వహించిన సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకుని ఉత్తరాంధ్ర, తెలంగాణా, ఒడిశా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఆశీస్సులు తీసుకున్నారు. మంగళవారం వేకువ జాము నుంచే అమ్మవారి ప్రధాన ఆలయం, వనంగుడి వద్ద భక్తులు బారులుతీరి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. సిరిమానోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు సుమారు 3 లక్షల మంది భక్తులు తరలివచ్చారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఏఎస్పీ గౌతమిశాలి, ఓఎస్‌డీ రామ్మోహనరావు ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు జన్ని పేకాపు జగదీశ్వరరావుప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సిరిమానును అధిరోహించారు. సిరిమాను ముందుగా మునసబు, కరణం, గిరడ వారిళ్ల వద్దకు వెళ్లి పూజలందుకున్న అనంతరం నడిమివీధి మీదుగా పనుకువీధి, గొల్లవీధి, రామమందిరం వద్దకు చేరుకుంది. దీంతో భక్తులు పసుపుకుంకుమతోపాటు పండ్లు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, రోప్‌పార్టీ బలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు.
*చిత్రం... గ్రామంలో ఊరేగుతున్న సిరిమాను