రాష్ట్రీయం

పెళ్లితో చదువుకు స్వస్తి చెప్పకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పెళ్లి అయ్యిందని చదువును మహిళలు ఆపేయవద్దని, చదువు కొనసాగించాలని, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. వివాహం అయిన తర్వాత కూడా లక్ష్యాలను సాధించుకోవచ్చని, అందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన దిశ ఘటన తనను ఎంతో కలచివేసిందని ఆమె వ్యాఖ్యానించారు. అమ్మాయిలు చిన్నతనం నుండి మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవాలని గవర్నర్ సూచించారు. పాఠశాల స్థాయి నుండే పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించేలా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బుధవారం నాడు నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఆమె పట్టాలు ప్రదానం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని గవర్నర్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు గురువుల ప్రోత్సాహం ఎంతో అవసరమని ఆమె చెప్పారు.

*చిత్రం... ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ స్నాతకోత్సవంలో విద్యార్థినులకు పట్టాలు ప్రదానం చేస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్