రాష్ట్రీయం

సింధువీర్ మరమ్మతులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: భారత నౌకాదళంలో విశేష సేవలందిస్తున్న ఐఎన్‌ఎస్ సింధువీర్ జలాంతర్గామి మరమ్మతులు పూర్తి చేసుకుని సేవలందించేందుకు సిద్ధం కానుంది. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్ సింధువీర్‌కు రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ నెలాఖరు నాటికి సింధువీర్‌ను నౌకాదళానికి అప్పగించాలి. అయితే షిప్‌యార్డ్ సీఎండీ రియల్ అడ్మిరల్ ఎల్‌వీ శరత్‌బాబు చొరవ, ఉద్యోగుల శ్రమ కారణంగా అనుకున్న దానికంటే 14 రోజులు ముందుగానే రక్షణ శాఖకు అప్పగించనున్నారు. ఈనెల 9న ఐఎన్‌ఎస్ సింధువీర్‌ను రక్షణ శాఖకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా చిన్నతరహా పరిశ్రమల సహకారం, స్థానిక వృత్తి నిపుణుల సేవలను ఉపయోగించుకుని అనుకున్న సమయం కంటే ముందుగానే సింధువీర్‌ను పూర్తి చేసినట్టు సీఎండీ శరత్‌బాబు తెలిపారు.
*చిత్రం... మరమ్మతుల అనంతరం సేవలకు సిద్ధంగా ఐఎన్‌ఎస్ సింధువీర్