రాష్ట్రీయం

అడవుల్లో అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయి సిబ్బంది ఎండాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అటవీ శాఖ అధికారి (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్) ఆర్. శోభ ఆదేశించారు. నల్లమల అడవుల్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ అధికారులతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరణ్యభవన్ నుండి మాట్లాడారు. అగ్నిప్రమాద నివారణ చర్యలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని శోభ సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణపై అటవీ మార్గాలు, అడవుల వెంట ఉండే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని సూచించారు. 43 అటవీ రేంజ్‌లలో 1106 ప్రాంతాలు అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్న వాటిగా గుర్తించామని పేర్కొన్నారు. వీటిల్లో కనీసం ఐదురుగు సిబ్బంది, వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్ పరికరాలతో వెంటనే క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 9,771 కంపార్ట్‌మెంట్లలో ఫైర్‌లైన్లను ఏర్పాటుచేసి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని శోభ సూచించారు.
అడవుల్లో అగ్నిప్రమాదాలను ఉపగ్రహం ద్వారా మానిటర్ చేసే విధానం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) ద్వారా అమల్లోకి వచ్చిందని శోభ గుర్తు చేశారు. అగ్నిప్రమాదం ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో సంబంధిత అధికారులతో పాటు గ్రామ కార్యదర్శికి కూడా ఫోన్ సందేశం వెళుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 11,700 పేర్లు, నెంబర్లు ఇందుకోసం రిజిస్టర్ చేశామని తెలిపారు.
అగ్నిప్రమాదాల నివారణా చర్యల కోసం అవసరమైన నిధులను అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంచనున్నట్టు శోభ తెలిపారు. ఫిబ్రవరి నుండి మే నెల వరకు అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అటవీ మార్గాల్లో ప్రయాణీకులకు నిప్పువల్ల జరిగే అనర్థాల గురించి తెలియచేయాలన్నారు. వంట చేయడం, సిగరెట్, బీడీలాంటివి పడేయకుండా చూడాలన్నారు. నల్లమలలో ఇటీవల జరిగిన రెండు అగ్నిప్రమాద సంఘటనల్లో ఒకటి పశువుల కాపరుల, మరొకటి ప్రయాణీకులు విసిరిన సిగరెట్/బీడీల వల్ల జరిగాయన్నారు.
మేడారం జాత జరుగుతున్న అటవీ ప్రాంతంలో కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ పునరుజ్జీవన చర్యలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణ పురోగతి, కంపా నిధులతో చేపట్టిన పనులు, ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు, వచ్చే సంవత్సరం చేపట్టాల్సిన హరితహారం కోసం నర్సరీల సంసిద్దతపై చర్చించారు.
ఈ సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్, ఆర్‌ఎం డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎంసీ పర్గెయిన్, సిద్దానంద్ కుక్రెటీతో పాటు జిల్లాకు చెందిన అటవీ అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న శోభ