రాష్ట్రీయం

నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. నకిలీ వెబ్‌సైట్లను సంప్రదించి మోసపోయినట్లు పలువురు భక్తుల నుండి టీటీడీకి పిర్యాదులు అందాయి. ఈ మేరకు టీటీడీ నిఘా , భద్రతా విభాగం అధికారులు సదరు నకిలీ వెబ్‌సైట్లపై పోలీస్‌స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. వీటిపై విచారణ జరుగుతోంది. శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకునేందుకు అధికారికంగా tirupatibalaji.ap.gov.in, ttdsevaonline.com వెభ్‌సైట్లు మాత్రమే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానములకు సంధించిన సమాచారం కోసం www.tirumala.org వెభ్‌సైట్‌ను సంప్రదించవచ్చును.