రాష్ట్రీయం

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడునిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నాలాయిర దివ్యప్రబంధ మహోత్సవం ఘనంగా జరిగింది. జీయర్‌స్వాముల వెంట పండితులు చక్కటి స్వరంతో దివ్యప్రబంధ పారాయణం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన నాలాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని దాదాపు 200 మంది పారాయణదారులు స్వామివారి వాహనం ఎదుట పాశురాలను పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, సి వెంకటప్రసాద్‌కుమార్, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్ లోకనాథం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, హెచ్‌డీపీపీ కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
*చిత్రం...తిరుమల మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారు